పౌరుల ప్రాధమిక హక్కును హరించే విధంగా ....... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పౌరుల ప్రాధమిక హక్కును హరించే విధంగా .......

పౌరుల ప్రాధమిక హక్కును హరించే విధంగా .......

Written By news on Tuesday, January 22, 2013 | 1/22/2013

జగన్ ఆస్తుల కేసులో దర్యాప్తు పూర్తి చేయడానికి మరి కొంత సమయం పడుతుందని సిబిఐ తాజాగా చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.సిబిఐ సుప్రింకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు పూర్తి కాకముందు బెయిల్ పిటిషన్ వేసుకోరాదన్న వాదనకే సిబిఐ కట్టుబడి ఉంది.అయితే ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి దర్యాప్తుకు ఇంకెన్ని ఏళ్లు పడుతుందని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే సిబిఐ జగన్ ను బాధ్యుడిని చేస్తుందా అన్నది చర్చనీయాంశం.ఇదంతా రాజకీయ కేసుగా మారిన విషయం అర్ధం అవుతూనే ఉంది కదా. నిజానికి సుప్రింకోర్టు కూడా అలా బెయిల్ పిటిషన్ వేసుకోవద్దని జగన్ కేసులో చెప్పడమే విడ్డూరంగా ఉంటుంది.పౌరుల ప్రాధమిక హక్కును హరించే విధంగా అత్యున్నత న్యాయస్థానమే వ్యహరిస్తే ఇంకెవరికి చెప్పాలి.సిబిఐ ఇప్పుడు దానిని ఆసరాగా చేసుకుని వ్యవహరించడం కూడా అంత సమంజసం అనిపించదు.ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి అవకాశం కల్పించి, ఆ తర్వాత కేసునుకోర్టులో రుజువు చేసే విధంగా సిబిఐ వ్యవహరించగలిగితే అప్పుడు ఆ సంస్థకు పేరు వస్తుంది.లేకుంటే రాజకీయ అవసరాలకు సిబిఐ ఉపయోగపడిందన్న విమర్శలకు ఆస్కారం ఏర్పడుతుంది.
Share this article :

0 comments: