గిరిజనుల ఆశాజ్యోతి.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గిరిజనుల ఆశాజ్యోతి..

గిరిజనుల ఆశాజ్యోతి..

Written By news on Wednesday, January 30, 2013 | 1/30/2013


 జగన్‌కు ఎనలేని ప్రజాదరణ వస్తున్నందునే అక్రమ కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టారని ఖమ్మం జిల్లా అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు (టీడీపీ) అన్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన మంగళవారం ప్రత్యేక ములాఖత్‌లో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా లేనివిధంగా రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌ను ఇబ్బంది పెడుతున్నారన్నారు. జగన్ అరెస్ట్ అయిన నాటి నుంచి తాను మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. కుటిల రాజకీయంతో జగన్‌పై పెట్టిన కేసులు ఎంతోకాలం నిలువవన్నారు. 
భద్రాచల రాముని ఆశీస్సులతో ఆయన త్వరలో నిర్దోషిగా విడుదలై, ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. మహానేత రాజశేఖర్‌రెడ్డిని గిరిజనులను ఎంతగానో ఆదరించారని, అదేవిధంగా గిరిజన ప్రాంత వాసులకు ఉపయోగపడేలా రంపచోడవరం, సీతమ్మవాగు వంటి ప్రాజెక్టులు నిర్మించినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో ఉంటే జగన్ కేంద్రమంత్రి గానీ ముఖ్యమంత్రి గానీ అయ్యేవారని గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ దుర్నీతి స్పష్టమయిందన్నారు. ప్రజా సంక్షేమాన్ని మరిచి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ, కాంగ్రెస్‌లకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.గతంలో వైఎస్ చేపట్టిన పాదయాత్ర, బస్సు యాత్ర భద్రాచలం రాముని ఆశీస్సులతో, గిరిజనుల అండతో విజయవంతమయ్యాయన్నారు.

జగన్‌ను కలిసిన మాజీ మంత్రి బలిరెడ్డి...: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, వైఎస్సార్సీపీ నేత భూమా నాగిరెడ్డి కూడా జగన్‌ను కలిసి వెళ్లారు
Share this article :

0 comments: