న్యాయం చేయాలనే కోరాం: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » న్యాయం చేయాలనే కోరాం: విజయమ్మ

న్యాయం చేయాలనే కోరాం: విజయమ్మ

Written By news on Wednesday, January 16, 2013 | 1/16/2013

జగన్‌ కోసం జనం చేసిన సంతకాలను కొందరు విమర్శించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని రాష్ట్రపతిని కోరామే తప్ప మరే విధమైన మినహాయింపు అడగలేదని ఆమె స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన విజయమ్మ వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత జరిగిన పరిణామాలను, అనంతరం చోటు చేసుకున్న రాజకీయ మార్పులను వివరించారు. 

ఓ సమయంలో ఉద్వేగానికి గురైన విజయమ్మ కంట తడి పెట్టారు. కాంగ్రెస్‌ టిడిపి కుమ్మక్కై అరెస్ట్‌ చేయించారని, లక్ష కోట్లు అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పదే పదే లక్ష కోట్లు అంటున్న నేతలు అవి ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. రాజశేఖర్‌రెడ్డికి పదిమందికి ఇవ్వడమే తప్ప దోచుకోవడం దాచుకోవడం తెలియదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో బెయిల్‌ కూడా ఒక్కటని.. 90 రోజుల్లో జగన్‌కు బెయిల్‌ ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వకుండా చేస్తున్నారని విజయమ్మ ఆవేదన చెందారు.

సాక్షుల్ని ప్రభావితం చేస్తాడనే సాకుతో జగన్ ను జైల్లో పెట్టడం దారుణమన్నారు. కనిమొళి, రాజాలకు బెయిలివ్వగా లేనిది జగన్‌కు బెయిల్‌ ఇస్తే తప్పేంటని విజయమ్మ ప్రశ్నించారు. జగన్‌ 52వ నిందితుడని.. అతన్ని ఎ1 నిందితునిగా అరెస్ట్‌ చేయడం సరికాదన్నారు. 26 జీవోలు విడుదల చేసిన మంత్రుల్లో ఒక్క మోపిదేవినే బలిపశువును చేసి, ధర్మానను విడిచి పెట్టారని చెప్పారు. చంద్రబాబును విచారించడానికి సిబీఐ అధికారులు లేరని బాబును వదిలేశారని విజయమ్మ అన్నారు. విచారణ కోసం పిలిచి జగన్ ను అరెస్ట్ చేశారని ఆమె అన్నారు. 

వైఎస్‌ఆర్‌ పేద ప్రజలకోసం చేసినన్ని సంక్షేమ పథకాలు ఎవరూ చేపట్టలేదన్నారు. దోచుకోవటం, దాచుకోవటం ఆయనకు తెలియవన్నారు. అందుకు బహుమానంగా.. ఆయన పేరును ఎఫ్ ఐఆర్ లో చేర్చారని.. జగన్‌ను జైల్లో పెట్టి వేధిస్తున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కోసం జనం సంతకం కార్యక్రమంలో పాల్గొన్న రెండుకోట్ల మందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కోర్టులో తమకు న్యాయం లభిస్తుందన్న నమ్మకం ఉందని విజయమ్మ చెప్పారు.
Share this article :

0 comments: