పాలకులు ఎన్ని కుయుక్తులు పన్నినా... ప్రజలు జగన్ వైపే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాలకులు ఎన్ని కుయుక్తులు పన్నినా... ప్రజలు జగన్ వైపే

పాలకులు ఎన్ని కుయుక్తులు పన్నినా... ప్రజలు జగన్ వైపే

Written By news on Friday, January 18, 2013 | 1/18/2013

కాంగ్రెస్ పెద్దల చేతుల్లో సీబీఐ కీలుబొమ్మగా మారింది. కాంగ్రెస్ వాళ్లు ఏది చెప్తే సీబీఐ అది చేస్తుంది. అందుకే సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ముద్ర పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతున్న సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రతో రాష్ట్రంలో, దేశంలో రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2009లో అనుకోని సంఘటనలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతి చెందాడు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. భర్త చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న విజయమ్మ... తండ్రిని కోల్పోయిన తనయుడు దుఃఖ సాగరంలో ఉండగా కొందరు తమ నీచమైన రాజకీయాల కోసం ఆ కుటుంబంపై కక్ష కట్టారు. అండగా నిలవాల్సిన వారు వెన్నుపోటు పొడిచారు. ఆనాటి నుంచి నేటివరకు ఆ కుటుంబ సభ్యులను ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. 

వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది మహనేత కోసం ప్రాణాలు అర్పించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న జగన్ తన తండ్రి కోసం చనిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వెళ్తానని నల్లకాలువ సభలో వాగ్దానం చేశాడు. అప్పటి నుంచి ఢిల్లీ పెద్దలు జగన్‌పై కక్ష కట్టారు. ఓదార్చడం భారతీయ సంస్కృతి అని చెప్పినా కేంద్రం వినలేదు. ఓదార్పు తప్పు అన్నట్లు ఇంట్లో కూర్చోమన్నారు. ఇది జీర్ణించుకోలేని జగన్... పార్టీ నుంచి బయటకు వచ్చాడు. రాజన్న రాజ్యం కోసం పార్టీ పెట్టి, వివిధ పథకాలతో జెండాను ఆవిష్కరించారు. ఇది ఢిల్లీ నాయకులకు నచ్చలేదు. అంతలోనే 2011 ఉప ఎన్నికలు వచ్చాయి. జగన్‌ను ఓడించాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నించింది. కోట్లు ఖర్చుపెట్టింది.

మంత్రులందరినీ కడపలోనే కేంద్రీకరించింది. సొంత చిన్నాన్నతో ఆరోపణలు చేయించింది. ఆఖరుకు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌ను ఓడించాలనుకున్నా ప్రజలు మాత్రం వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. అఖండ మెజార్టీతో గెలిపించారు. ఇక జగన్ బయట ఉంటే రాష్ట్రంలో మనుగడ కష్టమని భావించిన సోనియా గాంధీ మే 27వ తేదీన జగన్‌ను అరెస్ట్ చేయించింది. ఎన్ని రోజులు.. ఎంత కాలం.. ఇలా జైలులో ఉంచుతారు? బెయిల్ కోసం పిటిషన్ వేస్తే చాలు సీబీఐతో చార్జిషీట్ వేయిస్తారు. ఎంతకాలం ఇలా చేస్తారు. జగన్‌కు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ అంతు లేకుండా పోవడం ఖాయం. చివరకు న్యాయమే గెలుస్తుంది. ధర్మమే ఆ కుటుంబాన్ని కాపాడుతుంది. రాజన్న రాజ్యం రావడం తథ్యం. 
- ఝాన్సీరజువా, ప్రసూననగర్, చింతల్, హైదరాబాద్

రైతు సోదరుడు... మా జగన్‌బాబు!

ఉదయించే సూర్యుని వెలుగును ఆపతరమా అని నేటి ప్రధాన ప్రతిపక్షం ఆలోచించుకోవాలి. పులి కడుపున పులే పుట్టినట్లుగా, మా రైతు రాజన్న కడుపున రైతుబిడ్డ జగన్ పుట్టాడు. జగన్ కేసులో ఎన్ని అవరోధాలు సృష్టించినా, అవహేళనలు చేసినా, త్వరలో జరగనున్న సహకార ఎన్నికల్లో, రైతు రాజ్యం కోసం, జగనన్న నాయకత్వం కోసం త్యాగాలు చేసేందుకు రైతన్న కంకణం కట్టుకున్నాడు. రైతులకు జగనన్నపై ఉన్న విశ్వసనీయత, ఆదరణ ఈ ఎన్నికల్లో తన సత్తా చాటబోతున్నది. ఇంకా ఎన్నాళ్లు జగన్‌ను జైల్లో ఉంచుతారు? నిజంగా చట్టాలకు లోబడే జగన్‌ను జైల్లో ఉంచుతున్నారా లేదా పాలకుల ప్రలోభాలకు తలొగ్గి ఉంచుతున్నారా అనేది రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి, పల్లెలు, పట్టణాల్లోని ప్రజానీకానికి బాగా తెలుసు. 

ఈ రోజున జగన్‌ను వేధించడానికి అధికార, ప్రతిపక్షాల చేసుకుంటున్న మ్యాచ్ ఫిక్సింగ్‌లను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. ఈ అసమర్థ పాలక ప్రతిపక్షాన్ని బంగాళాఖాతంలో కలుపుతారు. జగన్‌ని జైల్లో ఉంచినందువల్ల కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తున్నదో ఢిల్లీ పెద్దలకే తెలియాలి. వైఎస్సార్ కుటుంబాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికీ ముందుంది మంచి కాలం. సమయం ఏదైనా, సహనంతో ఉన్న ప్రతి పౌరుడు రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న నాయకత్వంలో సువర్ణావకాశాన్ని చూడగలుగుతాడు. సుపరిపాలనా ఫలాలను అందుకోగలుగుతాడు.

- ఎన్. సాంబశివరెడ్డి,
అకినేపల్లి మల్లారం, మంగపేట, వరంగల్


చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: