బాబు నోట వాస్తవాలా?: భూమన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు నోట వాస్తవాలా?: భూమన

బాబు నోట వాస్తవాలా?: భూమన

Written By news on Wednesday, January 16, 2013 | 1/16/2013

 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబు నోట ఏనాడు వాస్తవం రాలేదని ఆయన అన్నారు. అందుకే చంద్రబాబు ఇప్పుడు కోటి సంతకాలపై అవాకులు చెవాకులు పేలుతున్నారని భూమన మండిపడ్డారు.

జగన్ అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ కోట్లమంది సంతకాలు చేస్తుంటే...దాన్ని బాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. జనం ఇప్పుడు స్పందించినట్లే సార్వత్రిక ఎన్నికల్లో కూడా స్పందిస్తారని, చంద్రబాబుకు శంకరగిరి మాన్యాలు తప్పవని భూమన జోస్యం చెప్పారు.
Share this article :

0 comments: