జగనన్న బయటికొస్తేనే... జనం కష్టాలు తీరుతాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్న బయటికొస్తేనే... జనం కష్టాలు తీరుతాయి

జగనన్న బయటికొస్తేనే... జనం కష్టాలు తీరుతాయి

Written By news on Sunday, January 20, 2013 | 1/20/2013

నా పేరు దివ్య. మాది తూర్పు గోదావరి. నాన్న వ్యవసాయం చేసేవారు. మేమంతా ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం. కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచారు మా నాన్న. అలా ఉండగా కొన్నేళ్లకు వ్యవసాయంలో నష్టపోయి, పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో బ్యాంకు అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చడం కోసం పుట్టింటివాళ్లు అమ్మకి ఇచ్చిన భూమిని అమ్మేశారు. మా ఊళ్లో 300 మంది చేత పని చేయించే మా నాన్న, వ్యవసాయం మానేసి పని కోసం హైదరాబాద్ వెళ్లారు. 

అమ్మ, నేను, చెల్లి, తమ్ముడు నాన్నను తలుచుకుని చాలా బాధపడ్డాం. కొన్నాళ్లకు అమ్మ కూడా నాన్నతోపాటు హైదరాబాద్ వెళ్లింది. అమ్మానాన్నల్ని వదిలి ఉండటం నరకమనిపించింది. పండగొస్తే ఎంతో సంతోషంగా ఉండే మేము, ఆ తర్వాత పండగలకి వారొక చోట, మేమొక చోట అయ్యాం. ఫోన్ చేస్తే మాటలు కాదు, ఏడుపొచ్చేది. తర్వాత వైఎస్సార్‌గారు ముఖ్యమంత్రి అయ్యాక, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఎంతోమంది రైతుల రుణాలు మాఫీ చేశారు. మేం చాలా ఆనందించాం. వలసలు ఆగాయి. రైతుల ఆత్మహత్యలు ఆగాయి. తల్లిదండ్రులను పిల్లల నుండి వేరుచేసే పరిస్థితులు తగ్గాయి. రాజయ్య పెట్టిన ప్రతి పథకం పేద ప్రజలకు ఉపయోగపడేదే. సాక్షి పేపర్ కూడా నా దష్టిలో ప్రాణం ఉన్న గొప్ప మనిషి లాంటిది. 

ఓరోజు మా అమ్మకి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు అమ్మంటే ప్రాణం. ఆమెకి ఏ చిన్న బాధ కలిగినా తట్టుకోలేను. ఆపరేషన్ అంటే భయమేసింది. ఒకప్పుడు డబ్బులుండగా మా దగ్గరకొచ్చినవారు ఇప్పుడు అవి లేకపోయేసరికి మమ్మల్ని మర్చిపోయారు. ధైర్యం చెప్పేవారు లేరు. నేను హైదరాబాద్‌లోని అమ్మ దగ్గరవెళ్లాను. నాకు ఆ బాధలో చనిపోవాలనిపించింది. పదేపదే అదే ఆలోచన. చనిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ క్షణంలోనే నాకు... పక్కనే ఉన్న సాక్షి పేపర్‌లో రచయిత పోసాని కష్ణమురళి రీచార్జ్ కనిపించింది. చదివాను. మరుక్షణంలో చావకూడదని నిర్ణయించుకున్నాను. దిక్కుతోచని సమయంలో నాకు సాక్షి అలా ధైర్యం చెప్పి, నన్ను కాపాడింది. ఆ టైమ్‌లో ఏదైనా సాధించాలనే తపన కలిగింది. 

ఎంతోమంది తల్లీపిల్లల్ని ఒకేచోట ఉండేలా చేశాడు రాజయ్య. అలాంటిది అతని కొడుకు జగనన్నని విజయమ్మ దగ్గర నుండి దూరం చేశారు ఇప్పటి రాజకీయ నాయకులు. జగనన్న కుటుంబం గురించి ఎందరు ప్రజలు బాధపడుతున్నారో ఆ నాయకులకు తెలియడం లేదు. జగనన్న త్వరలోనే బయటకొచ్చి, మన కష్టాలు తీరుస్తాడు. పేపర్‌లో ‘షర్మిల ప్రజాప్రస్థానం’ చదువుతుంటే ఒక్కొక్కరూ కన్నబిడ్డకు వారి బాధలను చెప్పుకుంటున్నట్టు చెప్తున్నారు. ప్రజలు కన్నీరు మున్నీరై తమ బాధలు చెబుతుంటే, ‘రాజయ్య రాజ్యం రావాలి, వారి బాధలు తొలగాలి’ అనిపిస్తోంది. ఇప్పటికైనా అర్థమై ఉండాలి - ఎన్ని కుట్రలు పన్నినా రాజయ్య, వారి కుటుంబం ప్రజల గుండెల్లో పచ్చబొట్టులా ఉన్నారు, ఎవరూ చెరపలేరు అని!

- దివ్య, తూర్పు గోదావరి జిల్లా

జగనన్న సాక్షుల్ని ప్రభావితం చేస్తాడా! సీబీఐ, మంత్రులు ప్రభావితం చేయరా?! 

రాజన్న మరణం రాష్ట్రానికి తీరని లోటు. ఆ లోటు జగనన్న తీరుస్తాడన్న పూర్తి విశ్వాసం మాకు ఉంది. కానీ పాలక ప్రతిపక్షాలు ఆ కుటుంబాన్ని పెడుతున్న కష్టాలను చూస్తే చాలా బాధగా ఉంది. జగనన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. ‘సాక్షులను ప్రభావితం చేస్తాడు’ అని సాకు చూపించే సీబీఐకి, అదే కేసులో బయట ఉన్న మంత్రులు, ఐఏఎస్ అధికారులు జగన్‌కు వ్యతిరేకంగా సాక్షులను ప్రభావితం చేయగలరని తెలియదా? సీబీఐ ద్వంద్వ వైఖరి మాలాంటి సామాన్య ప్రజలకు అర్థమవుతూనే ఉంది.

కాంగ్రెస్‌వాళ్ల బుద్ధి ఎలాంటిదంటే ముప్ఫై యేళ్లు పార్టీకి సేవచేసిన రాజన్న పేరును ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసే కాంగ్రెస్‌కు బుద్ధి వచ్చేలా 2014లో తీర్పు చెప్తాం. అయ్యా చంద్రబాబూ! జగనన్నను తిట్టడానికో, చీకట్లో రహస్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికో కాదు నీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది, ప్రజల సమస్యల మీద పోరాడమని! నువ్వు చేసే కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా తగిన సమయంలో ఓటు అనే ఆయుధం ద్వారా బుద్ధి చెప్తాం.

విజయమ్మ, షర్మిలమ్మ, భారతమ్మా... మీరేమాత్రం బాధపడవద్దు. మేం జగనన్న గురించి రోజూ ప్రార్థిస్తున్నాం. న్యాయాధిపతియైన ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, తప్పక న్యాయం చేస్తాడు. దేవుని దయవల్ల జగనన్న త్వరలోనే బయటకొస్తాడనే నమ్మకం మాకు ఉంది.

- కె.సుధతి, మర్రిపూడి, ప్రకాశం

చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: