చట్టాలపై ఇక నమ్మకమెలా ఉంటుంది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చట్టాలపై ఇక నమ్మకమెలా ఉంటుంది?

చట్టాలపై ఇక నమ్మకమెలా ఉంటుంది?

Written By news on Sunday, January 6, 2013 | 1/06/2013


జగన్... ఈ పేరు వింటేనే కాంగ్రెస్, టీడీపీ నాయకులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఆయన్ని రాజకీయంగా ఎదిరించలేక కుట్రలు, కుతంత్రాలతో జైల్లో పెట్టారన్నది జగమెరిగిన సత్యం. తమ మాట వినని నాయకుడు ఎవర్నైనా ఏదో రకంగా వేధించటం కాంగ్రెస్ ప్రభుత్వ ఆనవాయితీగా వస్తున్న ఆచారం. సీబీఐ కూడా తన వంతు సహాయ సహకారాలందిస్తుంటుంది. అందుకు నిదర్శనం జగన్‌ని జైలు నుండి బయటకు రానీయకుండా సీబీఐ చేస్తున్న ప్రయత్నాలు. ఇక ప్రజలకు చట్టాలపై నమ్మకం ఎలా ఉంటుంది? సీబీఐ తన తెలివితేటలు ఉపయోగిస్తూ కోర్టులో న్యాయమూర్తులను కూడా పక్కదోవ పట్టిస్తోంది. ఆ తెలివితేటల్ని మంచి కోసం ఉపయోగిస్తే ఎంతో బాగుండేది. ఒక్కటి మాత్రం నిజం. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో కొలువై ఉన్న జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. ఆ రోజు ఉదయించే సూర్యుడు కోటి కాంతులు వెదజల్లుతాడు.
- పి.నటరాజ్
రామవరప్పాడు, కృష్ణా


లక్ష ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నోరు విప్పదేం?

వైఎస్ మరణంతో గుండె ఆగి చనిపోయిన కుటుంబాలను వారి ఇళ్ల వద్ద జగన్ పరామర్శిస్తాననడం తప్పు ఎలా అవుతుంది? సోనియా దానిని వ్యతిరేకించి అడ్డుకోవడం అమానుషం కాదా? అది సోనియా స్వార్థపరత్వానికి పరాకాష్ఠ కాదా! తుదకు ఎఐసిసి కూడా దిగివచ్చి, ఆ కుటుంబాలను పరామర్శించి, లక్ష వంతున ఇస్తామని ప్రకటించక తప్పలేదు. ఆ ప్రకటన చేసి రెండేళ్లయినా అది ఆచరణకు నోచుకోలేదు.

ఇది గుర్తుచేసే ధైర్యం గల నాయకులు కాంగ్రెస్‌లో లేరా? బొత్స, కిరణ్‌లు ఏమయ్యారు? సోనియా అంటే అంత భయమా? ఓదార్పు యాత్రను బలపరచిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు బహిష్కరణలా? వైయస్ వ్యతిరేకులైన వారికి పదవులు, పదోన్నతులా? ఓదార్పు అంత ఘోరమైన తప్పిదమా? కడప, పులివెందుల ఉపఎన్నికల్లోనూ, నెల్లూరు పార్లమెంటు ఉపఎన్నికలోనూ, ఈలోగా జరిగిన 18 శాసనసభ ఉపఎన్నికల్లోనూ చావుదెబ్బ తిన్నా జ్ఞానోదయం కలగదా? ప్రజల తీర్పుకంటే ఉన్నతమైన ప్రజాస్వామ్యం ఏముంది? పదవులకోసం తన చుట్టూ చేరిన భజనపరుల స్తోత్రపాఠాలతో తన్మయత్వం చెందిన సోనియాగాంధికి ఉపఎన్నికల ఓటములు చలనం కలిగించలేదు కాబోలు!

ప్రజాస్వామ్య న్యాయసూత్రాలను గాలికి వదిలి జగన్‌ను ఆరు మాసాలకు పైగా జైల్లో బంధిస్తే, ఈ కక్షసాధింపును ప్రజలు ఎంతగా అసహ్యించుకుంటున్నారో సోనియాకు, చంద్రబాబుకు అర్థం కాలేదు. దీనికి నిరసనగానే ప్రజలు ఉపఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలను ఓడించారన్న సత్యాన్ని వారు గుర్తించినట్టు లేదు. దేశంలో ఎవరికీ రాని ఐదున్నర లక్షల మెజారిటీతో పార్లమెంటుకు గెలిచిన జగన్‌ను బంధిస్తే ప్రజాస్పందన మరోరకంగా ఉంటుందని ఈ పార్టీలు ఎలా భావిస్తాయి! జగన్ కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే, మరో పార్టీ పెట్టకుండా ఉంటే జైలుపాలయ్యేవాడు కాదనీ, మంత్రిగానో, ముఖ్యమంత్రిగానో అయ్యేవాడని సాక్షాత్తు గులాంనబీ ఆజాద్ అనడంతో నిజం బయటపడింది. తన ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి సీబీఐని సోనియా ఆయుధంగా వాడుకుంటోంది.

దర్యాప్తు పూర్తికాలేదన్న నెపంతో జగన్ బెయిల్‌కు సీబీఐ అడ్డుపడుతూ ఉంటే, రాజ్యాంగం పవిత్రంగా భావించే వ్యక్తిస్వేచ్ఛను కాపాడవలసిన న్యాయస్థానాలు సీబీఐ వాదనలకు చెవి ఒగ్గడం ఎలా సమర్థనీయం? జగన్‌ను జైల్లో బంధించి, ఎన్నికల్లో నెగ్గాలనుకోవడం నిరర్ధకపు ఆలోచన అని ఉపఎన్నికల ఫలితాలు నిరూపించాయి. జగన్‌ను దోషిని చేయడానికి మంత్రులు, అధికారులు, పారిశ్రామికవేత్తలను జైలుపాలు చేయడం రాజకీయ ఉన్మాదం తప్ప మరేమీ కాదు. ఈ వికృతచేష్టలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. త్వరలోనే జగన్ కేసులన్నింటినీ ఛేదించుకుని, కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం, మరలా రాజన్న స్వర్ణయుగాన్ని మనమందరం త్వరలోనే చూడడం ఖాయం. దీన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.
- యలమంచిలి త్రియంబకరావు
కోకాభాస్కరమ్మ నగర్, రాజమండ్రి


 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి,
రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: