ఐఎంజీ కేసులో బాబు జైలులో ఉండేవాడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఐఎంజీ కేసులో బాబు జైలులో ఉండేవాడు

ఐఎంజీ కేసులో బాబు జైలులో ఉండేవాడు

Written By news on Monday, January 21, 2013 | 1/21/2013

 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఐఎంజీ భారత్ కేసులో ఈపాటికే జైల్లో ఉండేవారని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానిం చారు. ముగ్గురు టీడీపీ ఎంపీలతో ఎఫ్‌డీఐలకు అనుకూలంగా పార్లమెంటులో ఓటు వేయించి జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా భూమి కేటాయించే అధికారం లేనప్పటికీ రూ.4 వేల కోట్ల విలువైన భూమిని ఐఎంజీ భారత్ సంస్థకు కేవలం రూ.2.5 కోట్లకు బాబు కేటాయించారు. ఇది క్లియర్‌గా జైలుకు వెళ్లే కేసు. బాబు ఈపాటికే జైలుకు వెళ్లేవాడు. ఏం మాట్లాడుకున్నారో గానీ, ఎఫ్‌డీఐలపై పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో ముగ్గురు టీడీపీ ఎంపీలతో ఓటేయించి బయటపడ్డాడ’న్నారు. అధికారంలో ఉన్నప్పుడేగాక ప్రతిపక్ష నేతగాకూడా ప్రజాధనాన్ని దోచుకుతింటున్న నీచచరిత్ర బాబు సొంతమన్నారు. ఆ వివరాలను త్వరలోనే ఆధారాలతోసహా బయట పెడతానన్నారు. కోమటిరెడ్డి ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ హయాంలో పలు సాగునీటి ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులపేరిట తాను అవి నీతికి పాల్పడ్డానన్న బాబు ఆరోపణల్ని తీవ్రంగా ఖండిం చారు. ‘నేను ప్రజల మధ్య ఉంటూ సేవ చేసుకునే వ్యక్తినే తప్ప కాంట్రాక్టర్‌ను కానేకాదు. 

నా ఇమేజీని దెబ్బతీసేందుకు బాబుతోసహా కొందరు కాంగ్రెస్ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవి నీతిపై సీబీఐ విచారణ జరపాలంటూ సీఎం కిరణ్‌కు లేఖరాశా. సీఎం స్పందించకుంటే ఈ అంశంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తా. మెయిల్ అనే సంస్థ ఒక్కటే జాయింట్ వెంచర్ పేరిట రూ.40 వేల కోట్ల విలువైన పనులు చేపట్టింది. టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థ కల్వకుర్తి కేట గిరీ-1 పనులు తీసుకుని వేల కోట్లు సంపాదించింది. మిడ్ మానేరులో భూసేకరణ ఆలస్యమవడంతో పనులను వదులుకున్న రిత్విక్ సంస్థ టీడీపీ ఎంపీ సుజనా చౌదరిదే. ఈ సంస్థలపై బాబు నోరెందుకు మెదపడం లేదు? విపక్ష నేతగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బాబు అందుకు భిన్నంగా కాంట్రాక్టర్లతో లాలూచీ పడి వారి నుంచి కోట్లాది రూపాయలు తీసుకుంటున్నారు’ అని ఆరోపించారు. బాబుకు నిజంగా ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే అన్ని కంపెనీలపై విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాయడంతోపాటు కోర్టును ఆశ్రయించాలని సవాలు విసిరారు. జనవరి 28 లోపు తెలంగాణ వస్తుందని ఆశిస్తున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. 
Share this article :

0 comments: