‘సహకారం’ అపహాస్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘సహకారం’ అపహాస్యం

‘సహకారం’ అపహాస్యం

Written By news on Saturday, January 26, 2013 | 1/26/2013

కొన్నిచోట్ల ఎన్నికల నిలిపివేత సిగ్గుమాలిన చర్య... మరికొన్ని చోట్ల ఎన్నికల రద్దుకూ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది

 రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రైతుల కోసం నిర్వహించే సహకార ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇప్పటి దాకా రిగ్గింగ్‌కు పాల్పడిన అధికారపక్షం ఇప్పుడు కొన్ని చోట్ల ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ జీవోలివ్వడం సిగ్గుమాలిన చర్య అని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు డీఏ సోమయాజులు దుయ్యబట్టారు. చట్టాలను దుర్వినియోగం చేస్తున్న కిర ణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ చర్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమయాజులు మాట్లాడారు. రైతుల కోసం మహత్మా గాంధీ చేసిన ఆలోచనలు, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రతిపాదనలను కాంగ్రెస్ పాలకులు తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. 

సహకార ఎన్నికల్లో రైతులు కాని వారిని ఓటర్లుగా చేరుస్తున్నారని తెలిపారు. ఒకే రోజు 11 లక్షల మంది ఓటర్లను కొత్తగా చేర్చారంటే అక్రమాలు ఏవిధంగా జరిగాయో అర్థమవుతుందని అన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలోనే ఇవన్నీ జరుగుతున్నాయని తెలిపారు. వీటిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇన్ని అక్రమాలకు పాల్పడి కూడా అధికారం చేతిలో ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చివరి అస్త్రంగా ఎన్నికలను వాయిదా వేస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికే 45 సహకార సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపేసిన ప్రభుత్వం మరో 100 సంస్థల ఎన్నికలను రద్దుచేసే ఆలోచనలో ఉందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, శాంతిభద్రతలకు ఆటంకం కలిగినప్పుడు, ఓటర్లు వారి హక్కును వినియోగించుకోలేని పరిస్థితుల్లో మాత్రమే సెక్షన్ 22-సి ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిలిపేయాల్సి ఉందని, అయితే కిరణ్ ప్రభుత్వం చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.

రాజకీయాలను దిగజారుస్తున్న చంద్రబాబు

30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్రబాబు.. గోబెల్స్ ప్రచారంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రాజకీయాలను దిగజారుస్తున్నారని సోమయాజులు దుయ్యబట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఆయన ఎంతగా దిగజారిపోయారనేది అర్థమవుతుందని చెప్పారు. ‘‘విచారణ పూర్తయ్యేవరకూ బెయిల్ ఇవ్వరాదని సుప్రీంకోర్టు చెప్పిందన్న కారణంతో హైకోర్టు బెయిల్ నిరాకరించింది. 

జగన్ బెయిల్‌పై హైకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా సీబీఐ సరికొత్త అంశాన్ని ప్రస్తావించింది. విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని సీబీఐ అంటోంది. ప్రభుత్వం సహకరించకపోతే విచారణ మరింత జాప్యం జరిగి జగన్‌కే కదా నష్టం జరిగేది? దీన్ని వదిలేసి చంద్రబాబు మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ కలిసిపోయాయని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌తో జగన్ కలిస్తే జైల్లో ఉండాల్సిన ఖర్మ ఎందుకుంటుంది? మీ మాది రిగా చీకట్లో చిదంబరంను కలిసి మేనే జ్ చేసుకునే అలవాటు మాకు లేదు’’ అని మండిపడ్డారు. 26 జీవోలకు సంబంధించిన కేసులో 70 శాతం దర్యాప్తు పూర్తి చేసిన సీబీఐ ఇప్పటిదాకా రూ.900 కోట్లు నష్టం అంచనా వేస్తే చంద్రబాబు పదే పదే లక్ష కోట్లు అనడాన్నిబట్టి చూస్తే ఆయన పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. ఎమ్మార్ కేసులో కూడా చంద్రబాబు పది వేల కోట్లని దుష్ర్పచారం చేస్తే సీబీఐ విచారణలో తేలింది రూ.43 కోట్లన్న విషయాన్ని గుర్తుచేశారు. వరుసగా వెలువడుతున్న సర్వేలను చూసి చంద్రబాబుకు నిద్రపట్టక పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం తప్ప రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ కచ్చితంగా గెలవగలదని గుండెపై చెయ్యివేసుకొని చెప్పగలరా అని సోమయాజులు ప్రశ్నించారు.
Share this article :

0 comments: