ఉన్నతుడు రాజన్న... వారసుడు జగనన్న - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉన్నతుడు రాజన్న... వారసుడు జగనన్న

ఉన్నతుడు రాజన్న... వారసుడు జగనన్న

Written By news on Thursday, January 10, 2013 | 1/10/2013


కేంద్రంలో ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ నినాదంతో నిరుపేదలకు దగ్గరై భూసంస్కరణలు కొంతమేర అమలుచేసి అణగారిన వర్గాల నోట ఇందిరమ్మ రాజ్యం అనిపించుకుంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ రామరాజ్యం తీసుకొచ్చి కూడా ఇందిరమ్మ రాజ్యమని చెప్పడం విశేషం. గతంలో కాంగ్రెస్‌పార్టీ అంతర్గత కలహాల వల్ల ప్రజావిశ్వాసం కోల్పోయి, ఎన్టీఆర్, చంద్రబాబులకు బంగారు, వెండిపళ్లాలతో అధికారం అప్పగించింది. అంతటి దిక్కుమాలిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండగా, మళ్లీ ఆ పార్టీలో జవసత్వాలు నింపి, చంద్రబాబు నియంత పాలన నుంచి తెలుగుజాతిని విముక్తి చేయడానికి వై.ఎస్. పాదయాత్ర చేపట్టి, రెండుసార్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఒంటిచేత్తో గెలిపించారు. ఆయన అకాల మరణంతో రాష్ట్రం తిరోగమనం పాలైంది. ఆయన ఆశయాలు కొనసాగిస్తున్న జగన్‌ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న కాంగ్రెస్‌కు నూకలు చెల్లిపోతున్నాయి. జగన్ రాజ్యాధికారంలోకి రావడం ఖాయం.

- కోట మురళీధర్, టెక్కలి, శ్రీకాకుళం

నువ్వు లేక - నువ్వు రాక

కాలుతున్న కడుపులెన్నో
ఆరుతున్న గుండెలెన్నో
కూలిపోయెను గుడిసెలెన్నో
మూగబోయెను గొంతులెన్నో
ఎండిపోయెను పంటలెన్నో
రాలిపోయెను ఆశలెన్నో
ఎందుకంటే ఏమిటంటే
నువ్వు లేక నువ్వు రాక

ఆగిపోయెను శ్వాసలెన్నో
ఆవిరయ్యెను బతుకులెన్నో
పేదవాడి గుండె పగిలెను
పరిశ్రమలకు ఆయువు మూడెను
కార్మికులకు కాటి మిగిలెను
ఆక్రోశించెను హృదయాలెన్నో
ఎందుకంటే ఏమిటంటే
నువ్వు లేక నువ్వు రాక

నిన్ను నమ్మి నిరీక్షించే జనంలోకి వచ్చేయి
ఆరుతున్న ఆశలకు ఆయువై విచ్చేయి.

- అనంతు నాగయ్యగౌడ్, గరిడేపల్లి, నల్గొండ

జనం ముందు సీబీఐ ఎంత? చంద్రబాబు ఎంత?

అన్నా! నీవు బయటలేని కొత్తసంవత్సరం ఎందుకు? సంక్రాంతి ఎందుకు? నీవు బయటికొచ్చి ప్రజలమధ్య తిరిగే రోజే మాకు పండుగ రోజు. అన్నా! రాష్ట్ర ప్రజలు అమాయకులు కారు. వారికి అన్నీ తెలుసు. అయినా నీవు ప్రజల మనిషివి. నీవు జైల్లో ఉండటమేంటి? సీబీఐ వాళ్లు కాంగ్రెస్‌కు తొత్తులుగా మారారు. ఈ కాంగ్రెసే సీబీఐని పావులా వాడుకుంటోంది. ఆ విషయం ప్రజలకు ఎప్పుడో తెలుసు. దానికి తోడుగా రాష్ట్రంలో పనికిమాలిన, నీతిమాలిన, విలువలు లేని, ప్రతిపక్షంగా ఉండటానికి కూడా అర్హత లేని టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. దొంగనాటకం ఆడి అధికార కాంగ్రెస్‌తో కుమ్మక్కై, చీకట్లో దొంగచాటుగా వెన్నుపోటుదారుడైన చంద్రబాబు చిదంబరాన్ని కలుస్తూనే ఉన్నాడు. వీళ్ల ఆటలు చాలా రోజులు సాగవు. చంద్రబాబు ఆడే నాటకాలు అందరూ చూస్తున్నారు. కడప ఎన్నికల్లోనే భారీ మెజార్టీ ఇచ్చి జగనన్నను ప్రజాకోర్టులో నిర్దోషి అని ప్రజలు ఏనాడో తీర్పు చెప్పారు. ఇక వారి ముందు కోర్టులెంత? కాంగ్రెస్, చంద్రబాబు ఎంత? 2014లో జగన్ సీఎం కావడం ఖాయం.

- కె.బి.ప్రసాద్, కడలూరు, తమిళనాడు

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: