సహకార ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సహకార ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ

సహకార ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ

Written By news on Wednesday, January 30, 2013 | 1/30/2013

: సహకార ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు అక్రమాలకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. తాము గెలవలేమని భావించిన కొన్నిస్థానాల్లో సహకార ఎన్నికలను వాయిదా వేయించారు. వైఎస్సార్ జిల్లాలో మంగళవారం టంగుటూరు, మన్నూరు సహకార సంఘాల ఎన్నికలు నిలిపివేస్తూ రెండు జీఓలు విడుదలయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 21 సంఘాలకు ఎన్నికలను నిలిపివేశారు. మరో రెండు సంఘాల ఎన్నికలకు హైకోర్టు స్టే విధించగా బ్రాహ్మణపల్లె నోటిఫికేషన్ విడుదల కాలేదు. వైఎస్సార్ జిల్లాలోని 77 సహకార సంఘాలకుగాను 23 సంఘాల ఎన్నికలు నిలిచిపోగా, అధికారిక ఉత్తర్వుల ప్రకారం వైఎస్సార్ జిల్లాలో రెండు విడతలుగా 54 సంఘాలకే ఎన్నికలు జరుగుతున్నాయి.

ముత్త్తుకూరులో నామినేషన్ వేసిన అభ్యర్థులకు ముగ్గురు సంతానం ఉండటంతో అనర్హులని వీఆరోవో నివేదించినా, ఆ నివేదిక ఎన్నికల అధికారికి అందకుండా తహశీల్దార్‌పై బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ ఒత్తిడి చేసి తమ వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సహకార ఎన్నికల నిర్వహణలో అధికారులు వింత వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఒక్కో పీఏసీఎస్ విషయంలో ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నారు. స్టే ఉందంటూ ఒక పీఏసీఎస్ ఎన్నికల ప్రక్రియను హఠాత్తుగా నిలిపివేసిన అధికారులు స్టే ఉత్తర్వులు ఉన్నా తమ చేతికి అందలేదని మరో పీఏసీఎస్ ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ అయోమయానికి గురిచేస్తున్నారు. ఈ జిల్లాలో పది ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నాలుగింటికి హైకోర్టు నుంచి స్టే వచ్చింది. మిగిలిన ఆరింటి ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. మరో 24 గంటల్లో మొదటి విడత పీఏసీఎస్‌లకు పోలింగ్ జరగనుండగా, ఇప్పటికి కూడా అనిశ్చితి కొనసాగుతుండడం గమనార్హం.

విశాఖలో కాంగ్రెస్ నేతల దౌర్జన్యం: విశాఖ జిల్లాలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పాయకరావుపేట మండలం శ్రీరాంపురం సొసైటీకి ఫిబ్రవరి 4న ఎన్నిక జరగనుంది. సొసైటీ అధ్యక్ష పదవికి 12వ వార్డు నుంచి పోటీ పడుతున్న రాజగోపాలపురానికి చెందిన కాంగ్రెస్‌మద్దతుదారు రావాడ గోవిందరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ముగ్గురు సంతానం ఉన్న గోవిందరెడ్డి ఎన్నికల నిబంధన ల ప్రకారం అనర్హుడంటూ వైఎస్సార్‌సీపీ నేత, ప్రస్తుత సొసైటీ అధ్యక్షుడు చిక్కాల రామారావు పాయకరావుపేటలో ఎన్నికల అధికారి వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిశీలిస్తానని హామీనిచ్చిన అధికారిపై జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోటనగేష్ మండిపడ్డారు. చిక్కాల సమర్పించిన నామినేషన్ పత్రాలను చించివేశారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో ఎనిమిది సహకార సంఘాల ఎన్నికలను వాయిదా వేయించిన కాంగ్రెస్ నేతలు మంగళవారం మరో 3 సొసైటీల ఎన్నికలను నిలిపి వేయించారు.

చేతకాక చేతులెత్తేశారు: శోభా నాగిరెడ్డి

సహకార సంఘాల ఎన్నికల్లో గెలవడం చేతకాని కాంగ్రెస్ నాయకులు నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక వాయిదాకు స్టే తెచ్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి అన్నారు. ఒక్క ఆళ్లగడ్డలోనే ఐదు స్థానాల్లో ఎన్నికలు నిలిపేయడాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఎంత బలహీనంగా ఉందో తెలియజేస్తోందన్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ బెదిరిస్తోందని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. 
Share this article :

0 comments: