కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కు: జనక్ ప్రసాద్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కు: జనక్ ప్రసాద్

కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కు: జనక్ ప్రసాద్

Written By news on Thursday, January 24, 2013 | 1/24/2013

2014లో రాహుల్‌ను ప్రధాని చేసేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారని, ఇదే విషయాన్ని జాతీయ దినపత్రికలు వెల్లడించాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ తెలిపారు. దీనిపై టీడీపీ నేతలు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కై నీచరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఐఎంజీ కేసులో జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలిపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుతానని చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. టీడీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే బాబుకు కేంద్రమంత్రి పదవైనా దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఐఎంజీ కుంభకోణాన్ని సీబీఐ, ఈడీలు ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు.
Share this article :

0 comments: