బాబేమైనా న్యాయకోవిదుడా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబేమైనా న్యాయకోవిదుడా?

బాబేమైనా న్యాయకోవిదుడా?

Written By news on Monday, January 28, 2013 | 1/28/2013

 చంద్రబాబేమైనా న్యాయ కోవిదుడా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ప్రశ్నించారు. వస్తున్నా మీకోసం యాత్రలో జగన్‌పై బాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆదివారమిక్కడ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కోర్టులు జగన్ అవినీతిపరుడంటూ ఒక నిర్ణయానికి వచ్చాయన్న సంగతి బాబుకెలా తెలుసో ప్రజలకు బహిరంగంగా వివరించాలన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై చంద్రబాబు హైకోర్టు, సుప్రీంకోర్టులనాశ్రయించి స్టేలు ఎందుకు తెచ్చుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం నాలుగు పదుల వయసున్న జగన్‌మోహన్‌రెడ్డి తనను సీబీఐ అరెస్టు చేస్తుందని తెలిసినా.. ముందస్తుగా కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోలేదన్న నిజం ప్రజలకు తెలుసన్నారు. సీబీఐ వద్ద ఆధారాలు లేకే ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయలేకపోతోందని చెప్పారు. జగన్‌కు బెయిల్ ఇస్తారేమోన న్న అనుమానంతో బాబు టీడీపీ ఎంపీలను ఢిల్లీకి పంపి, కేంద్ర మంత్రి చిదంబరానికి విజ్ఞాపణ పత్రాలు అందజేయడం చీకటి ఒప్పందంలో భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. 
Share this article :

0 comments: