ఓటమెరుగని వానికి ఓర్మి మెండు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓటమెరుగని వానికి ఓర్మి మెండు

ఓటమెరుగని వానికి ఓర్మి మెండు

Written By news on Tuesday, January 8, 2013 | 1/08/2013


పులు కడిగిన ముత్యమువై
నెలవంక విధాన నీవు నేలకు వెలుగై
కలిమికి, బలిమికి లొంగని
అలుపెరుగని జోదువీవు హర్ష సుచరితా!
గ్రామసింహాల నొకచోట కట్టగట్టి
ఎంత మొరిగిననేమగు? వింతరీతి
జూలు విదిలించి యసలైన ఏలుజాతి
సింహశాబకుడరుదెంచ చిత్తుగావే?
‘చంద్ర’ ‘కిరణాలు’ రాష్ట్రాన చప్పబడియె
ముసుగులోనున్న జగనన్న మొయిలురీతి
గర్జనల తోడనేతెంచి గగనమంత
కప్పివేయును శుభముల, తప్పడతడు
జెయిలుబెయిలులు తన్నేమి చెనకలేవు
నక్కజిత్తుల యెత్తులు ఒక్కటైనా
కోట్లకంఠాలు, కన్నులు కోరుకున్న
జగను చనుదెంచు బైటికి ఝంఝవోలె
మేరునగధీరుడెవ్వడు? మేటియెవడు?
మాటతప్పుటెరుంగని మౌనియెవడు?
మానవతవెంటతిరిగెడు మాన్యుడెవడు?
అతడెపో దేశదశ మార్చునట్టి ఘనుడు
కాలమే తీర్చునాతని కలతలన్నీ
ఎవ్వడో సత్యమెరుగని గువ్వయొకడు
లేని దౌష్ట్యాల తలపైని పూని మోపె
చివరికాతడె చింతించు చేవచచ్చి
గద్దెనెక్కిన ప్రతివ్యక్తి ఘనుడు కాడు
గద్దెకే వన్నె తెచ్చెడి ఘనుడె ఘనుడు
ఎన్నిగండాలు నెదురైన, యెవ్వరెంత
రొష్టుపెట్టిన చెదరడు, రొష్టుపడడు
ఓటమిఎరగని వానికి ఓర్మిమెండు
ధూర్తనీతిజ్ఙులెల్లరు దూరమగుట
నీలిమేఘాలుగాలికి తేలిచనుట
విజకేతనమెగురుట; నిజముసుమ్మీ

- డా. యన్.రామచంద్ర, ప్రొద్దుటూరు

ఎన్ని శక్తులు ఏకమైనా జనం నుండి వేరు చేయలేవు

జగన్ చేసిన తప్పేంటి? ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా పుట్టడం జగన్ చేసుకున్న పాపమా? ఒక పారిశ్రామికవేత్తగా ఉండటం అన్యాయమా? ఓదార్పుయాత్ర నిర్వహించడం ఘోరమా? కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం శాపమా? విపరీతమైన ప్రజాభిమానాన్ని పొందడం జగన్ చేసిన తప్పిదమా? ఒక పార్లమెంట్ అభ్యర్థిగా రికార్డు స్థాయి మెజార్టీ సాధించడం నేరమా? ఏమిటి జగన్ చేసిన తప్పు?! కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ, ఒక వర్గం మీడియా అందరూ ఒక గ్రూప్‌గా ఏర్పడి జనం నుండి, అతని కుటుంబం నుండి జగన్‌ను ఎందుకు దూరం చేశారు? ప్రభుత్వం నుండి లబ్ధి పొందినవారు జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు అనేది అసలు అభియోగం. ముందు ఆ విషయం తేల్చుకోండి.

అసలు ఈ విషయంలో జగన్‌ను ఎందుకు బలిచేశారు? జగన్ క్యాబినెట్‌లో ఉన్నాడా? ఏదైనా అధికారిగా ఉన్నాడా? అసలు జగన్‌కేం సంబంధం? భూ కేటాయింపులు బిజినెస్ రూల్స్ ప్రకారం జరిగాయి అంటున్నారు. ఆ 26 జీవోలు సక్రమమే అంటున్నారు. అసలు సీబీఐ తేల్చుకోవలసింది ఆ విషయం. మధ్యలో జగన్‌ను ఎందుకు ఇరికించినట్లు? ఏం జగన్ వ్యాపారాలు చేయకూడదా? రామోజీ, చంద్రబాబులు మాత్రమే వ్యాపారాలు చేయాలా? అంతా ఓ కుట్ర, ఓ నాటకం. కేవలం జనం నుండి జగన్‌ను వేరు చేయడానికి రచించిన పథకం. జగన్ వ్యతిరేకులు, తెలుగుదేశం, ఎల్లో మీడియా పైశాచిక, రాక్షస ఆనందాన్ని పొందడానికే జగన్ అరెస్ట్.

జగన్ విషయంలో సీబీఐ ఏకంగా ఇరవై చోట్ల అత్యుత్సాహంగా వరుసదాడులు నిర్వహించింది. అదే అత్యుత్సాహం చంద్రబాబు విషయంలో చూపలేదంటే, సామాన్య ప్రజలు సైతం ఈ కుట్రను అర్థం చేసుకోగలరు. జగన్ బెయిల్ వ్యవహారంలో సీబీఐ చూపుతున్న వింత పోకడలను కూడా జనం గమనిస్తున్నారు. జగన్ అరెస్ట్ ఓ కుట్ర, ఓ రచన, ఓ నాటకం, ఓ పథకం, ఓ ప్రణాళిక, ఓ వ్యూహం! జగన్‌ను ఏ శక్తీ ఏమీ చేయలేదు. జగన్ ఉదయించే సూర్యుడు, పడిలేచే కెరటం, తిరుగులేని ప్రజానాయకుడు, నాయకత్వ లక్షణాలున్న ఓ హీరో. ఎన్ని శక్తులు ఏకమైనా జనం నుండి జగన్‌ను వేరు చుకాబోయే ముఖ్యమంత్రి జగనే. ఇది జగమెరిగిన సత్యం.

- ఎ.సి.హెచ్.నరసింహారావు, టీచర్, పొదిలి
Share this article :

0 comments: