ధర్మకాటాలో తేలిపోతున్న హక్కులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ధర్మకాటాలో తేలిపోతున్న హక్కులు

ధర్మకాటాలో తేలిపోతున్న హక్కులు

Written By news on Saturday, January 26, 2013 | 1/26/2013

‘‘జైలు గేట్ల దగ్గరకు చేరగానే ఖైదీకీ, అతని ప్రాథమిక హక్కులకూ ఉన్న సంబంధం తెగిపోదుసుమా’’!
- జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్

ఆరోపించడానికి ఏమీ దొరకని వాడొకడు ఎదుటి వాడిని ‘మీ తాత బతికున్న రోజుల్లో పొగచుట్టలు తాగేవాడట’ అని కడుపుబ్బరం తీర్చుకుని పోయాడట! ఈ దేశంలో కొన్ని కేసులు అలా నడుస్తున్నాయి! గురువారం (24.1.2013) వైఎస్సార్ పార్టీ వ్యవస్థా పకుడు, పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ మరొకసారి పాత వాదనల ఆధారంగానే అడ్డుకోవ టంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే జగన్ కేసులో ఆ ముందురోజు (23.1.2013) హైకోర్టులో ఓ సరికొత్త పరిణామం జరిగింది. జగన్ ‘అక్రమ ఆస్తుల కేసు’లో ‘రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ’ మూలంగా విచారణను త్వరగా ముగించలేకపోతున్నామని సీబీఐ సరికొత్త ‘బాణం’ వదిలింది. ఈ వార్త అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే, వాయిదాల పద్ధతిలో ‘చిల్లర దుకాణం’లాగా సీబీఐ లాంటి విచారణ సంస్థ అభియోగపత్రాలు (చార్జిషీట్లు) ఇవ్వడమూ, కేసు ఒక ముగింపునకు రాకుండా చేయడమూ కేవలం సీనియర్ న్యాయవాదులకే కాదు, న్యాయవ్యవస్థ పట్ల గౌరవాభిమానాలున్న వారందరికీ రోజులు గడిచిన కొలదీ మరింత విస్మయపరుస్తోంది. 

జగన్‌పై మోపిన కేసులు ‘వయా’ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మంత్రి మండలి అమలులోకి వచ్చిన 26 జీవోల మీదుగా, పరోక్షంగా జగన్‌కూ అతని కంపెనీలకూ, ఆ జీవోల నుంచి లబ్ధి పొందగోరిన ఇతర కంపెనీల అధినేతలు జగన్ కంపెనీలలోకి పెట్టుబడులు దించారన్న సాగలాగుడు విద్యపై ఆధారపడి సీబీఐ మోపినవే. ఎంతకూ ఈ కేసులు ఒక కొలిక్కి రాకపోవడానికీ, జీవోలకూ జగన్ ఆస్తులకూ మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని నిరూపించడంలో సీబీఐ విఫలమవుతూనే ఉండటానికీ, జగన్‌కు బెయిల్ రాక పోవడానికీ కారణం రాజకీయం తప్ప మరొకటి కాదు! రోజులు గడుస్తున్న కొద్దీ ఈ నమ్మకం ప్రజల మనస్సుల్లో బలపడుతున్నది. 

ఎందుకంటే జగన్ కేసు ఇంతకుముందు సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు కూడా గౌరవ న్యాయస్థానం సీబీఐని త్వరగా విచారణను పూర్తి చేయమని చెప్పడమేగాక (2013 మార్చికన్నా గడువు మించడానికి వీల్లేదని రికార్డు మీద పెట్టకపోయినా మాట మాత్రంగా చెప్పిన ప్పటికీ), కింది కోర్టు విచారణ సందర్భంగానే బెయిల్ పిటిషన్‌ను కూడా ప్రతిపాదించుకునే అవకాశం జగన్‌కూ కల్పించింది. అయినా, మాసాల తరబడి కేసులను ఒక కొలిక్కి తీసుకురాకుండా జాప్యం చేస్తున్న సీబీఐ ఒక్కో న్యాయ స్థానం ముందు ఒక్కోలాగా ఆయనకు బెయిల్ రాకుండా నిరోధించే ‘టెక్నిక్’కు అలవాటుపడింది. అక్కడికీ సీబీఐ ప్రత్యేక కోర్టు గౌరవ న్యాయమూర్తులు (జస్టిస్ భాను, జస్టిస్ నాగమారుతి శర్మ) ప్రాథమిక అభియోగపత్రంలో పేర్కొన్న ఒకరిద్దరిని తప్ప మిగతా నిందితుల్ని (70 మందిని) ఎందుకు అరెస్టు చేయలేదు? అసలు మీ పద్ధతులేమిటి? అని పదే పదే ప్రశ్నించాల్సివచ్చిందని మరవరాదు! 

అంతేగాదు, చివరికి ఈనెల 23న జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలో కూడా గౌరవ న్యాయమూర్తి శేషశయనారెడ్డి ‘‘దర్యాప్తుకు ఒక నిర్దిష్టమైన గడువంటూ ఉండాలి, కాని అలాంటిదేమీ లేకుండా మీరు ఇలా సాగదీస్తారా’’అని సీబీఐని నిలదీయాల్సివచ్చిందంటే - సీబీఐ సాగదీత వెనక కాంగ్రెస్ అధిష్టాన స్వార్థ రాజకీయ హస్తం ఉందన్న సందేశం ప్రజాబాహుళ్యానికి అందించినట్టయింది! ‘ఏడు అంశాల’పైన దర్యాప్తును మే నెలలోగా పూర్తి చేసి తీరాలని సుప్రీంకోర్టు ఏనాడో ఆదేశించినా, మూడింటిలో మాత్రమే దర్యాప్తు పూర్తి చేశామని చెప్పడం, దర్యాప్తు పూర్తికాలేదన్న సాకుపైన న్యాయస్థానాల్లో ఇంకా రుజువు కావలసి ఉన్నప్పటికీ బెయిల్ నిరాకరించడం న్యాయశాస్త్ర విరుద్ధమేగాక, నేర శిక్షాస్మృతి నిబంధనలను కోర్టు తీర్పులను కూడా సీబీఐ బాహాటంగా ఉల్లంఘించడమే అవుతుంది. పైగా, బెయిల్ ఇస్తే ‘సాక్షుల’’ను బెదిరిస్తారని, ప్రభావితం చేస్తారన్న ఒక ‘ఊహ’ను తడికెగా అడ్డంపెట్టుకుని ఇన్నాళ్లూ సీబీఐ జగన్‌కు బెయిల్ నిరాకరించడం న్యాయ శాస్త్ర ప్రాథమిక సూత్రాలకే విరుద్ధం. పేరు మోసిన నేరగాళ్లకు, గుప్తధనం లావాదేవీలు నడిపిన (మనీ-లాండరింగ్) వారికి సైతం బెయిళ్లు మంజూరైన వాస్తవాన్ని ఎవరూ కాదనజాలరు. 

జగన్ శాసనసభ ఆవరణలోకి వెళ్లి ఉప ఎన్నికల సందర్భంగా ఓటు వినియోగించినప్పుడు గానీ, జైల్లో తనను చూడవచ్చిన విభిన్న రాజకీయ పక్షాల వారిని కలుసుకున్నప్పుడు గానీ ఎవరినీ ప్రభావితం చేసినట్లు, పారిపోవడానికి ప్రయత్నించిన సన్నివేశాలు గానీ ఏవీలేవని లోకానికీ తెలుసు. సీబీఐకీ తెలుసు! క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 437 కింద కేసులో ఉండి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తులకు లేదా కిరాయి హంతకులకు డబ్బిచ్చి హత్యలు చేయించారన్న ఆరోపణలున్న వ్యక్తులకు మాత్రమే బెయిల్ నిరాకరించే హక్కును న్యాయస్థానాలకు చట్టం కల్పిస్తోంది (1987 సుప్రీంకోర్టు షాజాద్ హసన్ ఖాన్ కేసు; 1998 సుప్రీంకోర్టు రమేష్ తౌరానీ కేసు తీర్పులు). వ్యక్తి స్వేచ్ఛ హక్కు పవిత్రతకూ, సమాజ ప్రయోజనాల రక్షణకూ మధ్య సమతూకాన్ని పాటించే విధంగా న్యాయసూత్రాలు ఉండాలని న్యాయశాస్త్రం చెబుతోంది.

అంతేకాదు, రాజ్యాంగం గ్యారంటీ చేస్తున్న ‘జీవించే హక్కు’ గురించి సుప్రీం గౌరవ మాజీ న్యాయమూర్తి చిన్నపరెడ్డి ప్రస్తావిస్తూ, సుప్రీంకోర్టు ఎలాంటి ప్రభుత్వ ప్రలోభాలకు లేదా ఒత్తిళ్లకూ లొంగని ఒకానొక దశలో జస్టిస్ ఫీల్డ్ ‘జీవితం’ గురించి ఇచ్చిన నిర్వచనాన్ని ఉదహరించారు. జస్టిస్ ఫీల్డ్ దృష్టిలో ‘జీవితం అన్న పదానికి విలువైన అర్థం ఉంది. జీవితం అంటే పశువులా జీవించడం కాదు’ అంతేగాదు, ‘ఒక మనిషి, అతను సామాన్యుడు గానీ, అసామాన్యుడు గానీ, జీవించాల్సిన జీవితాన్ని అనుభవించ నివ్వకుండా చేయడమంటే, ఏ జీవితాన్ని అనుభవించడానికి మనిషి సర్వాంగాలూ తోడు నీడలవుతాయో వాటన్నింటనీ మనిషి కోల్పోవటమనే అర్థం’ అని ఫీల్డ్ అన్నాడు!

చేతనా న్యాయశాస్త్రానికి నేటి దాకా నిగ్గుతేలిన ప్రతినిధిగా నిలిచిన జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ ఈ నిర్వచనం నుంచే ఉత్తేజితుడై ‘చెరసాలల ధర్మశాస్త్రా’నికి (ప్రిజన్ జూరిస్ ప్రూడెన్స్) ఒక కేసులో సరికొత్త భాష్యం చెప్పారు. ‘రాజ్యాం గంలోని జీవించే హక్కును పౌరునికి గ్యారంటీ చేసిన 21వ అధికరణకు నిష్పా క్షికమైన, న్యాయబద్ధమైన అనుసరణ అనేది ఆత్మ. కాగా 19(5) అధికరణ పిండితార్థం - విధించే అదుపాజ్ఞలు హేతుబద్ధంగా ఉండాలని శాసిస్తోంది. కాని ఈ అధికరణను అమలుజరిపే పద్ధతి వివక్షదశకు దిగజారిపోయింది. ఈ దిగజా రుడుతనం రాజ్యాంగంలోని 14వ అధికరణకే పరమ శాపంగా తయార యింద’న్నారు జస్టిస్ కృష్ణయ్యర్!

ఇంతకూ మన రాజ్యాంగం, అమెరికన్ రాజ్యాంగంలోని మంచి లక్షణాలకు కూడా దూరంగా ఉంది. విచారణ లేదా దర్యాప్తులూ క్రమపద్ధతిలో జరగాలన్న నిబంధన (డ్యూ ప్రోసెస్ క్లాజు) గానీ, అమెరికా రాజ్యాంగంలోని 8వ సవరణా నుభవం గానీ మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో (నేర న్యాయ విచారణ వ్యవస్థలో) కొరవడ్డాయని న్యాయశాస్త్ర కోవిదుల అభిప్రాయం. అందుకే కొన్ని సందర్భాల్లో కొందరు గౌరవ న్యాయమూర్తుల నుంచి ‘నిరంకుశోపాఖ్యానాలు’ వింటూం టాం! బహుశా అందుకనే జస్టిస్ కృష్ణయ్యర్ కేవలం అధికారం చెలాయించే ధోరణిలో వ్యవహరించే న్యాయమూర్తుల్ని ‘ప్రజాస్వామ్యానికి మోయరాని బరువు’ (లయబిల్టీ టు డెమోక్రసీ) అని ఉంటాడు!

ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఇప్పుడు సీబీఐ జగన్‌పైన కేసుల దర్యాప్తును ‘‘త్వరగా తెమల్చడా’’నికి అడ్డంకి కిరణ్‌కుమార్ ప్రభుత్వమేనని ఆరోపిస్తోందంటే - కేబినెట్ మంత్రులుగా ఉంటూ వచ్చిన ధర్మాన ప్రసాద రావును, మోపిదేవిని ఆ 26 జీవోలను సమర్థించడం వల్లనూ, ఆ జీవోలు సక్రమంగానే ఉన్నాయని కిరణ్‌కుమార్ ప్రభుత్వం నిర్ధారించడం వల్లనూ తమ చేతులాడటం లేదని సీబీఐ భావిస్తున్నట్టుంది! చేతులాడకపోవడమే కాదు, ఈ లెక్కన మొత్తం కేసుల రుజువర్తనకే ఎసరువచ్చి, సీబీఐ పరువు ప్రతిష్టలకే (అవి మిగిలి ఉంటే) మచ్చ వచ్చే పరిస్థితులు ముంచుకొస్తున్నందున సీబీఐ కిరణ్ ప్రభుత్వాన్ని అలా ఆడిపోసుకోవడంలో తప్పులేదు! అన్నట్టు మరవరాని మరి కొన్ని విషయాలు - జగన్‌పై కక్షసాధింపు కాంగ్రెస్ చరిత్రలో ఓ పెద్ద రాజకీయ ప్రక్రియ అనడానికి బెదిరింపుల పర్వం కాంగ్రెస్ అధిష్టానం తలపెట్టిన ‘ద్రావిడ ప్రాణాయామ’ యజ్ఞంలో ఒక భాగం. 

ముక్కు ఏదంటే నె రుగా చూపకుండా, వేలును తలచుట్టూ తిప్పి చూపించినట్టుగానే యూపీలో మాయావతిని, ములా యంసింగ్‌ను తమ అవసరానికి తగ్గట్టు లొంగదీసుకోవడానికి కాంగ్రెస్ అధి ష్టానం విచారణ సంస్థలను ఎలా బెదిరింపులతో వినియోగిస్తూ వచ్చిందో, ఎలా ‘లాభలబ్ధి’ (క్విడ్ ప్రోకో)కి ఏతామెత్తిందో వారిపై నడిపిన కేసులు, వాటి ఉపసంహరణ తంతే నిరూపించింది. కాని జగన్ విషయంలో అలాంటి ‘మంత్రం’ తంత్రం ఏదీ పారినట్టు కనిపించదు! అందుకే కేసులు సాగుతూ, కొనసాగుతూ ఉంటాయి. 

ఎమర్జెన్సీ కాలంలో పౌరుల ప్రాథమికహక్కుల అధ్యాయాన్ని ఇందిరాగాంధీ చాపచుట్టివేసినప్పుడు అంతటి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు లోని మెజారిటీ న్యాయమూర్తులలో కొందరు భయభ్రాంతులకు లోనై ఆ హక్కులకు తిరిగి ఊపిరి పోసే సాహసం చేయలేని దుర్ముహూర్తంలో ప్రాథమిక హక్కుల పునరుద్ధరణకు ప్రాణప్రదమైన హెబియస్ కార్పస్ పిటిషన్లను ధైర్యసాహసాలతో పునరుద్ధరించి, వందలాది మంది డిటెన్యూల విడుదలను సుగమం చేసిన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా!

అదెప్పుడు సాధ్యమ వుతుంది? నిర్భయంతో ముందడుగు వేయగలిగినప్పుడు! అందుకే ఖన్నా అంటాడు: ‘నిజం చెప్పడానికి భయపడితే అది మానవ వ్యక్తిత్వాన్ని మసక బారుస్తుంది, హీరోలను మట్టిముద్దలను చేసి ‘జీరో’లుగా మారుస్తుంది. జీవితపు ఉన్నత విలువల్ని కాంతిహీనం చేస్తుంది. భయమున్న చోట న్యాయం తలెత్తుకో లేదు. భయ వాతావరణానికి బందీలయినందుననే మహా వ్యక్తులయిన జోన్ ఆఫ్ ఆర్కి, గెలీలియో, డ్రీఫస్‌లు దెబ్బతిన్నారు. అందుకే మహాతాత్వికులంతా భయం నుంచి స్వేచ్ఛ పొందడానికే మొదటి తాంబూలమిచ్చారు!’ఆ సాహసం జాతీయ స్వాతంత్య్ర సమరం నాటి బార్ సుసంప్రదాయం. స్వాతంత్య్ర సమరం నాటి బార్ సుసంప్రదాయం ఆ సాహసమే.


http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=56555&Categoryid=1&subcatid=18 
Share this article :

0 comments: