అన్యాయంగా అరెస్టు చేశారని దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అన్యాయంగా అరెస్టు చేశారని దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు

అన్యాయంగా అరెస్టు చేశారని దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు

Written By news on Monday, January 14, 2013 | 1/14/2013

వై.ఎస్.ఆర్.గారి హఠాన్మరణ వార్త తెలిసిన క్షణాన నేను బాధతో భోరున విలపించాను. ఈ రోజున కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే ఆంధ్రరాష్ట్ర ప్రజలు అనేక సంక్షేమ ఫలాలను అందుకోగలిగారంటే ఆయన కృషి, పట్టుదలే కారణమని కేంద్రానికి కూడా తెలుసు. ఆ మహానేత కుమారుడు వై.ఎస్.జగన్ ప్రజా సంక్షేమం కోసం నిర్విరామంగా పాటుపడుతూ ఉంటే తమ ఆదరణ ఎక్కడ తగ్గిపోతుందోనన్న భయంతో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోనియాపై ఒత్తిడి తెచ్చి ఆయన్ని ఇబ్బందిపెట్టే దుశ్చర్యలకు ఒడిగట్టారు. సీ.బీ.ఐ.ని ఒక పావుగా వాడుకుంటూ జగన్‌ని అన్యాయంగా అరెస్టు చేయించారు. అంతటితో ఆగకుండా సహజంగా రావలసిన బెయిలును రానీయకుండా చేస్తున్నారు. 

జగన్‌ని అరెస్టు చేయడానికి సి.బి.ఐ. చూసిన అత్యుత్సాహం... చంద్రబాబునాయుడుగారి మీద ఉన్న కేసుల విచారణలో చూపించినట్లయితే ప్రజల్లో ఆ సంస్థ పట్ల కొద్దొగొప్పో గౌరవ భావం మిగిలి ఉండేది. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఎంతో, సీబీఐ అంత... తేడా ఏమీ లేదని ప్రజలు పరిహసిస్తున్నారు. జగన్‌కు ఈనాటికీ బెయిల్ రాకపోవడం వ్యక్తిగతంగా నన్నెంతో కృంగదీస్తోంది. ఆయన కుటుంబ సభ్యుల బాధ, ఆవేదన చూస్తుంటే ఈ రాజకీయనాయకులు, వారిని వెనకేసుకొచ్చే మీడియా మహానుభావులు ఎందుకింత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారో అర్థంకాకుండా ఉంది. 

ఈ క్షణాన కనుక ఎన్నికలు వస్తే వారి మొహం మీద గుద్దినట్లుగా, జగన్‌బాబు పార్టీకి ఓటు వేయాలన్న ఆవేశం కలుగుతోంది. అమ్మా... విజయమ్మా. ధైర్యంగా ఉండండి. మీ పేరులోనే విజయం ఉంది. భారతమ్మకు, షర్మిలమ్మకు ధైర్యం చెప్పండి. భవిష్యత్తులో జగన్‌బాబు వారి నాన్నగారిలా మంచి ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకం మా అందరిలోనూ ఉంది. ఆ నమ్మకమే మీకు, మీ కుటుంబ సభ్యులకు, జగన్‌కు అన్నివేళలా తోడుగా ఉంటుంది. 

- వడ్డి నాగేంద్రప్రసాద్, విశాఖపట్నం

జగన్... ఉన్నత శిఖరం

రాజశేఖరరెడ్డిగారిని ప్రప్రథమంగా నేను రాజమండ్రిలో చూశాను. అప్పుడు ఆయన ప్రతిపక్ష నేత. ఆయన్ని చూడగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారన్న భావన నాలో కలిగింది. ఆ భావన నిజమైంది. అంతవరకు ఒక ప్రాంతీయ పార్టీ పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఘన పునఃప్రతిష్ట జరిగిందంటే అది వై.ఎస్.గారి పాదయాత్ర ఫలితమే. ముఖ్యమంత్రిగా ఆయన అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. ప్రజల హృదయంలో స్థానం పొందారు. అదే సమయంలో దురదృష్టవశాత్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 

తండ్రిగారి మరణవార్త విని అసువులు బాసిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు బయల్దేరిన జగన్ బాబు ఎండనక, వాననక ఎంతో శ్రమించారు. ఆ క్రమంలోనే అపరిమితమైన ప్రజాదరణను, అభిమానాన్ని, ప్రశంసలను అందుకున్నారు. ఇది చూసి ఓర్వలేకపోయిన కాంగ్రెస్‌పార్టీ సీ.బీ.ఐ.ని పావులా వాడుకుని జగన్‌ని జైలు పాలు చేసింది. రాజకీయంగా అడ్డుతొలగించుకోవాలని చూసింది. అందుకు చంద్రబాబు కూడా చెయ్యవలసినంతా చేశారు. అంతా కలిసి శిఖరాగ్రంలో ఉన్న వ్యక్తిని పాతాళంలోకి తొక్కేశామని సంబర పడ్డారు. కానీ జగనే ఒక శిఖరం అని వీరు ఊహించలేకపోయారు. అతడి శక్తిని తక్కువగా అంచనా వేశారు. వాస్తవం త్వరలోనే వెల్లడవుతుంది. జగన్ అంటే ఏమిటో ప్రజలే ఈ కుటిల రాజకీయ నాయకులకు , వారి ప్రాపకంకోసం దుష్కార్యాలలో పాలుపంచుకుంటున్న అధికారులకు రుచి చూపిస్తారు.

- టి.ఆర్.సోమయాజులు, సీనియర్ సిటిజన్,
బొమ్మూరు, రాజమండ్రి


 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: