కాంగ్రెస్‌తో కేసీఆర్ కుమ్మక్కు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్‌తో కేసీఆర్ కుమ్మక్కు

కాంగ్రెస్‌తో కేసీఆర్ కుమ్మక్కు

Written By news on Monday, January 14, 2013 | 1/14/2013

ప్రధానిని అటెండర్‌తో పోల్చి సోనియా 
విషయంలో మౌనమెందుకని ప్రశ్న
మోసపు ప్రకటనలు ఆపి..తప్పులు ఒప్పుకోవాలని డిమాండ్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు అడ్డుపడుతున్న కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కుమ్మక్కయ్యారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్‌రావు విమర్శించారు. ప్రధానమంత్రిని అటెండర్‌తో పోల్చిన కేసీఆర్... కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఆదివారమిక్కడ విలేకరుల సమావేశంలో కేసీఆర్‌కు రాసిన బహిరంగలేఖను ఆయన విడుదల చేశారు. ‘తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ అని టీఆర్‌ఎస్ ఆవిర్భావం సందర్భంగా చెప్పి.. 2004లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నావు. కేంద్రం, రాష్ట్రంలో మంత్రి పదవులు పొందావు. అసెంబ్లీకి ఎన్నిక కాని అల్లుడిని మంత్రిని చేశావు. తెలంగాణ దొంగల పార్టీ అని తిట్టిన టీడీపీతో, స్పష్టమైన వైఖరి ప్రకటించనప్పటికీ కమ్యూనిస్టులతో కలసి 2009 ఎన్నికల బరిలోకి దిగావు. ఎన్నికల ఫలితాలు రాకముందే ఎన్డీయే వద్దకు చేరావు. ఇప్పుడు టీఆర్‌ఎస్ 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలిస్తేనే తెలంగాణ సాధ్యం అని ఎలా అంటున్నావు..’ అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. పోషకాహారాలను ద్రవరూపంలో శరీరంలోకి తీసుకుంటూ కే సీఆర్ దీక్ష చేయటాన్ని వైద్య నివేదికలు కూడా ధ్రువీకరించాయని చెప్పారు. తెలంగాణ కోసం చచ్చిపోయేందుకైనా సిద్ధమని కేసీఆర్ ప్రకటించడం, పెట్రోల్ పోసుకున్న హరీశ్‌రావు అగ్గిపెట్టె దొరక్క ఆగిపోయానని చేసిన డ్రామా వల్ల 900 మందికి పైగా తెలంగాణవాదులు బలయ్యారని మండిపడ్డారు. 

‘2009 డిసెంబర్ 7న అప్పటి సీఎం రోశయ్య సమక్షంలో జరిగిన అఖిలపక్షంలో ఏకాభిప్రాయం రానప్పటికీ వచ్చినట్లు చిత్రీకరించారు. డిసెంబర్ 9న కేంద్రం చేసిన ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం కావాలని స్పష్టంగా ఉంది. దీన్ని నిరసిస్తూ డిసెంబర్ 10న 150 సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదని, ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రమే నిర్ణయం తీసుకోవచ్చని డిసెంబర్ 17 విలేకరుల సమావేశంలో నువ్వే చెప్పలేదా కేసీఆర్..? డిసెంబర్ 9నాటి ప్రకటన నేనే రాసిచ్చాను అని చెప్పుకున్న నువ్వు తీర్మానం విషయంలో పరస్పరం భిన్న ప్రకటనలు చేస్తున్నావు. మోసపు ప్రకటనలు ఆపి చేసిన తప్పులు ఒప్పుకో’ అని సూచించారు. కాంగ్రెస్‌కు, కేసీఆర్‌కు ఉన్న చీకటి ఒప్పందం వల్లే.. గతంలో సోనియాను బజారుకు ఈడుస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఆమె ప్రస్తావన తేవడం లేదన్నారు. ‘బాబు సీఎంగా ఉన్నపుడు 610 జీవోను రద్దుచే యాలని కేసీఆర్ కోరారు. కానీ మంత్రి పదవి దక్కనపుడు తెలంగాణ అంశం, 610 జీవో గుర్తుకువచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలోనే తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పింది’ అని గోనె గుర్తుచేశారు.
Share this article :

0 comments: