సామాన్యుడి నడ్డి విరిగేలా చార్జీలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సామాన్యుడి నడ్డి విరిగేలా చార్జీలు

సామాన్యుడి నడ్డి విరిగేలా చార్జీలు

Written By news on Wednesday, January 30, 2013 | 1/30/2013

సామాన్యుడి నడ్డి విరిగేలా చార్జీలు వడ్డిస్తున్నారు
రెగ్యులేటరీ కమిషన్ ప్రభుత్వానికి తొత్తులా ఉంటోంది
జెన్‌కో బొగ్గు కుంభకోణంపై విచారణ జరిపించాలి
ప్రభుత్వం సహకార ఎన్నికలను అపహాస్యం చేస్తోంది
ఇతరులు గెలిచే చోట్ల స్టేలతో ఎన్నికలు అడ్డుకుంటోంది

సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలతో సంబంధం లేదని, అందుకే సామాన్యుడి నడ్డి విరిగేలా అన్ని రకాల చార్జీలనూ వడ్డిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఇంధన సర్‌చార్జి(ఎఫ్‌ఎస్‌ఏ) సర్దుబాటు పేరుతో రూ.1,058 కోట్లను రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై వేయడాన్ని ఆయన ఆక్షేపించారు. ఇప్పటికే ప్రజలపై రూ.32 వేల కోట్ల మేరకు విద్యుత్ భారం మోపారని, వచ్చే ఏప్రిల్ 1 నుంచి రూ.12,723 కోట్ల విద్యుత్ చార్జీలు పెంచబోతున్నారని జనక్ విమర్శించారు.

ఆర్టీసీ, విద్యుత్ చార్జీలతో పాటుగా గ్యాస్, పెట్రోలు ధరలు పెంచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ జెన్‌కో విద్యుత్ ఉత్పాదన కోసం దిగుమతి చేసుకుంటున్న బొగ్గు కొనుగోళ్లలో భారీ అవినీతి జరుగుతోందని, అందువల్లనే ప్రజలపై ఇంధన సర్‌చార్జి సర్దుబాటు భారం అధికంగా పడుతోందని ఆయన అన్నారు. టన్ను 3,200 రూపాయల ధరకే లభించే విదేశీ బొగ్గును ఏపీ జెన్‌కో 5,000 రూపాయలకు కొనుగోలు చేస్తోందని, ఈ కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలవాల్సి ఉన్నా ఒకరిద్దరికి అప్పగించి ఉత్పాదన వ్యయం అధికమయ్యేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని జనక్ డిమాండ్ చేశారు. మనకు రావాల్సిన గ్యాస్‌ను ల్యాంకో, జీఎమ్మార్ మర్చంట్ ప్లాంట్‌లకు సరఫరా చేయించడం వల్ల విద్యుత్ యూనిట్ ధర రూ.5.25 అయిందన్నారు. పవన విద్యుత్ రేట్లను కూడా ప్రభుత్వం యూనిట్‌కు ఒక్క రూపాయి పెంచిందని, దీని వల్ల కూడా వందల కోట్ల భారం పడుతోందని చెప్పారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ప్రభుత్వం చెప్పినట్టల్లా చేస్తూ తొత్తులాగా వ్యవహరిస్తోందన్నారు. ఇంధన సర్దుబాటు ప్రతిపాదనలు కమిషన్ ముందుకు వచ్చినపుడు వైఎస్సార్ కాంగ్రెస్ అక్కడ ధర్నా చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

బాబూ.. ఎందుకు మాట్లాడవ్?

కరెంటు చార్జీలు పెంచి ప్రజలను ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నా ప్రతిపక్ష నాయకుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఎందుకు నోరెత్తరని జనక్ సూటిగా ప్రశ్నించారు. ఐఎంజీ భూముల కేటాయింపులో తన మీద కేసులు లేకుండా చేసుకునేందుకే బాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై ప్రజలపై ఎంత భారం పడుతున్నా ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు. సహకార సంఘాల ఎన్నికల్లో ఎన్ని అరాచకాలు జరుగుతున్నా.. బాబు నోరు విప్పడం లేదన్నారు. ప్రభుత్వం సహకార ఎన్నికలను అపహాస్యం పాలు చేసిందని, ఇతరులు ఖాయంగా గెలుస్తారనుకున్న చోట్ల స్టేల ద్వారా అడ్డుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో నామినేషన్ వేసినందుకు ఒక చోట కృష్ణ అనే వ్యక్తిని నరికి చంపారంటే పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. మూడున్నరేళ్లుగా నాన్చుతున్న తెలంగాణ సమస్యను ఎటూ తేల్చకుండా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందని జనక్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రజల పట్ల బాధ్యత లేక పోవడం వల్లనే ఇలా వ్యవహరించిందని ఆయన అన్నా
Share this article :

0 comments: