జగన్ అంటే నమ్మకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అంటే నమ్మకం

జగన్ అంటే నమ్మకం

Written By news on Tuesday, January 1, 2013 | 1/01/2013

ఈ రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకటైతే, 30 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం రెండోది. రాజన్న ఆశయాల కోసం ప్రజల హృదయాల నుంచి జనించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడోది.
డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయనపై రాష్ట్ర ప్రజలు ప్రత్యేక అభిమానాన్ని, ప్రేమను, నమ్మకాన్ని పెంచుకున్నారు. కారణం ఆ మహానేత పేద ప్రజల జీవితాలను ప్రత్యేకంగా ప్రభావితం చేయడం. అందుకే 2009లో కూడా ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. మహానేత దివంగతులైన తరువాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రజలకు నమ్మకాన్ని, పేదలకు భరోసాను ఇవ్వలేకపోయారు.

తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆంధ్రుల అభిమాననటుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ రా... కదలిరా... అని పిలిస్తే కోట్లాది జనం ఆయన వెంట నడిచారు. పేద, బడుగు, బలహీనవర్గాల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కాని పార్టీలో నమ్మకంగా ఉండే వ్యక్తే నమ్మకద్రోహానికి పాల్పడి గదె ్దదించితే సింహంలా గర్జించి ప్రజలలోకి వెళ్లి, మళ్లీ అధికారాన్ని తెచ్చుకున్నారు. కాని ఈసారి అయినవాళ్లే మళ్లీ నమ్మకద్రోహానికి పాల్పడి ఎన్టీయార్‌ను గద్దెదించితే, ఆ నేత ‘‘తమ్ముళ్లారా! మోసపోవద్దు’’ అని పిలుపునిస్తే, ఆ నేతపై చెప్పులు వేసి అవమానించి, తన సొంతవారి పార్టీనే హైజాక్ చేసి, ఆ నేత మరణానికి కారణమైన వాళ్లు ఈ రోజున వారసులం అంటున్నారు. చంద్రబాబు 9 సంవత్సరాల పాలనను ప్రజలు చూశారు. అన్ని రంగాలనూ నిర్వీర్యం చేసిన ఈ చంద్రబాబునాయుడే ‘‘మళ్లీ నా మీద నమ్మకం ఉంచండి’’ అని ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. ఆయనకు ఆ దురవస్థ ఎందుకు వచ్చింది? అందరినీ ఎప్పుడూ మోసం చేస్తుంటాడనే అభిప్రాయం ప్రజల్లో వచ్చినందుకే కదా. 

ఇక కోట్లాది జనం అనుసరించాలని నిర్ణయించుకున్న పార్టీ... వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ. ‘నీతో నడవడానికి మేం సిద్ధం’ అంటూ జనం ఆయనపై నమ్మకం పెంచుకున్నారు. ప్రజలు... జగన్ తండ్రి అయిన వై.ఎస్.ఆర్.పై ఎంతటి నమ్మకాన్ని పెంచుకున్నారో... ఆయన కుమారుడైన జగన్‌పైనా అంతే నమ్మకాన్ని పెంచుకున్నారు. అప్పట్లో కడప ఎన్నికల ప్రచారంలో డా.వై.యస్.రాజశేఖరరెడ్డి ‘‘యువకుడు, ఉత్సాహవంతుడు ప్రజలకు మేలుచేయడానికి రాజకీయాలలోకి వస్తున్నాడు. మీ కొడుకు లాంటివాడు, మీ తమ్ముడు లాంటివాడు. ఆశీర్వదించి, ఆదరించి అఖండమైన మెజార్టీతో జగన్‌ను గెలిపించండి’’ అని కోరిన మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ప్రజలకు మరిన్ని మేళ్లు చేయడానికి సంసిద్ధులు అవుతున్న క్రమంలో ఆ మహానేత మన నుండి దూరమయ్యారు. తండ్రి చనిపోయిన స్థలం నుండి జగనన్న చెప్పిన మాటే ఈ రోజున వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీ అవతరించడానికి కారణం. 

ఆ రోజున ఓదార్పుయాత్ర అనే మాటే లేకుంటే ఆజాద్ చెప్పినట్టు జగన్ కేంద్రంలో మంత్రి అయ్యేవారు, ఇప్పటికి ముఖ్యమంత్రి అయ్యేవారు. ఓదార్పు యాత్ర అంటే అది యాత్ర కాదు. నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు చేసిన ఒక మహాయజ్ఞం. ఎవరైతే ఆ మహానేత మరణాన్ని తట్టుకోలేక చనిపోయారో ఆ కుటుంబాలను అక్కున చేర్చుకోవడమే ఓదార్పుయాత్ర. ఓదార్పు యాత్ర జగనన్న జీవితగమనాన్నే మార్చివేసింది. కుట్ర, కుతంత్రాలతో కాంగ్రెస్ పెట్టే పరమాన్నం కన్నా ప్రేమ, విశ్వాసం, నమ్మకంతో పేదప్రజలు పెట్టే పెరుగన్నమే మేలని తలచాడు జగనన్న. అందుకే ఆంధ్రరాష్ట్ర ప్రజలు జగనన్నపై నమ్మకాన్ని పెంచుకున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమకున్న నమ్మకాన్ని రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
- షేక్ రఫీ, గుడ్లూరు, ప్రకాశం జిల్లా

ఓర్వలేకే జగన్‌పై నిందలు 

జగన్ పేరు వినగానే ఉప్పొంగని హృదయం ఉండదు. ఏ సభలకైతే ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారో, ఎవరి పేరు వినగానే పనులు, ఉద్యోగాలు మానుకుని ఎదురుచూస్తారో ఆ వ్యక్తే జగన్. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలతోనే ఉంటూ, వారి కష్టాలను తెలుసుకుంటూ ఉంటే, ఆ వ్యక్తిపైన బురద జల్లుతున్నారు! జగన్‌కి ఉన్న ప్రజాదరణను చూసి సహించలేక, సీబీఐ పేరుతో ఆ వ్యక్తిని జైలు పాలు చేశారు! ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు ఆ పార్టీలకు తప్పక గుణపాఠం చెప్తారు. 

- పఠాన్. జాని, పోతవరం, గుంటూరు
Share this article :

0 comments: