ఇది కాలపరీక్ష మాత్రమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది కాలపరీక్ష మాత్రమే

ఇది కాలపరీక్ష మాత్రమే

Written By news on Friday, January 11, 2013 | 1/11/2013


భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో డెబ్భై భారీ, చిన్న ప్రాజెక్టులను ఏకకాలంలో ప్రారంభించిన ధీశాలి వై.ఎస్. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు పరచిన ఏకైక ముఖ్యమంత్రి కూడా ఆయనే. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు, ఢిల్లీలో చక్రం తిప్పిన వారు ఇప్పుడు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఎల్లో మీడియా సాయంతో వై.ఎస్.పైన, ఆయన కుమారుడు జగన్‌పై బురద జల్లుతున్నారు. కానీయండి. నిజాన్ని దాచడం, సూర్యుణ్ణి ఆపటం ఎవరితరమూ కాదు. కాలపరీక్షలో జగన్ గెలుస్తాడు. సీబీఐ ఓడుతుంది. రాముడు వనవాసం చేసినా, పాండవులు అరణ్యవాసం చేసినా, జీసస్ శిలువ మోసినా, హరిశ్చంద్రుడు కాటి కాపరైనా, నలమహారాజు కురూపి అయినా, జగన్ జైలుకు వెళ్లినా అంతా కాలపరీక్షలో భాగమే. త్వరలోనే వై.ఎస్. జగన్ పాలన ఒక స్వర్ణయుగంగా ప్రారంభం కావడమన్నది తథ్యం.

- కరపాటి రాజేంద్ర కుమార్, నూజివీడు, కృష్ణాజిల్లా


తొందరలోనే తీపి కబురు అందుతుంది

నిద్రపోతున్న వాడిని లేపవచ్చు కానీ నిద్ర నటిస్తున్న వారిని ఎవరు లేపగలరు? అలాగే జగన్ అరెస్ట్ సక్రమమైతే తొంభై రోజులలో బెయిల్ వచ్చేది కానీ, అది అక్రమ అరెస్ట్ కనుకే బెయిల్ కోసం ఇంకా వేచిచూడాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో జగన్ బయటకు వస్తే ఆంధ్ర రాజకీయాల్లో సునామీ రావడం ఖాయం. అందుకే ఢిల్లీ పెద్దలు, వాళ్ల కనుసన్నల్లో నడిచే సీబీఐ జగన్ బయటకు రాకుండా అడ్డుపడుతున్నారు. కొత్త సినిమా ‘వస్తున్నా మీ ముందుకు’లో చంద్రబాబుది అంతా నటనే అని ఇప్పటికే ఆంధ్రలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది చంద్రబాబు యాత్ర. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేని ఎల్లో మీడియా అల్లిన కట్టు కథలు జగన్‌కు ఆదరణను చాలా పెంచాయి. ఎందుకంటే అవి ఎప్పుడూ ఏకపక్షంగానే కథలు అల్లి పత్రికా విలువలనే దిగజార్చాయి. ఇక ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా? జగన్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా? అని ఎదురుచూసే ఆంధ్రప్రజలకు తొందరలోనే తీపి కబురు అందుతుంది.

- సువ్వాడ దుర్గాప్రసాద్, కాలంరాజుపేట, విజయనగరం

ఎన్ని ‘చేతులు’ అడ్డుపడినా...అరుణోదయం అయ్యే తీరుతుంది

చావుదప్పి కన్ను లొట్టబోయి ఉన్న స్థితిలో కాంగ్రెస్‌కు జవజీవాలు తీసుకొచ్చింది వైయస్ రాజశేఖరరెడ్డి అనడంలో సందేహం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు సుఖసంతోషాలతో హాయిగా ఉన్నారు. కరెంటు కోతల్లేవు. ఆంధ్ర తెలంగాణ గొడవలు అస్సల్లేవు. ఆ పెద్దాయన వృద్ధులకు కొడుకయ్యాడు. వికలాంగులకు ఊతమయ్యాడు. రోగులకు వైద్యుడయ్యాడు. అలాంటి మహానుభావుడి తనయుడు జగన్‌ను జైల్లో పెట్టడం అన్యాయం, అక్రమం. అయినా ‘పులి’ బోనులో ఉన్నా పులే, బయటికి వచ్చినా పులే. దాని విలువ తగ్గదు. జగన్‌కి వచ్చిన పాపులారిటీ చూసి ఓర్వలేని కొన్ని రాజకీయ పార్టీలు చేసిన రాక్షసపు కుట్ర ఫలితమే జగన్ నిర్భంధం అని స్పష్టంగా తెలుస్తోంది.

జగన్‌ను జైల్లో పెట్టడం ఆయన మంచికే అని ఈ రాజకీయ విలన్లకు తెలియదు. అయినా పళ్లున్న చెట్టుకే రాళ్లు పడతాయ్. మోడువారిన చెట్టును ఎవరు పట్టించుకుంటారు? నిద్రాహారాలు లేకుండా బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ పర్యటించినప్పుడు జనంలో జగన్‌కున్న బలాన్ని కళ్లారా చూసిన కొన్ని రాజకీయ పార్టీలు ఆయనపై కుట్ర పన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. వైయస్సార్ చనిపోయిన వెంటనే ఎన్ని గుండెలు ఆగిపోయాయి! అసలు ఇంత కుముందు ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడయినా ఇంత ప్రజాభిమానం సంపాదించుకున్నాడా? అలాంటి కుటుంబం జగన్‌ది. జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఎన్ని అరచేతుల్ని అడ్డుపెట్టినా సూర్యకిరణాల్ని ఆపలేరు.

- సిహెచ్. వి.వి.ఎస్ మూర్తి, పాల్వంచ, ఖమ్మం జిల్లా
Share this article :

0 comments: