రాజన్నా! నువ్వు మళ్లీ రావాలి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజన్నా! నువ్వు మళ్లీ రావాలి!

రాజన్నా! నువ్వు మళ్లీ రావాలి!

Written By news on Saturday, January 12, 2013 | 1/12/2013

కుటిల రాజకీయ వికటాట్టహాసంతో రాష్ట్రం తల్లడిల్లిపోతోంది.
కాలనాగులు విరజిమ్మే విషకీలల ధాటికి
జనం భయం నీడలో కాలం వెళ్లదీస్తున్నారు.
మంచిని పంచివ్వడమే తెలిసిన రాజన్నా...
ప్రజల మనిషిగా ఎదిగే శాంతి కపోతాన్ని,
అదేనయ్యా! మా మనసుల్లో నీ అంత స్థానం
కైవసం చేసుకున్న జగన్‌బాబును ఖైదు చేశారు చూశావా?
అయినా, వీరి అజ్ఞానం చూస్తే నవ్వొస్తోంది.
జగన్... జగన్ అంటూ...
ఎగసి ఉరుకులెత్తు జనఘోష ముందు
వీరి కుప్పిగంతులు ఏపాటి?!
****** 
నీ పథకాలు వారివని చెప్పుకున్నా
నీ స్థానంలో వారి ఫొటోలు పెట్టుకున్నా
నీ విశాల హృదయం వారు తెచ్చుకోగలరా
తెచ్చుకోగలిగితే ఈ నీచకృత్యాలకు ఒడిగట్టగలరా?
ప్రజల నుండి వేరుచేసి కర్కశ రక్కసులై
బందిఖానాలో జగన్‌ను పడవేసినా
ప్రతివాని గుండె పదునైన చురకత్తియై
విలయ తాండవంబు చేయకుండునా?
ఈ అజ్ఞానుల అక్కసును
తునాతునకలు చేయకుండునా?

- ఎ.వసంతలక్ష్మి, సరిపల్లి, ప.గో.జిల్లా

కుటిల రాజకీయ నాయకులకు ఇవి ఆఖరి రోజులు

మహానేత వైఎస్సార్ అంటే మాకెంతో అభిమానం. ఆయన మనమధ్య లేరంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావటం లేదు. రాజకీయ, ధనదాహం కోసం ఒక మంచి మనిషిని బలిచేసిన రాష్ట్రమిది. రాజకీయ పదవుల కోసం, కుంభకోణాలు చేసి డబ్బును వేలకోట్లలో దోచుకుంటున్న నాయకులకు ఆఖరిరోజులు ఇవే. ఎందుకంటే 2014లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ హయాం కూడా టీడీపీలా సమసిపోతుంది. కాంగ్రెస్ పార్టీ వై.ఎస్.జగన్‌ని ఏమీ చేయలేక ఆయన్ని ప్రజలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో చంద్రబాబుతో చేతులు కలిపి తప్పుడు కేసులు పెట్టించింది. అయితేనేం- జైల్లో ఉండి కూడా జనం కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించే మనిషి జగన్. వై.ఎస్.ఆర్. కూడా పాదయాత్ర చేసినప్పుడు ప్రజల అవసరాలు స్వయంగా పరిశీలించి, వాళ్లకోసం మెరుగైన సేవలు అందించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ‘‘రాజశేఖరరెడ్డి చేసింది కాదు, నేను ఇప్పుడు చేసేదే అసలైన పాదయాత్ర’’ అంటున్నారు! 

మొన్న మధ్యంతర ఎన్నికల్లో చంద్రబాబును ప్రచారానికి రాకుండా కొన్ని గ్రామాలు అడ్డుకున్నాయి. అప్పుడే ఆ విషయం మర్చిపోయినట్లున్నారు. ఇక ముఖ్యమంత్రి విషయానికొస్తే ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు. ఎక్కడ మీటింగ్ జరిగినా ‘నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను’ అంటూ ఏమీ చేయకుండానే మురిసిపోతాడు. బొత్స సత్యనారాయణకు కుంభకోణాలు తప్పితే ప్రజల హృదయాలు గెలుచుకోవడం తెలీదు. అసలు ఆయనకు ఎలా మాట్లాడాలో తెలిస్తే కదా! చిరంజీవి అయితే హాయిగా సినిమా వేషాలు వేసుకున్నా ప్రజలు ఇంకా అభిమానించేవారేమో! పార్టీ పెట్టి సగం అభిమానాన్ని కోల్పోయాడు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి మిగిలిన కొద్ది నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నాడు. 

ఇలాంటివాళ్లను అడ్డుపెట్టుకుని అధిష్టానం డ్రామాలు ఆడుతోంది. ఈ డ్రామా క్లైమాక్స్‌కి రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. ఆ రోజుకోసం రాష్ట్రం కాదు, దేశంలోని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. జనం ఊపిరి పీల్చుకోవాలంటే ఈ అరాచక నాయకులందరి రాజకీయ జీవితానికి ఆఖరి క్షణాలు రావాలి. 

- విద్య, ఉయ్యూరు
Share this article :

0 comments: