ప్రజల కోరిక మేరకే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కాంగ్రెస్ లోకి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల కోరిక మేరకే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కాంగ్రెస్ లోకి

ప్రజల కోరిక మేరకే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కాంగ్రెస్ లోకి

Written By news on Thursday, January 17, 2013 | 1/17/2013


ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టి పాటి రవి కుమార్ తాను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతున్నానని ప్రకటించారు.ప్రజల అబీష్టం మేరకే తాను కాంగ్రెస్ నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి రావాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తాను ఈ ప్రకటన చేసినందుకే తన గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు.వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని ఆయన అన్నారు.కాగా తాను కొద్ది రోజులుగా అద్దంకి నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, ప్రజలతో సమావేశమైన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని రవి కుమార్ తెలిపారు.ఎమ్మెల్యేల నుద్దేశించి రెండు కోట్ల సంతకాల గురించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: