ఈ దేశంలో న్యాయం అందరికీ ఒకేలా ఉండదా?! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ దేశంలో న్యాయం అందరికీ ఒకేలా ఉండదా?!

ఈ దేశంలో న్యాయం అందరికీ ఒకేలా ఉండదా?!

Written By news on Tuesday, January 22, 2013 | 1/22/2013

అన్నా! నీ కోసం హృదయపూర్వకంగా చేసిన ఈ సంతకాల సేకరణకు కారణం ఉంది. మాకు రెండెకరాల పొలం ఉమ్మడిలో ఉంది. నాన్న (వైఎస్సార్) ఇచ్చిన ఉచిత విద్యుత్ వల్ల ఇప్పటివరకూ వ్యవసాయం చేయగలుగుతున్నాం. అలాగే రేషన్‌కార్డు కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా రాని తెల్లకార్డు నాన్న హయాంలో మాకు, మా ఊరి జనానికి ఏ రికమెండేషన్ లేకుండా వచ్చింది. మేమందరం ఎంతో సంతోషంతో కార్డులు తెచ్చుకున్నాం. అలాగే ‘పోలవరం’ పూర్తవుతుందనుకునే తరుణంలో రాష్ట్రానికి వైఎస్సార్‌గారి మరణం తీవ్ర విషాదం మిగిల్చింది. 

ఆ తర్వాత - క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం అన్నట్లు చరిత్రలో మన ఆంధ్ర రాష్ట్రం కూడా ‘రాజశేఖరరెడ్డిగారు జీవించి ఉన్నప్పుడు’, ‘రాజశేఖరరెడ్డిగారు మరణించిన తరువాత’ అని రెండు కాలాలుగా విడిపోయింది. రాష్ట్రంలో ప్రజలు ఏ నాయకుడి వైపు చూడాలి? అనుకుంటున్న సమయంలో... జగన్ అనే ఒక యువశక్తి ఉదయిస్తున్నాడని అందరం ఎంతో సంతోషించాం. కానీ కొన్ని రాజకీయ దుష్టశక్తులు ఆ సంతోషాన్ని కూడా మాకు లేకుండా చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక యువనాయకుణ్ని ఏ విధంగా కష్టాలపాలు చేస్తున్నదీ, అతడి కుటుంబాన్ని ఏ విధంగా వేధిస్తున్నదీ ప్రజలందరూ రోజూ చూస్తూనే ఉన్నారు. ఈ భారతదేశ సంస్కృతిని, ప్రజాస్వామ్య వ్యవస్థను, సమాజాన్ని, న్యాయవ్యవస్థను, దేశంలోని రాజకీయ నాయకులను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను ‘అన్నా! ఈ దేశంలో న్యాయం అందరికీ ఒకేలా ఉండదా?’ అని. 

అన్నా! దేశంలోని వ్యక్తులందరూ ఒకవైపు, నిన్నొక్కడినే ఒకవైపు చేసి, నీపై ఇలా కుట్రలు పన్నుతుంటే జనం సహించలేకపోతున్నారు. మనదేశంలో ఇదేవిధంగా ఒకరినొకరు అణగదొక్కుకుంటూ, దేశ అభివృద్ధిని కుంటుపరుస్తూ, భరతమాతను తూట్లు పొడుస్తున్నారు. ఈ నీచ సంస్కృతి మారకపోతే దేశంలో ఉండటం కూడా ఒక శిక్షే అనిపిస్తుంది. జగనన్నా... ఈ యూపీఏ కార్పొరేట్ రాజకీయం అంతమయ్యే రోజులు దగ్గరపడ్డాయి. ఎవరెన్ని కుట్రలు పన్నినా, నీకు వ్యతిరేకంగా ఏ పని చేసినా ఊహించని విధంగా అది వారికే మైనస్ అయి తీరుతుంది.

- పి.శశిధర్, ప్రత్తిపాడు

గల్లీ లీడర్ల మాట విని ఢిల్లీ తప్పు చేసింది!

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్జీవం అయిన తరుణంలో వైఎస్సార్ తన పాదయాత్రతో ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ పేదప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా కాంగ్రెస్ పార్టీని తిరిగి బతికించి అధికారంలోకి తీసుకొచ్చారు. ఇవాళ అదే కాంగ్రెస్‌పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని సీబీఐ సహకారంతో ఇబ్బంది పెడుతున్న దుర్నీతిని, విశ్వాసఘాతుకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గమనిస్తున్నారు. ఒక్క షర్మిలమ్మే కాదు, రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ జగన్ వదిలిన బాణాలై కాంగ్రెస్, టీడీపీ గుండెల్లో దిగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజన్న రాజ్యానికి జగనన్న పునఃప్రతిష్టాపన చేస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. గల్లీలో కూడా పనికిరాని నాయకుల మాటలు విని జగన్‌ను దూరం చేసుకున్నామే అని ఢిల్లీ లీడర్లు పశ్చాత్తాప పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

- కాళ్ల ఆది, మార్కాపురం, ప్రకాశం

సూర్యుడి మీద ఉమ్మితే... ఎక్కడ పడుతుందో తెలియదా?

జగన్ ఓదార్పు యాత్రకు మనసు లేనివారు ఎన్నో అడ్డంకులు కలుగజేశారు. తన తండ్రి మాదిరిగా జగన్ మడమ తిప్పకుండా మాట తప్పకుండా యాత్రకు బయలుదేరారు. ఓదార్పు వల్ల ఎవరికీ ఏ నష్టం కలగదు కదా! కానీ ఇలా వెళ్లడం కొంతమందికి నచ్చలేదు. జగన్‌కి ప్రజాదరణ, గౌరవ ప్రతిష్టలు ఎక్కడ వెల్లువలా పెల్లుబుకుతాయోనని ఈర్ష్యతో కొందరు నాయకులు కుట్రలు పన్ని ఆయన్ని జైల్లో వేయించారు. ఎవరేం చేసినా అంతిమ విజయం విశ్వసనీయత ఉన్న నాయకుడికేనని ఉపఎన్నికల్లో రుజువయింది. సూర్యుని మీద ఉమ్మితే ఎక్కడ పడుతుందో అందరికీ తెలిసిన విషయమే. అదే జరిగింది. 156 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో, దాదాపు 125 మంది వైఎస్సార్‌గారి ప్రాబల్యంతో గెలిచినవారే. ఈ విషయం వారి అంతరాత్మలకు తెలుసు. ఎవరికైనా చెడు చేయాలనుకుంటే, అది ఓనాటికి వారికే చావుదెబ్బ అవుతుంది. ఇకనైనా జగన్ ఊసు ఎత్తకుండా ఉంటే మంచిది. జగన్ మీద అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే ప్రజలు క్షమించరు. 

- అమరేశ్వరపు వెంకటేశ్వర్లు
క్రోసూరు, గుంటూరు
Share this article :

0 comments: