ముందు నీ కేసులపై విచారణ జరిపించుకో.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముందు నీ కేసులపై విచారణ జరిపించుకో..

ముందు నీ కేసులపై విచారణ జరిపించుకో..

Written By news on Monday, January 28, 2013 | 1/28/2013

వైఎస్ జగన్‌ను విమర్శించే నైతిక అర్హత బాబుకు లేదు
చంద్రబాబు అవినీతి పాలనను ఆయన మరిచిపోయినా.. ప్రజలు మరిచిపోరు
రాష్ట్రంలో నీతి నిజాయతీ లేని దౌర్భాగ్యపు రాజకీయాలకు తెరతీసింది బాబే
చిత్తశుద్ధి ఉంటే.. తన మీదున్న కేసులపై బాబు విచారణ జరిపించుకోవాలి

సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు తన హయాంలో జరిగిన కుంభకోణాలను మరిచిపోయి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారమిక్కడ ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘తాను మళ్లీ అధికారంలోకి వస్తే అవినీతిని అంతమొందిస్తానని, సుపరిపాలన అందిస్తానని బాబు కొత్త మాటలు చెబుతున్నారు. 

స్టాంపుల కుంభకోణం, మద్యం ముడుపులు, స్కాలర్‌షిప్‌ల కుంభకోణం, ఏలేరు స్కాం, సోమశిల కుంభకోణం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ... ఇవన్నీ జరిగింది చంద్రబాబు పాలనలో కాదా? చివరకు పేద ప్రజలు చికిత్స చేయించుకునే ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరులో కూడా అవకతవకలు జరిగాయే.. తన పాలన నీతివంతంగా సాగిందని బాబు భ్రమిస్తున్నారా? తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నాను కనుక.. అవన్నీ మర్చిపోయి ఉంటారని చంద్రబాబు భ్రమల్లో ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం మర్చిపోలేదు’ అని రాంబాబు అన్నారు. ‘బాబు జమానా-అవినీతి ఖజానా’ అని సీపీఎం చంద్రబాబుపై పుస్తకాలు ప్రచురించిన విషయం మరిచారా? అని ఆయన గుర్తు చేశారు. తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడ్డారు కనుకనే వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాలేదని బాబు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. అంటే బెయిల్ లభించిన వారందరూ నిజాయతీపరులని బాబు ఒప్పుకున్నట్లేనా అని ప్రశ్నించారు. అవినీతి గురించి మాట్లాడే హక్కు గానీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే నైతిక అర్హత గానీ చంద్రబాబుకు లేవన్నారు. అవినీతి, అక్రమాలకు, అడ్డగోలు రాజకీయాలకు నిలువుటద్దం అయిన బాబు నీతులు చెప్పడం విడ్డూరమన్నారు. 

ముందు నీ కేసులపై విచారణ జరిపించుకో..

అవినీతిని అంతమొందించే మాట అటుంచి.. చంద్రబాబు తనపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారన్న కేసును తొలుత త్వరితగతిన విచారణకు వచ్చేలా చూసుకోవాలని రాంబాబు అన్నారు. తన మీద వచ్చే కేసులన్నింటిలోనూ స్టేల మీద స్టేలు తెచ్చుకుంటూ బాబు తప్పించుకుంటున్నారని.. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తనమీద ఉన్న పెండింగ్ కేసులన్నింటిపైనా త్వరితగతిన విచారణ జరిపించుకోవాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో నీతి నిజాయతీ లేని దౌర్భాగ్య రాజకీయాలకు తెరతీసిన వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ‘భార్యాభర్తలైన లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ మధ్య చిచ్చు పెట్టేందుకు బాబు ప్రయత్నించారు. ఎన్టీఆర్‌పై ఆయన కుమారులు బాలకృష్ణ, హరికృష్ణను పురిగొల్పిన దిక్కుమాలిన వ్యక్తి చంద్రబాబు’ అని ధ్వజమెత్తారు. సాక్షాత్తూ తన సొంత సోదరుడైన రామ్మూర్తి నాయుడిపై విచిత్రమైన ఆరోపణలు చేసింది కూడా బాబేనని అన్నారు. 

గత చరిత్ర గుర్తు చేసుకో బాబూ...

ఈరోజు వేలాది కోట్ల రూపాయలకు పడగలెత్తిన చంద్రబాబు ఒక్కసారి వెనక్కి తిరిగి తన గత చరిత్ర ఏమిటో గుర్తు చేసుకోవాలని అంబటి అన్నారు. ‘1978లో రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి బాబుకున్నది రెండెకరాల పొలం మాత్రమే. అంతకు ముందు ఆయన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే స్కాలర్‌షిప్‌తో చదువుకున్నారు. రూ.500 నుంచి 5 వేల వరకూ వైఎస్‌రాజశేఖరరెడ్డి వంటి వారి దగ్గర జేబు ఖర్చులకు తీసుకున్న చరిత్ర చంద్రబాబుది. అలాంటి వ్యక్తి ఏం కష్టం చేసి సంపాదించాడని, వేలకోట్ల రూపాయలు వస్తాయి’ అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. 
Share this article :

0 comments: