సింహాన్ని బోనులో ఉంచి, నక్కలు రాజ్యం ఏలుతున్నాయి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సింహాన్ని బోనులో ఉంచి, నక్కలు రాజ్యం ఏలుతున్నాయి!

సింహాన్ని బోనులో ఉంచి, నక్కలు రాజ్యం ఏలుతున్నాయి!

Written By news on Thursday, January 17, 2013 | 1/17/2013

ప్రజల కోసం బతికే రాజన్న కుటుంబానికి ఎన్ని కష్టాలు! ఎందుకిలా ఈ రాజకీయనాయకులు జగన్‌బాబును వేధిస్తున్నారు!! అమ్మా విజయమ్మా, తల్లీ భారతీ, సోదరి షర్మిలమ్మా... మనం భయపడాల్సిందేమీ లేదు. అమ్మా మీరు ఎక్కడికీ పాదయాత్ర, ఓదార్పు యాత్ర చేయనవసరం లేదు. మీరు ఇంట్లోనే ఉండండి. 2014 ఎన్నికలయ్యాక సి.ఎం. సీట్లో ఉండేది జగనన్నే. ప్రజల గుండెల్లో ఉన్న మనిషికి మాత్రమే అందలం ఎక్కే హక్కు ఉంటుంది. 

ఆ హక్కు జగన్‌బాబుకు ఉంది కాబట్టే ప్రజలే ఆయన్ని గెలిపించుకుంటారు. చంద్రబాబు గారి మాటలు ఎవరూ నమ్మే స్థితిలో లేరు. ఆయన ‘వస్తున్నా మీ కోసం’అనే కన్నా, ‘వస్తున్నా నా కోసం’ అంటే బాగుంటుంది. ఇలాంటి వాళ్లంతా కలిసి కుమ్మక్కై జగన్‌ని జైల్లో పెట్టించారు. సింహాన్ని బోనులో ఉంచి నక్కలు ఎంతోకాలం రాజ్యం ఏలలేవు. పసలేని ఆరోపణలేవీ ఆయన్ని దోషిగా నిలబెట్టలేవు. అసలు దొంగలంతా బయట ఉండి, యువనేతను లోపల నిర్బంధించారు. ఈ సంగతులన్నీ ప్రజలకు తెలుసు. ఎంత అన్యాయంగా జగన్‌ని, ఆయన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారో రోజూ పేపర్లలో, టీవీలలో కనిపిస్తూనే ఉంది! ఒక్కడిని చేసి ఇంత మంది మీదపడడం ప్రజల హృదయాలను కలచివేస్తోంది. 

ఎంతసేపటికీ జగన్‌ని వేధించే వ్యూహాలను పన్నడం తప్ప పాలకపక్షంగానీ, ప్రతిపక్షం కానీ ఏనాడైనా ప్రజలను పట్టించుకున్నాయా? రాజన్న ఉన్నప్పుడు రాజ్యం ఎలా ఉండింది! ఇప్పుడెలా ఉంది? ప్రజల మీద భారం మోపకూడదని రాజన్న సబ్సీడీ భారాన్ని తన ప్రభుత్వం మీద వేసుకున్నారు. కేంద్రం చార్జీలు పెంచిన ప్రతిసారీ ‘పెరిగిన ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది, మీరు కట్టనవసరం లేదు’ అని భరోసా ఇచ్చిన ఆర్థికసాహసి ఆయన. కానీ ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రతిదాన్నీ ప్రజలమీదికే తోస్తోంది. వాడని కరెంటుకు చార్జీలు విధిస్తోంది. మాట్లాడితే బస్‌చార్జీలు పెంచుతోంది. రైతుల్ని బాధల్ని పట్టించుకోవడం లేదు. సామాన్యుల ఇక్కట్లపై ధ్యాసే లేదు. ఈ పరిస్థితి మారాలంటే జగనన్న పాలన రావాలి. వచ్చి తీరుతుంది. అప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ నిజమైన పండుగ.

అమ్మా... విజయమ్మా, మీరు బాధపడొద్దు. మీకోసం ప్రతిక్షణం పోరాడే మీ బిడ్డలం మేం ఉన్నాము తల్లీ. జగన్ అన్న త్వరలోనే వస్తాడు. మన ఆశల్ని నెరవేరుస్తాడు. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది. అమ్మా... జగనన్న కోసం రోజూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ‘దుఃఖపడువారు ధన్యులు’ అని దేవుడే చెప్పాడు కదా అమ్మా. బాధపడకండి. ఏ తప్పు చేయని బిడ్డ జైల్లో ఉన్నాడని మీరు బాధపడవచ్చు. మీ బాధ త్వరలోనే సమసిపోతుంది. అమ్మా... కొన్నిసార్లు మీరు కంటతడి పెడుతున్నారు. మీ కళ్లల్లో కనిపించవలసింది నీళ్లు కాదు తల్లీ... ధైర్యం ప్రతిఫలించాలి. మీ బిడ్డ విడుదలవుతాడు. ఆ రోజు వచ్చితీరుతుంది. ప్రజల ఆకాంక్షను దేవుడు తప్పక నెరవేరుస్తాడు. ఉంటాను తల్లీ.. ప్రేమతో మీ ఆడబిడ్డ.

- సిహెచ్. కుమారి, కాకినాడ

చీకటి శక్తుల పన్నాగాన్ని చీల్చుకుని వస్తాడు 

ఆంధ్రరాష్ట్రం మొత్తం ఎండిపోయిన ఎడారిలా మారినప్పుడు తెల్లని పంచెకట్టుతో, చల్లని చిరునవ్వుతో వచ్చాడు రాజన్న. ఆ చిరునవ్వుకి రాష్ట్రం పచ్చగా చిగురు తొడిగి కళకళలాడింది. అది చూసి ఓర్వలేని చీకటి శక్తులు, తమ క్రూరమైన కంటిచూపుతో కాల్చివేశాయి. రాష్ట్రం మొత్తం జీవచ్ఛవంలా మారిన తరుణంలో, ఆ చీకటిని ఛేదించుకుని ఒక వెలుగులా వచ్చి నేనున్నానని ధైర్యాన్నిచ్చాడు జగన్. ఆ వెలుగును కూడా ఆర్పేయాలని కటకటాల వెనుకకు నెట్టివేశాయి ఆ శక్తులు. కాని రాష్ట్రప్రజల ప్రేమ, ఆప్యాయతలు అనే ఆయుధాలతో ఆ కటకటాలను చేధించి, మా జగనన్నను కాపాడుకుంటాం. మా మేలు కోరే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాం.

- పోలూరి సునీతారెడ్డి, తనికెళ్ల, ఖమ్మం

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: