బంధించింది ‘ఒక్క’ జగన్‌నే కాదు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బంధించింది ‘ఒక్క’ జగన్‌నే కాదు!

బంధించింది ‘ఒక్క’ జగన్‌నే కాదు!

Written By news on Tuesday, January 29, 2013 | 1/29/2013

కడప పార్లమెంటు సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన జగన్‌ను అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఎందుకంటే ఆయన ఏ తప్పూ చేయలేదు. 2009కి ముందు ప్రభుత్వంలో జరిగిన తప్పులకు జగన్‌ని ఎందుకు బాధ్యుడిని చేసి అరెస్ట్ చేయాలి? నిజంగా తప్పు జరిగి ఉంటే అప్పటి కేబినెట్ బాధ్యత వహించాలి కాని, దానికి విరుద్ధంగా ఆనాడు ఏ పదవిలోనూ లేని, దేనితోనూ ఏమాత్రం సంబంధంలేని వ్యక్తిని జైల్లోపెట్టడం న్యాయమేనా అని ఆలోచించాలి. పోనీ జగన్ చేసిన తప్పులైనా సీబీఐ ఎత్తి చూపించాలి కదా! చూపించలేదు. ఎందుకంటే ఆధారాలతో అరెస్ట్ చేయలేదు కాబట్టి. 

కేవలం రాజకీయ కారణాలతోనే అరెస్ట్ చేసింది కాబట్టి. జగన్ బయట ఉంటే ఉప ఎన్నికల్లో తమకు డిపాజిట్లు కూడా రావు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీ కుమ్మక్కై చేసిన కుట్ర తాలూకు పరిణామమే జగన్ అరెస్ట్. అయినా జగన్‌లోనే జనం, జనంలోనే జగన్ ఉన్నారన్న సంగతి ఎన్నికల ఫలితాలు వచ్చాక గానీ కాంగ్రెస్, టీడీపీలు గుర్తించలేకపోయాయి. జగన్ మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి పదమూడు నెలలు దాటినా సి.బి.ఐ. ఎలాంటి ఆధారాలనూ చూపించలేదు. భారత రాజ్యాంగం ప్రకారం, తొంభై రోజుల తర్వాత బెయిల్ పొందే అవకాశం ఉంది. కానీ బెయిల్ కూడా రానివ్వకుండా చేసి రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తోంది ఈ ప్రభుత్వం! ఏదేమైనా పేదల ఆపద్బాంధవుడు, ప్రజల పక్షపాతి జగన్ బయటికి వస్తారు. 2014లో ఈ ప్రభుత్వానికి, ఈ ప్రతిపక్షానికి తగిన గుణపాఠం చెబుతారు.

- మిడత కురుమయ్య, ఏదుట్ల, మహబూబ్‌నగర్

ముగ్గురు యువకుల కథ

ముగ్గురు యువకుల గూర్చిన మూడే మాటలు చెప్పెద
గాంధీ గాని గాంధీ ఒకడు ఎగిరెగిరి పడుతున్నడు
అమ్మ చాటు రాజకీయ తోడు నీడ నాకుంటే
నేనౌదును యింద్రప్రస్థ దేవేంద్రుని అనుకుంటే
సరిపోదోయ్ పొరపాటోయ్ 
గ్రహ ‘రాహువు’ అండ నీకు ఉందో లేదో గానీ
ఉండాల్సిన జనం అండ ఇసుమంతయు లేదు సుమీ,

******** 

లోకేశుని నేనౌదును మా బాబుని అండచేత
మామగాదు గీమగాదు నేను తప్ప ఇంకెవ్వరు
అనుకున్నాడర్భకుండు ఆకళింతలేనివాడు
అమ్మ భిక్ష బాబు భిక్ష మీ లోగిలివరకె గాని
జనం మిమ్ము మెచ్చనిదే కొరగారుర పురమేలగ

******** 

ఉన్నాడొక పులిబిడ్డడు కొదమసింగమై వస్తడు
వాండ్లవలె ఈ బిడ్డకు ఏ నాయకునండ లేదు
వస్తున్నాడొస్తున్నాడతడే అధినాయకుడై
రాజన్నా! నీ కలలను సాకారం చేసేందుకు
ఉదయించిన సూర్యుండై చిచ్చరపిడుగై వచ్చెను
నీవు లేని లోటు తీర్చ నీ బిడ్డడు మారాజై.
జగనన్నా నిజమన్నా బాట వెంట పూలుజల్లి
జనం ఎదురుచూస్తున్నరు నీరాజనమంటున్నరు
మిన్ను విరిగి మీదపడిన మొక్కవోని ధీరత్వం
పుణికిపుచ్చుకుంటివన్న నాన్న నుండి చిరునవ్వును
జగన్ జనం... జనం జగన్ అది నిన్నటి మాట
జగన్ ప్రభంజనం జన ప్రకంపనం ఇది నేటిమాట
ముఖ్యమంత్రి జగనన్నే ఆపనెవరితరమన్నా ఇది రేపటిమాట
నేనన్నది గాదు మాట ప్రభవించెను జనం నోట
జగనన్నా రా అన్నా... నీ వెంటే మేమన్నా!

- కె.ఆనందరెడ్డి, పులివెందుల

బంధించింది ‘ఒక్క’ జగన్‌నే కాదు!

వైఎస్సార్‌గారు పెద్దనేరం చేశారు. అదేంటంటే... ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఏదో ఒక రూపంలో మేలు చేసి అకస్మాత్తుగా ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. బదులుగా జగనన్న కోసం కోట్లాది మంది ప్రజలను ఒక పెద్ద కుటుంబంగా సంపాదించి పెట్టారు. ఇదేనేమో ‘క్విడ్ ప్రో కో’ నేరం అంటే. ఈ నేరంలో జగనన్న ఒక్కడే కాదు, ఆయన పక్షాన నిలిచిన ప్రజలంతా నేరస్తులే. కనుక మా అందర్నీ అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిందిగా కోరుతున్నాం.

- జనంపల్లి జగన్ శుభాకర్, కొత్తకోట, మహబూబ్‌నగర్

మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.e-mail: ysjagankosam@gmail.co
Share this article :

0 comments: