కాంగ్రెస్, బాబుల వల్లే సమస్యలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్, బాబుల వల్లే సమస్యలు

కాంగ్రెస్, బాబుల వల్లే సమస్యలు

Written By news on Sunday, January 20, 2013 | 1/20/2013


 కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్న సమస్యలకు టీడీపీ అధినేత చంద్రబాబు జతకలిసి రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు పూటకొక మాట మాట్లాడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. శనివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మేకపాటి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పెద్దలు ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలో చూడటం దురదృష్టకరమన్నారు. ఏం చేస్తే లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతో వారు ఉండటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ విషయంలో సమస్యను సృష్టించిన ఢిల్లీ పెద్దలే ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలన్నారు.
Share this article :

0 comments: