'ఓటర్ల నమోదులో అధికార దుర్వినియోగం' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ఓటర్ల నమోదులో అధికార దుర్వినియోగం'

'ఓటర్ల నమోదులో అధికార దుర్వినియోగం'

Written By news on Tuesday, January 22, 2013 | 1/22/2013

 సహకార ఎన్నికల ఓటర్ల నమోదులో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేతలు మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. కనీవినీ ఎరుగని స్థాయిలో అక్రమాలకు పాల్పడిందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వారు విలేకరులతో మాట్లాడారు. చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా ఓటర్ల జాబితాలో రిగ్గింగ్ జరిగిందన్నారు. సహకార ఎన్నికలను బోగస్ ఎన్నికలుగా ప్రభుత్వం మార్చిందన్నారు. గవర్నర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని వైఎస్ఆర్ సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. బోగస్ ఓటర్ల నమోదు వల్ల ఈ ఎన్నికలు రైతులకు సంబంధించినవి కావని వైఎస్ఆర్ సీపీ అభిప్రాయపడుతోందన్నారు. సర్పంచ్ లకంటే అధ్వాన్నంగా కాంగ్రెస్ నాయకత్వం ఉందని విమర్శించారు.

వైఎస్ జగన్ విషయంలో సీబీఐ కొత్త డ్రామాకు తెరలేపిందని వారు విమర్శించారు. వీలైనన్ని ఎక్కువ రోజులు జగన్ ను జైల్లో ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం, సీబీఐ కలిసి పనిచేస్తున్నాయని వారు ఆరోపించారు.
Share this article :

0 comments: