‘బాబు’జిల్లాలో బీటలువారుతున్న టీడీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘బాబు’జిల్లాలో బీటలువారుతున్న టీడీపీ

‘బాబు’జిల్లాలో బీటలువారుతున్న టీడీపీ

Written By news on Saturday, January 5, 2013 | 1/05/2013

ముఖ్యనేతల నిష్ర్కమణతో దిక్కుతోచని వైనం

సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో క్రమంగా ఆ పార్టీ ఖాళీ అవుతోంది. ప్రస్తుతం నాలుగు నియోజక వర్గాల్లో ఇన్‌చార్జ్‌లను నియమించుకోలేక ఉక్కిరి బిక్కిరవుతోంది. చంద్రబాబు నాయుడు కుమ్మక్కు రాజకీయాలను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథరెడ్డి (పలమనేరు) ఎ.వి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(తంబళ్లపల్లె) గత నెలలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న టీడీపీకి పీలేరులో మరో దెబ్బ పడింది. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబంతో నాలుగు దశాబ్దాలుగా రాజకీయ పోరు సాగిస్తున్న కుటుంబానికి చెందిన మాజీ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి గురువారం టీడీపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణరుుంచడంతో పీలేరు నియోజకవర్గంలో సైతం టీడీపీకి నాయకత్వ సమస్య ఏర్పడింది.
నాలుగు దశాబ్దాల రాజకీయనేపథ్యం

వాల్మీకిపురం శాసనసభా స్థానం నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి నల్లారి అమరనాథరెడ్డి మీద చింతల రామచంద్రారెడ్డి తండ్రి సురేంద్రరెడ్డి 1972లో స్వతంత్ర అభ్యర్థిగాను, 1978లో జనతా పార్టీ అభ్యర్థిగాను పోటీ చేసి ఓడిపోయారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా సురేంద్రరెడ్డి పోటీ చేసి అమరనాథరెడ్డిని ఓడించారు. 1985లో మళ్లీ అమరనాథరెడ్డి గెలిచి 1988లో మరణించారు. దీంతో వాల్మీకిపురం స్థానానికి 1988లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో 25 సంవత్సరాల వయస్సులోనే చింతల రామచంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి అమరనాథరెడ్డి సతీమణి సరోజమ్మను ఓడించారు. 1989లో కిరణ్‌కుమార్ రెడ్డి మీద ఓడిన చింతల మళ్లీ 1994లో కిరణ్‌కుమార్ రెడ్డిని ఓడించారు. ఆ ఎన్నిక నుంచే కిరణ్‌కుమార్ రెడ్డి- చింతల రామచంద్రారెడ్డి రెండు వర్గాలకు నాయకులయ్యారు. 

అప్పటినుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి మీద చింతల రామచంద్రారెడ్డి రాజకీయ పోరాటం సాగిస్తూనే ఉన్నారు. 1995 నుంచి 1997 దాకా చింతల రామచంద్రారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 2004లో టీడీపీ టికెట్ దక్కక పోయినా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న రామచంద్రారెడ్డి 2009 ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే వాతావరణం కనిపించడంతో ప్రజారాజ్యంలో చేరారు. ఆ ఎన్నికల్లో పీలేరు స్థానం నుంచి పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధిం చారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయడంతో ఆ పార్టీలో ఇమడలేక, కిరణ్‌కుమార్‌రెడ్డి మీద పోరాటం చేయడానికి మళ్లీ టీడీపీవైపు మొగ్గుచూపారు. కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా టీడీపీ మారిన వైనం చూసి చింతల గత నాలుగు నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన మద్దతుదారుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. 
Share this article :

0 comments: