విద్యుత్ సబ్ స్టేషన్లు ముట్టడించిన వైఎస్ఆర్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్ సబ్ స్టేషన్లు ముట్టడించిన వైఎస్ఆర్

విద్యుత్ సబ్ స్టేషన్లు ముట్టడించిన వైఎస్ఆర్

Written By news on Wednesday, January 9, 2013 | 1/09/2013

విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనకు, విద్యుత్ కోతలకు నిరసన తెలుపుతూ, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడించారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ ఉచిత విద్యుత్ హామీ అమలుపై షరతులను రైతులు భరించలేరని తెలిపారు. డిస్కంలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతులపై విద్యుత్ భారం వేస్తున్నాయని విమర్శించారు. అధికారులు వ్యవసాయ బిల్లులను ఇంటి విద్యుత్ బిల్లులుగా చూపుతున్నారన్నారు. అధికారుల మోసంపై ఈఆర్‌సీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలను పెంచొద్దంటూ మంత్రులు, పార్టీ నేతలు మాట్లాడటంలో తప్పేమీ లేదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాల నిరసనలు కూడా సమర్ధనీయమేన్నారు. 

రంగారెడ్డి జిల్లా శంకరంపల్లిలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ముట్టడించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మహేశ్వరంలో కార్పొరేటర్ దీపాసురేఖ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ఎదుట వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. నల్గొండ జిల్లా కోదాడలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ముట్టడించారు. సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేపట్టిన వైఎస్‌ఆర్ సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తుంగతుర్తి సబ్‌స్టేషన్ ఎదుట విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైఎస్‌ఆర్ సీపీ ధర్నా నిర్వహించింది. భువనగిరిలో ట్రాన్స్‌కో డీఈ కార్యాలయం ఎదుట వైఎస్‌ఆర్ సీపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. 

వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో వైఎస్‌ఆర్ సీపీ నేత జెన్నారెడ్డి, మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. నర్సంపేట సబ్‌స్టేషన్ ముందు వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నర్సంపేట మండలం లక్కేపల్లిలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి, రాస్తారోకో చేశారు. 

కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో ఆరుగురు ట్రాన్స్‌కో సిబ్బందిని నిర్బంధించి రైతుల రాస్తారోకో నిర్వహించారు. వేములవాడ సబ్‌స్టేషన్ ముందు వైఎస్‌ఆర్ సీపీ నేత ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సిరిసిల్లలో వైఎస్‌ఆర్ సీపీ నేత కె.కె.మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సెస్ కార్యాలయం ముట్టడించారు. మంథనిలో వైఎస్‌ఆర్ సీపీ నేత పుట్ట మధు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. హుస్నాబాద్‌లో వైఎస్‌ఆర్ సీపీ నేత సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేశారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపేట సబ్‌స్టేషన్‌ను వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు ముట్టడించారు. విద్యుత్ కోతలను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. 

తూర్పుగోదావరి జిల్లా తునిలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు ధర్నా చేశారు. రాస్తారోకో నిర్వహించారు. కృష్ణా జిల్లా మైలవరం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్‌బాబు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 
నెల్లూరు జిల్లా కావలిలో సబ్‌స్టేషన్ ఎదుట వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ ధర్నా చేశారు. గుంటూరు జిల్లా అచ్చంపేట సబ్‌స్టేషన్ ను వైఎస్ఆర్ సిపి నేతలు, కార్యకర్తలు ముట్టడించారు. విద్యుత్ కోతలకు వారు నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ముట్టడించారు. కొండపి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ధర్నా చేశారు. 

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. రాస్తారోకో నిర్వహించారు. అనంతపురం జిల్లా లేపాక్షిలో వైఎస్‌ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించారు. మడకశిరలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఏడీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ధర్మవరంలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రాస్తారోకో నిర్వహించారు.
Share this article :

0 comments: