సుప్రీంకోర్టులో నివేదిక సాక్షిగా సీబీఐ అవాస్తవాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుప్రీంకోర్టులో నివేదిక సాక్షిగా సీబీఐ అవాస్తవాలు

సుప్రీంకోర్టులో నివేదిక సాక్షిగా సీబీఐ అవాస్తవాలు

Written By news on Sunday, January 20, 2013 | 1/20/2013

సుప్రీంకోర్టులో నివేదిక సాక్షిగా సీబీఐ అవాస్తవాలు
విదేశీ లింకులపై లెటర్ రొగేటరీలు పంపామని వ్యాఖ్యలు
దర్యాప్తు సాగతీతకు సీబీఐ ప్రయోగించే తొలి ఆయుధమదే
బోఫోర్స్‌పై లెటర్ రొగేటరీలకు 15 ఏళ్లయినా రాని జవాబులు
సండూర్ పవర్‌లో ఇన్వెస్ట్ చేసిన 2ఐ క్యాపిటల్‌పై అనుమానాలు
నల్లధనాన్ని తరలించడానికే దాన్ని ఉపయోగించారని సందేహాలు
ఐడియా, ఇండియా ఇన్ఫో వంటి సంస్థల్లోనూ దాని పెట్టుబడులు
జగన్ సంస్థల్లో పెట్టుబడుల్ని మాత్రమే అనుమానిస్తున్న దర్యాప్తు సంస్థ
2ఐలో విజయసాయిరెడ్డి డెరైక్టరంటూ పొంతనలేని అవాస్తవాలు
ఆయా సంస్థలకు విక్రయించిన షేర్లను స్వల్పలాభంతో తిరిగి కొన్న జగన్
అవేవీ పట్టించుకోకుండా విదేశీ వివరాలు రావాలంటూ సీబీఐ గడువులు
భారతి సిమెంట్‌లో జగన్ డెరైక్టర్‌గా చేరిన తేదీని వదిలేసి లీజుతో లింకులు
నిమ్మగడ్డ ప్రసాద్ ఇన్వెస్ట్‌మెంట్లపై సైతం రెండు మాటలు
బ్యాంకు నుంచి భారతి సిమెంట్ రుణం తీసుకోవటం కూడా తప్పేనట!
ఆ రుణాన్ని తిరిగి తీర్చేసినా సరే... దర్యాప్తు చేయాల్సి ఉందంటూ వ్యాఖ్యలు
ఆఖరికి భారతిలో వికా సంస్థ వాటా కొనుగోలుపై కూడా సందేహాలే!!!
ఇండియాలో భారతితో పాటు ఇతర సంస్థల్లోనూ వికా పెట్టుబడులు
150 ఏళ్ల చరిత్రతో ఏడు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న వికా
కేవలం భారతిలో పెట్టుబడి పెట్టినందుకు దాన్నీ టార్గెట్ చేసిన వైనం
ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపులపైనా అంకెల గారడీయే
చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాల్ని కొనసాగించినా తప్పేనట!
ఆ నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబుది ఏమాత్రం తప్పు లేదట!
టార్గెట్ జగన్‌గా దర్యాప్తు క్రతువును కొనసా....గిస్తున్న దర్యాప్తు సంస్థ

హైదరాబాద్‌కు అటు బెంగళూరు ఎంత దూరమో... ఇటు వైజాగ్ కూడా అంతే దూరం. అంత మాత్రాన రెండూ ఒకటేనా? రెండుచోట్లా ఒకేలా ఉంటుందా? రెండింటితోనూ హైదరాబాద్‌కు ఒకేరకమైన సంబంధాలున్నట్టా? ఈ పోలిక వింటే ఏ కొంచెం ఆలోచన ఉన్నవారైనా నవ్విపోతారు!! ఇలాంటి పోలిక తెచ్చిన వారిని అదోలా చూస్తారు! మరి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులపై దర్యాప్తు చేస్తున్న సీబీఐని మనమెలా చూడాలి? ఇంతకన్నా దారుణమైన పోలికలు తెస్తున్నందుకు ఈ దర్యాప్తు సంస్థనేమనాలి? విజయసాయిరెడ్డి ఒక బ్యాంకులో డెరైక్టరుగా ఉన్నారు కాబట్టి... ఆ బ్యాంకు నుంచి జగన్‌మోహన్‌రెడ్డి సంస్థలు రుణం తీసుకుంటే నేరం చేసినట్టేనా? ఆ రుణాన్ని తిరిగి తీర్చేసినా దాన్నో కుట్రగా చిత్రిస్తుండటాన్ని ఏమనాలి? అసలు బ్యాంకులున్నది రుణాలివ్వటానికి కాకపోతే ఇంకెందుకు?

చంద్రబాబు సీఎంగా ఉండగా ఇచ్చిన లీజును... వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో పొడిగిస్తే అదీ తప్పేనా? ఒక ప్రభుత్వం ఒక హోటల్ నిర్మాణానికి అనుమతిస్తే అది నేరం చేసినట్టేనా? మరి ఇంతకుముందు ఈ రాష్ట్రంలో ఎన్ని హోటళ్లు రాలేదు!! ఎన్ని పరిశ్రమలకు గనుల్ని లీజుకివ్వలేదు!! ఇవన్నీ సీబీఐకి గానీ... దాని వెనకున్న శక్తులకు గానీ నేరాలుగా ఎందుకు కనిపించలేదు? వైఎస్ హయాంలో జరిగిన ప్రతి పనీ నేరంగానే ఎందుకు కనిపిస్తోంది? ఆయన మరణించారనా? ఆయన తనయుడు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు కనకనా? దానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టా? మూడు నెలల్లో దర్యాప్తు ముగిస్తామంటూ నాలుగు నెలల కిందట సుప్రీం కోర్టుకు సీబీఐ ఇచ్చిన స్టేటస్ రిపోర్టును చూస్తే ఇలాంటి సందేహాలే వస్తాయి. ఆ సందేహాలను తీరుస్తూ... ఏది నిజమో చెప్పే కథనం ఇదిగో...

విదేశీ లింకులంటూ వింత వ్యాఖ్యలు
దర్యాప్తునకు మరో మూడు నెలలు పట్టొచ్చన్న సీబీఐ... అందుకు చెప్పిన ప్రధాన కారణం ఒక్కటే. కొన్ని సంస్థల ప్రమేయంపై వివరాల కోసం విదేశాలకు లెటర్ రొగేటరీలు పంపామని, వాటికి జవాబులు రావాల్సి ఉందని!! అసలు ఏ దర్యాప్తునైనా సాగదీయాలనుకుంటే సీబీఐ ప్రయోగించే మొట్టమొదటి ఆయుధం ఈ లెటర్ రొగేటరీలేనని తెలియనిదెవరికి? బోఫోర్స్ కుంభకోణంలో స్విట్జర్లాండ్ నుంచి కొన్ని పత్రాల కోసం పంపిన లెటర్ రొగేటరీలకు జవాబు రావటానికి నాలుగేళ్లు పట్టడం నిజంకాదా? ఇదే కేసులో మలేసియా, ఎమిరేట్స్‌లకు 1997లో పంపిన లెటర్ రొగేటరీలకు దర్యాప్తు మూసేసినా ఇప్పటికీ జవాబు రాని సంగతి అబద్ధమా? అసలు వై.ఎస్.జగన్ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి సర్వం స్పష్టంగా కనిపిస్తుండగా విదేశాలకు లెటర్ రొగేటరీలు పంపాల్సిన అవసరం ఏమొచ్చింది?

నల్లధనాన్ని మళ్లించారట..?!
వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి కుట్రపన్ని... తమ సొమ్మునే విదేశాలకు పంపి, దాన్ని మళ్లీ విదేశీ కంపెనీల ద్వారా తమ సంస్థల్లోకి పెట్టుబడులుగా తెచ్చుకున్నారన్నది సీబీఐ ప్రధానారోపణ. ఇది తేల్చటానికే హాంకాంగ్, మారిషస్, యూకే, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, లక్సెంబర్గ్, సింగపూర్‌లకు లెటర్ రొగేటరీలు పంపామని, వాటికి సమాధానం రావాల్సి ఉందని తన నివేదికలో పేర్కొంది. మరి దీన్లో నిజానిజాలేంటి?

ఇదీ వాస్తవం...
సీబీఐ చెప్పిన విదేశీ నిధులంటే అర్థం సండూర్ పవర్‌లోకి విదేశీ వెంచర్ కేపిటలిస్టు సంస్థలైన 2ఐ క్యాపిటల్, ప్లూరీ ఎమర్జింగ్ నుంచి పెట్టుబడిగా వచ్చిన 124 కోట్లు. ఇవి రెండూ మారిషస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలు.

సండూర్‌పవర్‌ను 2001-02లోనే టేకోవర్ చేసిన జగన్‌మోహన్‌రెడ్డి... 2004 కల్లా దానికి సంబంధించిన పనులన్నీ పూర్తిచేశారు. ఉత్పత్తి మొదలయ్యాక చిన్నచిన్న అవాంతరాలు రావటంతో మరిన్ని నిధులకోసం యూటీఐ సెక్యూరిటీస్‌ను సంప్రదించారు. బహుశా! యూటీఐ రుణం ఇచ్చి ఉంటే ఈ విదేశీ కంపెనీల ప్రస్తావనే ఉండేది కాదేమో!! తాము చిన్న సంస్థలకు రుణాలివ్వలేమని చెప్పిన యూటీఐ... 2ఐ, ప్లూరీలను రిఫర్ చేసింది. దీంతో వాల్యుయేషన్ సంస్థ ఎస్‌ఎస్‌కేతో విలువకట్టించి... ఆ మేరకు 2ఐని సంప్రదించారు. అది కూడా నికిత్ దేశాయ్‌తో డ్యూ డిలిజెన్స్ (నిజ నిర్ధారణ) చేయించుకుని... సంతృప్తి చెందాకే సండూర్ పవర్‌లో పెట్టుబడులకు సరేనంది. ప్లూరీ కూడా 19 కోట్ల పెట్టుబడికి ముందుకు రాగా... రెండు సంస్థలూ కలిసి రూ.120 కోట్లకు మూడో వంతు వాటాను కొనుగోలు చేశాయి.

ఇదీ జరిగింది. పెపైచ్చు 2ఐ, ప్లూరీ సంస్థలు ఎవరేం చెప్పినా చేసే గాలివాటం కంపెనీలేమీ కాదు. దేశంలో ఐడియా సెల్యులార్, పిపావవ్ షిప్‌యార్డ్, ఇండియా ఇన్ఫోలైన్, టి.సుబ్బిరామిరెడ్డికి చెందిన గాయత్రీ ప్రాజెక్ట్స్ వంటి సంస్థల్లో కూడా ఇవి పెట్టుబడులు పెట్టాయి. మరి టాటా, బిర్లాలకు చెందిన ఐడియాలోనో, టి.సుబ్బిరామిరెడ్డి కంపెనీల్లోనో పెట్టిన పెట్టుబడులపై అనుమానం వ్యక్తం చేయని సీబీఐ... కేవలం జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టిన పెట్టుబడులనే సందేహించటాన్ని ఏమనుకోవాలి? అది జగన్ టార్గెట్‌గా పనిచేస్తోందని చెప్పటానికి ఇంకా ఏం కావాలి?

ఆ షేర్లను తిరిగి కొన్న జగన్..
ఇక్కడ గమనించాల్సిందొకటుంది. విదేశీ సంస్థలు దేన్లో పెట్టుబడి పెట్టినా మూడేళ్లు, లేదా ఐదేళ్లు చొప్పున పరిమిత కాలానికే ఇన్వెస్ట్ చేస్తాయి తప్ప చిరకాలం ఉండవు. లాభం వచ్చే పక్షంలో ఆ వాటాను వేరొకరికి విక్రయిస్తాయి. ఇబ్బందులొచ్చిన పక్షంలో అవకాశముంటే తిరిగి ప్రమోటర్‌కే విక్రయిస్తాయి. 2010లో జగన్‌మోహన్ రెడ్డి కాంగ్రెస్‌ను వదిలిపెట్టాక ఆయనపై దాడులు తీవ్రమయ్యాయి. ఆయన సంస్థలపై ఐటీతో పాటు అన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలూ కత్తిగట్టాయి. అలాంటి సందర్భాల్లో ఆ షేర్లను వేరొకరు కొనే అవకాశం తక్కువ. అందుకే జగన్‌మోహన్‌రెడ్డి వాటి ఇన్వెస్ట్‌మెంట్‌పై 10 శాతం ఎక్కువ చెల్లించి తనే ఆ వాటాను తిరిగి కొన్నారు. దీంతో 10 శాతం లాభంతో అవి ఎగ్జిట్ అయ్యాయి.

సీబీఐ ఏమంటోందంటే...
ఈ 2ఐ, ప్లూరీ సంస్థలకు లగ్జెంబర్గ్‌లోని ఏసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సికార్ అనే సంస్థ నుంచి నిధులు అందాయని, ఆ సంస్థ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిదేనని సీబీఐ అంటోంది. ఒకవేళ సీబీఐ వాదనే నిజమనుకుంటే...
తన సొమ్మునే ఆయా కంపెనీల ద్వారా తన సంస్థలోకి తిరిగి తెచ్చుకుని ఉంటే కనక ఆ వాటాను జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి కొనాల్సిన అవసరమేముంటుంది?
రూ.71కి విక్రయించిన షేరును రూ.10 చొప్పునైనా తిరిగి సొంతం చేసుకోవచ్చుగా? లేదా ఆ సొమ్ము తిరిగి తనకే వస్తుందనే ధీమా ఉంటే ఏ రూ.200 కో, 300కో కొనొచ్చుగా? కేవలం 10 శాతం లాభం చెల్లించి ఎందుకు కొన్నారు?
అది తన సొమ్మే అయితే పెట్టుబడి కోసం వాల్యుయేషన్ చేయించటమెందుకు? అది ఆయన సొమ్మే అయితే 2ఐ ఎందుకు నిజ నిర్ధారణ చేయించుకుంటుంది?
ఇవన్నీ ఏ కొంచెం ఇంగితజ్ఞానంతో ఆలోచించేవారికైనా ఇట్టే అర్థయ్యే విషయాలు. సీబీఐకి అర్థం కావటం లేదంటే దాని దురుద్దేశాలు బయటపడటం లేదా?

సాయిరెడ్డి డెరైక్టరంటూ అవాస్తవాలు...
సండూర్ పవర్‌లో 2ఐ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన సమయంలో విజయసాయిరెడ్డి ఆ మారిషస్ కంపెనీకి డెరైక్టరుగా ఉన్నారని కూడా నివేదిక సాక్షిగా సీబీఐ పేర్కొంది. సీబీఐ లాంటి సంస్థకు తెలియక ఇలాంటి అవాస్తవాలు చెప్పిందో... లేక కావాలనే చేతికొచ్చినట్టు రాసేసిందో విషయం చూసి మనం అర్థం చేసుకోవాల్సిందే.

జరిగిందిదీ...
విజయసాయిరెడ్డి మొదట్నుంచీ సండూర్ పవర్‌కు ఆడిటర్‌గా, ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. నిధుల కోసం 2ఐ క్యాపిటల్‌ను సంప్రదించాక అది కొన్ని షరతులు పెట్టింది. అంతర్జాతీయ స్థాయి సంస్థనే ఆడిటర్‌గా పెట్టుకోవాలన్నది దాన్లో ఒకటి. దీంతో ఆడిటర్‌గా విజయ సాయిరెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ సాయిరెడ్డితో అప్పటికే సంప్రతింపులు జరిపి ఉన్న 2ఐ సంస్థ... సండూర్‌లో 32.7 శాతం వాటా తమకుంది కనక తమ తరఫున సండూర్‌లో నామినీ డెరైక్టర్‌గా ఉండాలని సాయిరెడ్డిని కోరింది. ఆయన సరేనన్నారు. మరి సండూర్‌లో 2ఐ తరఫున నామినీ డెరైక్టర్‌గా ఉండటానికి... నేరుగా 2ఐ సంస్థలోనే డెరైక్టర్‌గా ఉండటానికి తేడా లేదా? కోర్టుకు సమర్పించిన నివేదిక ‘సాక్షి’గా ఇలాంటి అవాస్తవాలు పేర్కొన్న సీబీఐని ఏమనాలి?

నల్లధనాన్ని తరలించినట్టేనా?
ఇక్కడ సీబీఐ పేర్కొన్న ఆరోపణ ఎంత అసంబద్ధమైనదో ప్రస్తావించాలి. దేశంలోని నల్లధనాన్ని విదేశాలకు తరలించి... విదేశీ కంపెనీల ద్వారా తిరిగి దేశంలోకి తెచ్చారంటోంది సీబీఐ. 2ఐ నుంచి వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్‌కు 10 శాతం ఎక్కువ చెల్లించి వాటాను తిరిగి కొనుగోలు చేసిన నేపథ్యంలో 2ఐ డబ్బులు వెనక్కెళ్లిపోయాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థయిన 2ఐ... సహజంగానే ఆ నిధుల్ని వేరే దేశంలోనో, మరో సంస్థలోనో పెట్టుబడిగా పెడుతుంది. సీబీఐ ఆరోపణ అసంబద్ధమైనదని చెప్పటానికి ఇంతకన్నా ఏం కావాలి?

బెయిలుపై అవాస్తవాలకు సాక్ష్యమిదీ...
జగతి పబ్లికేషన్స్‌లో అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్, కొందరు వ్యక్తులు, రాంకీ, నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడులకు సంబంధించి సీబీఐ ఇప్పటికే నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటన్నిటినీ సుప్రీంకోర్టుకిచ్చిన స్థాయీ నివేదికలో ప్రస్తావించిన సీబీఐ... అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్‌కు సంబంధించిన అంశాల్లో దర్యాప్తు పూర్తయిపోయినట్లు కూడా స్పష్టంగా పేర్కొంది. నిజానికి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఈ ఛార్జిషీట్లోనే అరెస్టు చేసినట్లు కోర్టు సాక్షిగా గతంలో సీబీఐ చెప్పింది. మరి దర్యాప్తు పూర్తయిపోయిందని లిఖితపూర్వకంగా కూడా చెప్పినపుడు... ఈ చార్జిషీట్లో బెయిలివ్వటానికి సీబీఐ ఎందుకు అభ్యంతరం చెబుతోందన్నది అర్థంకాని ప్రశ్న. అసలు మొదటి మూడు చార్జిషీట్లూ దాఖలు చేసేదాకా జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశ్నించటం గానీ, అరెస్టు చేయటం గానీ చేయకపోవటాన్ని ఏమనుకోవాలి? ఆ తరవాత మాత్రమే ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తారని సీబీఐకి గుర్తుకు రావటాన్ని ఏమనుకోవాలి? చార్జిషీట్లను ఇలా ముక్కలు చేయటాన్ని గానీ... దర్యాప్తును సాగతీయటాన్ని గానీ ఏమనుకోవాలన్నది దర్యాప్తు దర్శకులే చెప్పాలి?

నిమ్మగడ్డ నిధులపైనా అబద్ధాలే...
నాలుగవ చార్జిషీటును పూర్తిగా జగన్ సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడులకే అంకితం చేసిన సీబీఐ... వాన్‌పిక్ పేరిట ప్రభుత్వం 22,000 ఎకరాలను కేటాయించిందని, దాన్లో 12,900 ఎకరాలను సేకరించటం పూర్తయిందని... అందుకు ప్రతిగానే జగన్‌కు చెందిన సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ రూ.854 కోట్ల పెట్టుబడి పెట్టారని పేర్కొంది. నిజమే. ఆయన మొత్తం పెట్టుబడి దాదాపు రూ.854 కోట్లు. కానీ 2009లో భారతి సిమెంట్, సిలికాన్ బిల్డర్స్‌లో తన వాటాను విక్రయించటంతో ఆయన చేతికి రూ.617 కోట్లు వచ్చాయి. ఇక నికరంగా మిగిలింది రూ.237 కోట్లు. కానీ ఇప్పటికీ ఆయనకు జగతి పబ్లికేషన్స్‌లో 18 శాతం వాటా ఉంది. ‘ఈనాడు’ కన్నా అన్ని అంశాల్లో మెరుగ్గా ఉన్న సాక్షికి... ఈనాడులో సగం విలువ కట్టినా అది రూ.3,000 కోట్లుంటుంది. ప్రసాద్ వాటా విలువ రూ.540 కోట్లుంటుంది. ఆ లెక్కన ఆయన లాభపడినట్టా? నష్టపోయినట్టా? లాభం వచ్చిన... ఇంకా లాభాల్లోనే ఉన్న వాటాను క్విడ్ ప్రో కో అని సీబీఐ తప్ప ఇంకెవరైనా అంటారా? వాన్‌పిక్‌కు భూములు కేటాయించినందుకే నిమ్మగడ్డ ఈ నిధులన్నీ పెట్టుబడిగా పెట్టారని చెప్పిన సీబీఐ... ఇందు ప్రాజెక్ట్స్‌కు లేపాక్షి నాలెడ్జ్ సిటీని కేటాయించినందుకు ఇందు సంస్థ నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా రూ.70 కోట్లను జగన్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిందని కూడా ఇదే నివేదికలో పేర్కొంది. మరి దీన్నేమనాలి? సీబీఐ వాదనను ఎలా అర్థం చేసుకోవాలి?

నీటి కేటాయింపులపైనా అదే తీరు...
ఇండియా సిమెంట్స్ సంస్థ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో రూ.140 కోట్ల పెట్టుబడి పెట్టిందని, ఇదంతా ప్రభుత్వం నుంచి నీటి కేటాయింపుల రూపంలో, మైనింగ్ లీజుల రూపంలో లబ్ధి పొందినందుకేనని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. అసలు అంతకు ముందు ప్రభుత్వాలు ఇచ్చినదంతా ఒప్పని, దాన్ని కొనసాగించటమే వైఎస్ చేసిన తప్పని... అందు ఈ సంస్థలు పెట్టుబడి పెట్టాయని సీబీఐ చేస్తున్న వాదన ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో చూస్తే మీకే తెలుస్తుంది.

ఇండియా సిమెంట్స్‌కు 1996లో చంద్రబాబు ప్రభుత్వం 0.013 టీఎంసీల నీటిని కేటాయించింది. ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం పెరిగినందున అదనపు నీటి కేటాయింపు కావాలని ఆ సంస్థ అభ్యర్థించటంతో 2009లో వైఎస్ ప్రభుత్వం మరో 0.013 టీఎంసీ నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. కానీ ఇది సీబీఐకి నేరంగా కనిపిస్తోంది. పెపైచ్చు విజయసాయిరెడ్డికి బెయిలు మంజూరు చేసే సమయంలో కూడా ఇదే అంశాన్ని సీబీఐ చాలా గట్టిగా వాదించింది. 0.013 టీఎంసీలను 13 టీఎంసీలు చేసేసి మరీ వాదనలు వినిపించింది. తాజా నివేదికలో కూడా... చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 0.013 టీఎంసీలకు అనుమతిస్తే... వైఎస్ ప్రభుత్వం 13 ఎంసీఎఫ్‌టీల నీటికి అనుమతిచ్చిందని పేర్కొంది. నిజానికి 13 ఎంసీఎఫ్‌టీలంటే (మిలియన్ క్యూబిక్ ఫీట్) 0.013 టీఎంసీలని (ట్రిలియన్ క్యూబిక్ ఫీట్) అర్థం. దాన్నెక్కడా వివరించకుండా కావాలని సీబీఐ చేస్తున్న ఈ అంకెలగారడీ కాస్త ఆలోచించే వారెవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది.

పెపైచ్చు ఇదే ఇండియా సిమెంట్స్‌కు చంద్రబాబునాయుడి హయాంలో రంగారెడ్డి జిల్లా తాండూరులో 325 ఎకరాల సున్నపురాయి గనుల్ని లీజుకిచ్చారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన 828 ఎకరాల లీజుల్ని ఇండియా సిమెంట్స్ పేరిట బదలాయించిందీ బాబే. ఇవన్నీ కాక టార్గెట్ -2000 పథకం కింద ఇండియా సిమెంట్స్‌కు వందల కోట్ల అమ్మకం పన్ను డిఫర్‌మెంట్ కూడా ఇచ్చారు బాబు. ఇవేవీ నేరాలుగా కనిపించని సీబీఐకి... వైఎస్ హయాంలో తీసుకున్న ప్రతి నిర్ణయమూ నేరంగా కనిపిస్తుండటంలో విచిత్రమేమీ లేదేమో!!
Share this article :

0 comments: