ఏ ముఖ్యమంత్రి భార్య సూట్‌కేస్ అయినా పోలీసులు చెక్ చేయడం మనం చూశామా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏ ముఖ్యమంత్రి భార్య సూట్‌కేస్ అయినా పోలీసులు చెక్ చేయడం మనం చూశామా?

ఏ ముఖ్యమంత్రి భార్య సూట్‌కేస్ అయినా పోలీసులు చెక్ చేయడం మనం చూశామా?

Written By news on Wednesday, January 30, 2013 | 1/30/2013


ఒకప్పుడు సీబీఐ అంటే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిజాలు వెలికితీసే కేంద్ర దర్యాప్తు సంస్థగా పేరుండేది. ఇప్పుడు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల జేబు సంస్థగా సీబీఐ మారిపోయిందన్న అప్రతిష్టను ఆ సంస్థ మూటకట్టుకుంది. ముఖ్యంగా సీబీఐని కాంగ్రెస్ వాడుకున్నట్లు, కేంద్రంలోని ఏ ప్రభుత్వం వాడుకోలేదు. తమకు ఇష్టం లేనివారి మీదకు సీబీఐని ప్రయోగించడం, వారు ఏ తప్పులు చేయనప్పటికీ వేధించడం, తప్పుడు కేసులు బనాయించడం కాంగ్రెస్‌కు పరిపాటైపోయింది.

తనకిష్టులైనవారు క్రిమినల్స్ అయినా, అవినీతిపరులైనా... వారిని రక్షించడానికి సైతం కాంగ్రెస్‌కు సీబీఐ ఆయుధం కావడం దురదృష్టకరం. ఇప్పుడు జగన్ కేసు కూడా మొదటి కేటగిరీ కిందకు వస్తుంది. గత ఏడాది ఆగస్టులో ఆయనపై అక్రమ కేసులు బనాయించి, ఒకేసారి ఆదాయపు పన్నుశాఖ చేత, కేంద్ర విజిలెన్స్ చేత దాడులు చేయించి, ఏదో కొంపలు మునిగే రీతిలో అలజడి సృష్టించింది. చివరికి ఏ ఆధారాలూ దొరక్క బోల్తాపడి, అరెస్టు అయిన అధికారుల చేత బలవంతంగా జగన్ తప్పుచేసినట్టు వాంగ్మూలం ఇమ్మని ఒత్తిడి చేయించింది.

ఉప ఎన్నికల ముందు ప్రజలమధ్యలో ఉన్న జగన్‌ను ిపిలిపించి, మూడు రోజుల దర్యాప్తుకని డ్రామాలాడి, కోర్టులో హాజరుకాబోతున్న ముందురోజు సీబీఐ చేత అరెస్టు చేయించింది. ఇదంతా జగన్‌పై కక్షసాధించడానికేనని చిన్న పిల్లలకి కూడా అర్థమవుతుంది. జగన్‌ను అరెస్టు చేసి బెయిల్ దొరక్కుండా పీడిస్తున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలు, ఆ దేవుడు గమనిస్తున్నారు. కాంగ్రెస్ త్వరలో పెద్ద మూల్యమే చెల్లించుకుంటుంది. అలాగే జగన్ నిర్దోషిగా బయటకు వచ్చేరోజు ఎంతో దూరంలో లేదు. రాష్ట్ర పరిస్థితులు చక్కదిద్దడానికి తన తండ్రి ఆశయాలను నెరవేర్చటానికి జగన్ సేవలు తమకు ఎంతో అవసరం అని ప్రజలు ఇప్పటికే గుర్తించారు.
- పి.కృష్ణమాచార్యులు, హైదరాబాద్


బెయిల్ ఎందుకిస్తారు? అక్రమ అరెస్టు కదా!
జగన్ కోసం

భారతిగారి చిన్నపాప అడిగినట్లు ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? మనం చదువుకున్న ప్రజాస్వామ్యం ఇలా లేదే?
హత్యలు చేసినవారికి ఈ ప్రభుత్వం బెయిల్ ఇస్తుంది కానీ, ఒక ఎంపీ, యువనేత అయిన జగన్‌కు ఇవ్వదా! ఎందుకు ఇస్తుంది? అక్రమ అరెస్టు కదా! ఏ ముఖ్యమంత్రి భార్య సూట్‌కేస్ అయినా పోలీసులు చెక్ చేయడం మనం చూశామా? జగనన్న ఓదార్పు యాత్రను అడ్డుకోడానికి ఇన్ని కుట్రలు, ఇన్ని వ్యూహాలు, ఇన్ని వేధింపులా?
హోలీ బైబిల్‌లో ‘దానియేలు’ అను సంస్థాన అధిపతి మీద తోటివారు అనేక నిందలు మోపి సింహపు బోనులో వేయిస్తారు.

మర్నాడు రాజు వచ్చి ‘జీవముగల దేవుని సేవకుడవైన దానియేలూ నీ దేవుడు నిన్ను రక్షించెనా’ అని అడుగుతాడు. ఆశ్చర్యం ఆయన సజీవంగా ఉంటాడు. జగనన్నా! మీరు ధైర్యంగా ఉండండి. దేవుడే మిమ్మల్ని అలా సురక్షితంగా బయటకు తీసుకొస్తారు. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు (బైబిల్ కీర్తనలు 6:10). యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడువారి కోరికను నీవు విని యున్నావు, తండ్రి లేనివారికి, నలిగినవారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయం స్థిరపరిచితివి. చెవి యొగ్గి ఆలకించితివి (కీర్తనలు 10:17, 18). భారతి అక్క, షర్మిల అక్క, విజయమ్మ... మీరు ధైర్యం కోల్పోకండి. కోట్లాదిమంది ప్రజలు మీ కొరకు ప్రార్థనలు చేయుచున్నారు. (కీర్తనలు 9:18లో బాధపరచుబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికిని నశించదు).

షర్మిల అక్క మరో ప్రజాప్రస్థానం ద్వారా ప్రజలకు దగ్గరవుతూ
జగనన్న వదిలిన బాణంలానే మీరంతా ప్రజలను ఓదారుస్తున్నారు.
2014లో తప్పకుండా ఘనవిజయం మనదే!
- ఎన్.కుసుమ విజయ్

ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా... ప్రజలు జగన్ వైపే!
ప్రజానాయకునికి, రాజకీయ నాయకునికి మధ్య ఉండే వ్యత్యాసానికి అర్థం, పరమార్థం తెలిపింది మహానేత దివంగత వైఎస్సార్‌గారు. అదేవిధంగా వై.ఎస్.జగన్ తనను అసలు సిసలు ప్రజా నాయకుడిగా నిరూపించుకున్నారు. ఇందుకు భిన్నంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు పదవుల కోసం పాకులాడుతూ ప్రజల బాధలను మరచి, తమ స్వార్ధం కోసం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతూ అధిష్టానం ముందు మోకాళ్ల మీద కూర్చుంటున్నారు. ఢిల్లీ చెప్పుచేతుల్లో ఉంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. వీటన్నిటికే ఒకటే పరిష్కారమార్గం... 2014 ఎన్నికలు.
- డి.సి.ఆర్.రెడ్డి, నెల్లూరు
Share this article :

0 comments: