రాహుల్ మెప్పుకోసమే చంద్రబాబు పాట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాహుల్ మెప్పుకోసమే చంద్రబాబు పాట్లు

రాహుల్ మెప్పుకోసమే చంద్రబాబు పాట్లు

Written By news on Friday, January 25, 2013 | 1/25/2013

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మెప్పు కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పడరాని పాట్లు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బి.జనక్ ప్రసాద్ దుయ్యబట్టారు. ఐఎంజీ భూముల అక్రమాల బాగోతం నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్‌న ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్నారు. ఇందులో భాగంగానే రాహుల్‌ను ప్రధాని చేసేందుకు తాము మద్దతిస్తామని జాతీయ దినపత్రికల్లో బాబు కథనాలు రాయించుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జనక్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కును కూలంకషంగా వివరించారు. 

‘ది హిందూ’, వైఎస్సార్‌సీపీపై వ్యతిరేక కథనాలు రాసే ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికల్లో కాంగ్రెస్-టీడీపీ మైత్రిపై వస్తున్న వార్తా కథనాలపై చంద్రబాబుగానీ, ఆయన భజనపరులుగానీ ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అదే పత్రికలు వైఎస్సార్ కాంగ్రెస్‌పై చిన్న కథనం రాస్తే అగ్గి మీద గుగ్గిలం మాదిరిగా ఎగిరిపడే టీడీపీ నేతలు... ఇప్పుడు మౌనం దాల్చడం వెనకున్న మతలబు ఏమిటన్నారు. జగన్‌పై అక్రమ కేసులను బనాయించడం కోసం కాంగ్రెస్ నేత శంకర్రావుతో కలసి పనిచేయడం మొదలుకొని.. చీకట్లో చిదంబరాన్ని కలవడం, ప్రధాని మన్మోహన్‌తో రహస్యంగా భేటీ, ఇటీవల ఎఫ్‌డీఐ బిల్లు విషయంలో యూపీఏను గట్టెక్కించడం వరకూ చంద్రబాబు కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ కనుసన్నల్లోనే చంద్రబాబు పనిచేస్తున్నారని చెప్పారు. 2జీ స్పెక్ట్రం స్కామ్‌లో చిదంబరం, బొగ్గు కుంభకోణంలో ప్రధాని మన్మోహన్‌పైనా, సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపైనా వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు పల్లెత్తు మాట మాట్లాడటం లేదని గుర్తు చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి మంత్రి పదవులు పొందినట్లు చంద్రబాబు కూడా టీడీపీని కాంగ్రెస్‌లో కలిపేసుకుంటే ఆయనకు గౌరవముంటుందని జనక్ ప్రసాద్ హితవు పలికారు. జగన్ ఆస్తులపై నోరు పారేసుకుంటున్న చంద్రబాబు.. తన బినామీలైన సుజనా చౌదరి, సీఎం రమేష్, మురళీమోహన్, నామా నాగేశ్వరరావు, రామోజీరావు ఆస్తులపై దర్యాప్తు కోరాలని జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: