ఆరోపణలు చేసిన ఆ రెండు పార్టీలు ఇప్పటికీ ఆధారాలు ....... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆరోపణలు చేసిన ఆ రెండు పార్టీలు ఇప్పటికీ ఆధారాలు .......

ఆరోపణలు చేసిన ఆ రెండు పార్టీలు ఇప్పటికీ ఆధారాలు .......

Written By news on Wednesday, January 16, 2013 | 1/16/2013

కాంగ్రెస్, టీడీపీలు కలిసి జగన్ పై కేసులు వేశారు అని వైఎస్ విజయమ్మ ఆరోపించారు. లక్షల కోట్లు అవినీతి అని చెప్పి ఆరోపణలు చేసిన ఆ రెండు పార్టీలు ఇప్పటికీ ఆధారాలు చూపడం లేదని విజయమ్మ అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం మహానేత వైఎస్ఆర్ కు తెలియదని.. తన దగ్గర ఉన్నది పెట్టడమే వైఎస్ కు తెలుసు అని విజయమ్మ తెలిపారు. 

విచారణ చేయడంలేదు, ఛార్జిషీటు వేయడంలేదని.. బెయిల్ అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు అని.. జగన్‌ను ఎన్నిరోజులని జైల్లో పెడతారని విజయమ్మ ప్రశ్నించారు. సురేష్ కల్మాడీ, కనిమొళి, రాజాలు ఎంపీలే కదా..వారికి బెయిల్ ఎలా ఇచ్చారన్నారు. ఈ కేసులో మోపిదేవిని బలిపశువు చేశారని.. వారంరోజుల్లో బయటకు తీసుకొస్తానని చెప్పి... ఆయన్ని జైలుకు పంపారు అని విజయమ్మ అన్నారు. 

ధర్మానను ప్రాసిక్యూషన్ చేయడానికి క్యాబినెటే ఒప్పుకోలేదని.. చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తనకు ఆదేశిస్తే.. సిబ్బంది లేదని సాకులు చెప్పారన్నారు. ఇక ఈకేసు దర్యాప్తు నుంచి ల్యాంకో రాజగోపాల్ తమ్ముడిని మినహాయించడాన్ని ఆమె తప్పు పట్టారు. కేవలం 20 రోజుల వ్యవధిలో 2 కోట్లమంది జగన్ నిర్దోషి అని సంతకాలు పెట్టారు.. కోటి సంతకాల కార్యక్రమంపై కొన్నిఛానళ్లు దుష్ప్రచారం చేశాయి.. చానెళ్లు తీరు తీవ్ర బాధ కలిగించింది అని వైఎస్ విజయమ్మ అన్నారు. 

వ్యతిరేక మీడియాకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, జగన్ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. వ్యక్తుల వ్యక్తిగత వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని ప్రధాని, ఆర్థికమంత్రి చెప్పారని.. ములాయం సింగ్ కేసులో ఆమె కోడలు డింపుల్ యాదవ్ పై విచారణ వద్దని సుప్రీం చెప్పిన విషయాన్ని విజయమ్మ ప్రస్తావించారు. అలాంటప్పుడు ఏ పదవిలో లేని జగన్ పై విచారణ ఎలా చేస్తున్నారు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. 
Share this article :

0 comments: