చేతులు కాలిన కాంగ్రెస్‌కు చెంపలు వేసుకునే ఛాన్స్ కూడా పోయింది! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చేతులు కాలిన కాంగ్రెస్‌కు చెంపలు వేసుకునే ఛాన్స్ కూడా పోయింది!

చేతులు కాలిన కాంగ్రెస్‌కు చెంపలు వేసుకునే ఛాన్స్ కూడా పోయింది!

Written By news on Monday, January 21, 2013 | 1/21/2013

మన తెలుగు నేలను ఇప్పటిదాకా 16 మంది ముఖ్యమంత్రులు పాలించారు. ఆంధ్రప్రదేశ్ ఆలనాపాలనా చూసినవారిలో పదహారణాల తెలుగుదనం ఉట్టిపడేట్లు వస్త్రధారణ చేసినవారు మాత్రం వై.ఎస్. ఒక్కరే. అంతేకాదు, మన రాజ్యంలోని సకల వర్గాల శ్రేయస్సు కోరినవారు కూడా ఆయనే. మన తెలుగుతల్లి పలుకుబడిలో ఇందిరా కాంగ్రెస్ అనగానే గుర్తొచ్చేది వైఎస్సారే అనడంలో సందేహం లేదు. అలాంటి ప్రజానేత ఆంధ్రప్రదేశ్‌కు విలక్షణమైన పాలన అందించారు. 

రెండోసారి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు. అలాంటి విశిష్టనేత మరణించగానే, ఆయన నెత్తురు పంచుకున్న యువకుడిని తోసిరాజని ప్రజాకర్షణ లేని వ్యక్తిని తెరపైకి తెచ్చింది ఆ ఇటలీ తల్లి. ప్రజాభిమానం మూటగట్టుకున్న వై.ఎస్. జగన్ కాంగ్రెస్‌కి మేలు చేస్తాడన్న ఆలోచనను మరిచి, అతడు దూరంగా నెట్టేదాకా నిద్రపోలేదు. పర్యవసానంగా ప్రజానీకం కడుపు మండింది. కాంగ్రెస్ గీసిన గీత దాటి వచ్చేయమని ప్రోత్సహించింది. ఒక బలపనూరు, పులివెందుల, కడప మాత్రమే కాదు, యావత్తు గడపా ఆనాడు జగన్‌కు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండించింది. తమ ఉద్దేశాన్ని ఉప ఎన్నికల్లో స్పష్టంగా చెప్పింది. చూస్తూనే రోజులు గడిచిపోయాయి. మెల్లిగా ఎన్నికల వేడి రాజుకుంటోంది. 

నాలుగేళ్లు దొర్లిపోగా మిగిలిన ఒక్క ఏడాదీ ఎంత! మాటల్లోనే వచ్చి కూచుంటుంది. ఇప్పటికైనా హస్తిన పెద్దలకు తమ తప్పిదం ఏమిటో తెలిసొచ్చిందో! లేదో! స్వయంకృతాపరాధమని పాఠం నేర్చుకున్నారో! లేదో! జగన్‌పై కుట్రపూరిత నేరాలు ఆరోపిస్తే మంచి ఫలితం వస్తుందని ఆశించిన అధిష్టానానికి, ఉప ఎన్నికల్లో ఆ కుర్రాడి పార్టీకి లభించిన విజయాన్ని చూసి కళ్లు గిర్రున తిరిగి ఉండాలి. రాష్ట్రం నాలుగువైపులా ప్రజానాడి ఎలా ఉందో ఆ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఇంకా ఏమైనా సందేహముంటే వచ్చే యేడు ఎన్నికల్లో తేలిపోతుంది. జగన్ అంటే ఏమిటో తెలిసొస్తుంది. అప్పుడు ఈ కాంగ్రెస్ చెంపలు వేసుకోక తప్పదు. కానీ అప్పటికే చేతులు కాలిపోయి ఉంటాయి. కాంగ్రెస్ ఖర్మ కాలి, ఆయన్ని కారాగారంలో వేసింది. అక్కడైతే బంధించింది కానీ, పదికోట్ల ప్రజాహృదయంలో జగన్ ఆత్మబంధువై ఉన్నాడన్న సంగతి మరిచింది. ఫలితం త్వరంలోనే అనుభవించబోతోంది. 

- మన్నెముత్తుల శబరీదేవి, లేబూరు, ఇందుకూరుపేట మండలం, నెల్లూరు 

గంజాయి వనంలో తులసి మొక్క... జగన్

వై.ఎస్. మరణం రాష్ట్రానికి తీరని లోటు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత కరెంట్, జలయజ్ఞం, విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, వికలాంగులకు, వృద్ధాప్య పెన్షన్, 104, 108 వంటి పథకాలు ప్రజల గుండెల్లో నాటుకుని పోయాయి. అందుకే ఆయన చిరస్మరణీయుడు. వై.ఎస్. మరణం తట్టుకోలేక రాష్ట్రంలో కొన్ని వేలమంది మరణించారు. వై.ఎస్. మరణించిన రోజు కర్నూలు జిల్లాలోని నల్లకాలువ వద్ద వై.ఎస్. తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి - పెద్దాయన పోయిన దుఃఖంతో మరణించినవారికి ‘ఓదార్పు’ అందించటానికి వెళ్తుంటే సోనియా నిరాకరించారు. జగన్ ఆమె మాట కాదన్నందుకు కొంతమంది కాంగ్రెస్ పెద్దలు ఆయనను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. అయినా ఏమాత్రం భయపడకుండా ఇచ్చినమాట ప్రకారం ఓదార్పు కొనసాగిస్తే చివరకు సీబీఐ సహాయంతో అతనిని జైల్లో పెట్టించారు. వై.ఎస్. కష్టపడి రెండుసార్లు కాంగ్రెస్‌ను గెలిపిస్తే, అందుకు బహుమానంగా కాంగ్రెస్ పార్టీవాళ్లు జగన్‌ను జైల్లో పెట్టించారు.

జగనన్నా! ఎవరెన్ని మోసాలు చేసినా, ఎవరెన్ని కుట్రలు పన్నినా, నువ్వు గంజాయి వనంలో తులసిమొక్కలాంటి వాడివి. దేవుని ఆశీస్సులతో, ప్రజాబలంతో, తప్పకుండా బయటకొస్తావు. నీ పాలన కోసం కోట్లమంది ఎదురుచూస్తున్నారు.

- సి.నరసింహులు, రాకెట్ల, అనంతపురం
Share this article :

0 comments: