విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయానికి నిరసనగా సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయానికి నిరసనగా సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు

విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయానికి నిరసనగా సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు

Written By news on Wednesday, January 9, 2013 | 1/09/2013

విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయానికి నిరసనగా బుధవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని సబ్‌స్టేషన్ల ముందు చేపట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ధర్నాల్లో అన్ని వర్గాలవారు పాల్గొని శాంతియుతంగా నిరసన తెలపాలని కోరారు. వైఎస్ ఐదేళ్ల కాలంలో ఒక్క పైసా పన్ను పెంచకుండా సువర్ణయుగాన్ని అందిస్తే... ప్రస్తుత పాలకులు అన్ని వర్గాల ప్రజలను పన్నులతో, చార్జీలతో నడ్డివిరుస్తున్నారని ఆ పార్టీ మండిపడింది. 

పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఢిల్లీ ద్వారా ఎంపికవుతున్న పాలకులు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై ప్రజాపక్షంగా ఉంటున్న వైఎస్సార్‌సీపీని భౌతికంగా, మానసికంగా దెబ్బతీసేందుకు అనునిత్యం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ... ప్రజాసమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్ సర్దుబాటు చార్జీలతో రూ.10 వేల కోట్లు భారం మోపడమేగాక... రానున్న ఆర్థిక సంవత్సరంలో మరో రూ.15 వేల కోట్లు బాదడానికి రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. 2004కు ముందున్న చీకటి రోజులు మళ్లీ రాష్ట్రాన్ని కమ్ముకుం టున్నాయని హెచ్చరించారు. చంద్రబాబు హయాం నాటి చీకటి రోజులను తరిమికొట్టేందుకు ప్రజలు సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

చంద్రబాబు మాదిరిగా బెదిరేవాళ్లం కాదు...
ప్రజల తరఫున అనునిత్యం పోరాడుతూ, వారి మధ్యే ఉంటున్న తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించినప్పటికీ వైఎస్సార్‌కాంగ్రెస్ పోరాటపంథాన్ని వీడలేదని జూపూడి గుర్తుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరిగా తోకముడిచి అధికారపక్షంతో రాజీపడే నైజం తమకు లేదన్నారు. వైఎస్ ఐదేళ్లు ఒక్క పైసా పన్ను పెంచకపోగా ప్రస్తుత పాలకులు మాత్రం పెంచకపోతే పాలించలేమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక మతాన్ని కులాన్ని దూషించే హక్కుగాని అర్హతగాని ఏ ఒక్కరికీ లేవని, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాల్సిందేనన్నారు.
Share this article :

0 comments: