ప్రజల కోసం కష్టాలు పడేవాడే నిజమైన నాయకుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల కోసం కష్టాలు పడేవాడే నిజమైన నాయకుడు

ప్రజల కోసం కష్టాలు పడేవాడే నిజమైన నాయకుడు

Written By news on Wednesday, January 16, 2013 | 1/16/2013


వై.ఎస్. తనయుడిగా జగన్మోహన్‌రెడ్డి నల్లకాలువ సంస్మరణ సభలో - పెద్దాయన మరణాన్ని విని తట్టుకోలేక అశువులుబాసిన బడుగు, బలహీన, పేద ప్రజలను ఓదారుస్తానని వాగ్దానం చేయడం జరిగింది. అది ఒక మంచి సంప్రదాయం. కానీ దానిని అభినందించకపోగా వ్యతిరేకించి జగన్‌ను, ఆ మహానేతను అవమానపరచి, ఎన్నో ఆటంకాలు సృష్టించారు. అయినప్పటికీ, మాట తప్పని మడమ తిప్పని రాజశేఖరరెడ్డి రక్తం పంచుకుపుట్టిన జగన్ ఓదార్పు యాత్ర కొనసాగింది.

ఆ యువకుడు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. దాంతో అక్కడి నుండి మొదలయ్యాయి అధికార, ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు! పాలక, ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వం, సీబీఐ కలిసి చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రజాస్వామిక వాదులంతా ఖండాలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వై.ఎస్. పోయాక ఆరోగ్యశ్రీ నీరుగారిపోయింది. 108 కంటికి కనిపించడం లేదు. ఫీజు రియింబర్స్‌మెంట్ పత్తాలేదు. జలయజ్ఞం అటకెక్కింది. పారిశ్రామిక అభివృద్ధి పడకేసింది. వర్షాలు లేవు, కరెంటు లేదు, ప్రతి రైతు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇన్ని సమస్యలు అనునిత్యం ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రజల కష్టాలతో నాకు పనేంటి, వారేమైతే నాకేంటి అని, జగన్ తానిచ్చిన మాటను తప్పితే ఇప్పుడు జగన్ కేంద్రమంత్రి అయి ఉండేవారు. హాయిగా కేంద్ర, రాష్ట్ర పెద్దల పొగడ్తలందుకునేవారు. కానీ ఇక్కడే జగన్ నిజమైన నాయకుడని నిరూపించుకున్నాడు. జగన్ పక్షం ప్రజల పక్షమని నిరూపించుకున్నాడు.

అందువల్లనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజమైన ప్రజానాయకుడు జగనేనని దృఢంగా నమ్ముతున్నారు. కుట్రలు, కుతంత్రాలు ఎక్కువ కాలం నిలబడవు. మంచి పది కాలాలపాటు నిలబడుతుంది. రాజశేఖరరెడ్డి మంచి చేశారు కాబట్టి, కోట్లాది ప్రజలు వై.ఎస్.ను తమ గుండెల్లో పదిలంగా ఉంచుకున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా అంతిమంగా ఉండాల్సింది ప్రజల పక్షాన. అలా కాకుండా అధికారం సుస్థిరం చేసుకోవాలని పడరాని పాట్లు పడుతున్న రాజకీయ నాయకులకు భంగపాటు తప్పదు.
- అనుమాల పేరిరెడ్డి, వినుకొండ

కట్టడిచేసే దారి లేక...
పెట్టుబడుల మీద పడ్డారు!
జగన్‌గారి మీటింగ్‌లకు వచ్చే జన సమూహాన్ని, ఉప ఎన్నికల ఫలితాలను చూసి వై.ఎస్.ఆర్.సి.పి. అంటేనే కాంగ్రెస్‌కు, టీడీపీకి వణుకు పుట్టడం మొదలైంది. అందుకే ఎన్ని అడ్డదారులు తొక్కైనా సరే జగన్‌ని, ఆయన కుటుంబాన్ని అభాసుపాలు చేయడానికి ఈ రెండు పార్టీలూ నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ కంపెనీలకు ఏ విధంగా పెట్టుబడులు వచ్చాయో పరిశీలించమని కోర్టు సూచిస్తే... ఆ సూచనను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఆయన అరెస్టుకే స్కెచ్ గీసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం నేరం అనే భావన పారిశ్రామికవేత్తలలో నెలకొంది.

ఇలా జగన్‌ను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో మన రాజకీయనేతలు పన్నుతున్న కుట్రలన్నీ రాష్ట్రాభివృద్ధిని కుంటుపరుస్తున్నాయి. ‘‘ఎందుకు? ఏ స్వలాభం ఆశించి పెట్టుబడులు పెట్టావు?’’ అని పెట్టుబడిదారులను అడగడమే ఒక వింతైతే, ఏకంగా వారిని అరెస్టు చేయడం మరీ విడ్డూరం. ఎవరైనా ఎందుకు పెట్టుబడులు పెడతారు? లాభం కోసమే కదా. అందులో భాగంగా యువతకు ఉద్యోగావకాశాలను కల్పించడం కోసమే కదా. పెట్టుబడి పెట్టినవాళ్లను డబ్బు ఎక్కడది? ఎలా వచ్చింది అని అడుగుతారు కానీ, ఎందుకు పెట్టావని ఎవరైనా అడుగుతారా? ఈ ధోరణి చూస్తుంటే మన రాజకీయాలు, వ్యవస్థ ఎటువైపు పయనిస్తున్నాయో అర్థంకాకుండా ఉంది. ఏ పదవీ లేని మనిషి, ఏనాడూ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకోని మనిషి, ఎక్కడా అధికారం చెలాయించని మనిషి అయిన జగన్ మీద లేనిపోని అభాండాలన్నీ వేసి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో, ఏయే సమీకరణలు ఉన్నాయో ఊహించలేనంత అమాయకులు కారు ప్రజలు. అత్యంత ప్రజాదరణ కలిగిన యువనేతను మరేవిధంగానూ కట్టడి చేసే అవకాశం లేక పాలకపక్షం ‘పెట్టుబడుల’ కుయుక్తికి పాల్పడినట్లు తెలుస్తూనే ఉంది. ఎవరు ఎన్ని వ్యూహాలు పన్నినా వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి.పి. గెలిచి తీరుతుంది. అప్పటి వరకు రాష్ట్ర భవిష్యత్తు ఇలా అగమ్యగోచరంగానే ఉంటుంది.
- వడుగు దేవరాజు, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్

మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1,
బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: