గర్జించి వస్తాడు సింహబలుడై...గాండ్రించి వస్తాడు బెబ్బులిపులై... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గర్జించి వస్తాడు సింహబలుడై...గాండ్రించి వస్తాడు బెబ్బులిపులై...

గర్జించి వస్తాడు సింహబలుడై...గాండ్రించి వస్తాడు బెబ్బులిపులై...

Written By news on Saturday, January 19, 2013 | 1/19/2013

ఎవరన్నారు..! జగన్ జైల్లో ఉన్నాడని!
మా గుండె గదుల్లో ఉన్నాడని జనం అంటుంటే!!
ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం అవుతున్న సమరయోధుడిలా
పేదోడికి చేదోడుగా ఉండే ఆత్మీయ నేస్తంగా
ఆడపడుచులను ఆదుకునే ఆపత్కాల బాంధవుడిలా
రాజన్న ముద్దుల బిడ్డగా
విజయమ్మ వీర పుత్రుడిలా
కఠోర తపోదీక్ష చేస్తున్నాడు... జగనన్న!!

ఎవరన్నారు... జగనన్న అవినీతి పరుడని!
అక్రమార్కుల అవినీతిని
అంతమొందించే ఉగ్ర రూపమని జనం అంటుంటే!!
పెద్దల గద్దెలు కూల్చే పేదోడి పక్షపాతిలా
సూటిగా మడమ తిప్పని మహోన్నత శిఖరంలా
కసితీరా కృషినే నమ్ముకున్న నిత్యకృషీవలుడిలా
మహాశివుని మంగళ శాసనాలతో
అల్లా ఆశీర్వాదముతో
యేసుప్రభువు కృపాకటాక్షాలతో
అనంతమైన ఆలోచనలో ఉన్నాడు... జగనన్న..!

ఎవరన్నారు... జగనన్నది అధికార వ్యామోహమని!
అరాచక పాలనను అణచి వేసేందుకని జనం అంటుంటే!!
స్వాతంత్య్ర పోరాటంలో చెరసాలల పాలైన
భరతజాతి రత్నాల స్ఫూర్తిగా
బోసినవ్వుల బాపూజీ శాంతి మంత్రాన్ని...
ఆజాదీ తెచ్చేందుకు ఏ జాదూకూ తలవంచని
ఆజాద్ చంద్రశేఖర్ అస్తిత్వాన్ని...
చిరునవ్వుతో దర్జాగా ఉరికంబమెక్కిన
భగత్‌సింగ్ ఆత్మస్థైర్యాన్ని...
నిరుపమాన సాహసి నేతాజీ శౌర్యాన్ని... కలగలిసిన
భారతావని బంగారు భాగ్య విధాతగా
కాగల కార్యాన్ని లిఖిస్తున్న కర్మయోగి జగనన్న..!

ఔను... ఔను... ఔను...
జనం అంటున్నదే నిజం!
పది కోట్ల ప్రజలు కోరుకుంటున్నదే జగమెరిగిన సత్యం!
జైలు గోడలు జగనన్నను బందీ చేయలేవని
కుట్రలు కుతంత్రాలు జన హృదయ నేతను
ఎంతో కాలం నిర్బంధించలేవని... నిరూపిస్తూ
కుళ్లు సమాజాన్ని కూకటివేళ్లతో తుంచడానికి
రాబందుల రాక్షస క్రీడలను ఉక్కుపాదంతో తొక్కడానికి
అభాగ్యులను, అన్నార్తులను ఆదుకోవడానికి
రాజశేఖరుడు కలలుగన్న రామరాజ్య స్థాపన చేయడానికి
గర్జించి వస్తాడు సింహబలుడై
గాండ్రించి వస్తాడు బెబ్బులి పులియై
అఖిలాంధ్ర ప్రజలకు ఆప్తుడై
ఓర్పు నేర్పులతో ఓదార్చే ఓ నేస్తంగా
కష్టాల్లో కన్న కొడుకుగా
కన్నీళ్లు తుడిచే తోబుట్టువులా
ఆత్మీయతలో ఆపద్బాంధవుడిలా...
వస్తాడు, తిరిగొస్తాడు...
జయహో... జగన్! జయ జయ జయహో జగన్..!!

- ఎస్.సంతోష్‌రెడ్డి,
మాజీ మంత్రి, నిజామాబాద్
Share this article :

0 comments: