కొత్త ఏడాది తొలిరోజున సంతకానికి విశేష స్పందన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొత్త ఏడాది తొలిరోజున సంతకానికి విశేష స్పందన

కొత్త ఏడాది తొలిరోజున సంతకానికి విశేష స్పందన

Written By news on Wednesday, January 2, 2013 | 1/02/2013


సాక్షి, హైదరాబాద్, గుంటూరు, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ.. సీబీఐ కుట్రలను నిరసిస్తూ చేపట్టిన ‘జగన్ కోసం జనం సంతకం’ కార్యక్రమానికి కొత్త సంవత్సరం తొలి రోజున జనం వెల్లువెత్తారు. రాష్ట్రపతికి సమర్పించబోయే కోటి సంతకాల కార్యక్రమంలో తామూ భాగస్వాములవుతామంటూ స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేశారు. గత ఏడు నెలలుగా జగన్ జైలులో ఉన్నందున ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్న పార్టీ శ్రేణులు మంగళవారం పరస్పర అభినందనలకు మాత్రమే పరిమితమై.. సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకూ.. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ జనం వద్దకు వెళ్లిన పార్టీ కార్యకర్తలు వారి సంతకాలు తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో సంతకాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. పలువురు ప్రజలు తమ పనులను ఆపుకుని మరీ వచ్చి.. సంతకాలు చేసి వెళ్లారు. బస్సు లు, కార్లు, లారీలు నడిపే డ్రైవర్లు, ఆటోవాలాలు సంతకాలు చేసేందుకు ముందుకొచ్చారు. కాలేజీ విద్యార్థులు, యువకులు జగనన్న విడుదల కావాలని నినదించారు. అనేక చోట్ల మహిళలు గుంపులుగా వచ్చి సంతకాలు చేయడం విశేషం. జగన్ బయ ట ఉంటే తమకు రాజకీయ మనుగడ లేదని భావిస్తున్న కాంగ్రెస్, టీడీపీల కుట్రలను ఛేదించాలని ఈ సందర్భంగా వారు కోరారు.

సంతకాల సేకరణపై రాష్ట్రపతికి విన్నవించా.. 

వైఎస్ జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా రాష్ట్రంలో జరుగుతున్న సంతకాల సేకరణ విషయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విన్నవించానని వైఎస్సార్ సీపీ బాపట్ల నేత కోన రఘుపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 28న రాష్ట్రపతిని తాను కలిశానని.. 45 నిమిషాలపాటు భేటీ అయ్యానని చెప్పారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. తన తండ్రి కోన ప్రభాకరరావు గవర్నర్‌గా పనిచేసిన సమయంలోని ముఖ్య విషయాలను ప్రస్తావించారని, కుటుంబ విషయాలను అడిగి మరీ తెలుసుకున్నారని వివరించారు. వీలు చూసుకుని కుటుంబ సమేతంగా రాష్ట్రపతి భవన్‌కు రావాలని ఆహ్వానించినట్టు చెప్పారు
Share this article :

0 comments: