నాడు ఆ సంస్థతో ఒప్పందం వద్దని బాబును హెచ్చరించాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాడు ఆ సంస్థతో ఒప్పందం వద్దని బాబును హెచ్చరించాం

నాడు ఆ సంస్థతో ఒప్పందం వద్దని బాబును హెచ్చరించాం

Written By news on Monday, January 28, 2013 | 1/28/2013

నాడు ఆ సంస్థతో ఒప్పందం వద్దని బాబును హెచ్చరించాం
వినిపించుకోకుండా ఒప్పందం చేసుకున్నారు
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలి
ఈఆర్‌సీని కోరిన సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్‌రావు

 రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు, చార్జీల భారాలకు రిలయన్స్ వైఖరే కారణమని సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ చెప్పారు. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో భారీగా గ్యాస్ ఉందని చెప్పి ఇప్పుడు ధర పెంపుకోసం రిలయన్స్ ఉత్పత్తిని తగ్గించిందని మండిపడ్డారు. ‘విద్యుత్ సంక్షోభం-భారాలు-ప్రత్యామ్నాయాలు’ అనే అంశంపై సెంటర్ ఫర్ విద్యుత్ స్టడీస్ (సీపీఎస్) సంస్థ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సదస్సు నిర్వహించింది. 

ఇందులో ఈఏఎస్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సరఫరా లేకపోవడం వల్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నిరుపయోగంగా మారాయన్నారు. భవిష్యత్తులో గ్యాస్ ధర పెంచితే ఉత్పిత్తి పెంచాలని రిలయన్స్ భావిస్తున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. అప్పుడు ఉత్పత్తి పెరిగినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరిగి ప్రజలకు భారంగా మారుతుందని స్పష్టంచేశారు. వాస్తవానికి గ్యాస్ లేదని ఆనాడు చంద్రబాబుకు స్పష్టంగా చెప్పామని, ఒప్పందం కుదుర్చుకుంటే నష్టపోతామని హెచ్చరించామన్నారు. అయినా 3,370 మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారని వివరించారు. ఫలితంగా ఇప్పుడు గ్యాస్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘‘రోజుకు 85 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తానని చెప్పిన రిలయన్స్ సంస్థ... రోజురోజుకీ ఉత్పత్తి తగ్గిస్తోంది. దీంతో అధిక ధరకు మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడుతోంది. ఉన్న విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు సరఫరా, పంపిణీ నష్టాలు తగ్గించుకుంటే ప్రజలపై భారం మోపాల్సిన అవసరం ఉండదు..’’ అని అన్నారు. 
Share this article :

0 comments: