అయినవాళ్లయితే దోషులేనా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అయినవాళ్లయితే దోషులేనా?

అయినవాళ్లయితే దోషులేనా?

Written By news on Thursday, January 10, 2013 | 1/10/2013

జగతితో లింకులు చూపిస్తూ రాంకీ సంస్థకువేధింపులు
దానికి ఫార్మాసిటీ పేర 2,143 ఎకరాలు కట్టబెట్టింది చంద్రబాబే
ఎల్ అండ్ టీ ద్వారా టెండర్ల ప్రాసెసింగ్; 13 సంస్థలొచ్చినా తిరస్కృతి
తాను జోక్యం చేసుకుని బీఓటీ పద్ధతిని స్వయంగా మార్చిన బాబు
2003లో రాంకీ ముందుకు రావటంతో హడావుడిగా అప్పగింత
ఆపద్ధర్మ సీఎంగా ఉంటూనే ఓకే; గ్రీన్‌బెల్ట్‌కు 58 ఎకరాలు చాలని అనుమతి
తరవాత వైఎస్ హయాంలో గ్రీన్‌బెల్ట్ పెంపుపై చర్చ; చివరికి విరమణ
ప్రస్తుతం బాబు నాటి ఒప్పందం ప్రకారమే గ్రీన్‌బెల్ట్
బీడీఎంఏ సంస్థలకు తక్కువ ధరకే ప్లాట్లు కేటాయించాలని వైఎస్ షరతు
దీనివల్ల దాదాపు 382 కోట్ల ఆదాయాన్ని నష్టపోయిన రాంకీ
గ్రీన్‌బెల్ట్ పెంచకపోవటమే వైఎస్ చేసిన మేలంటూ రాంకీకి సీబీఐ వేధింపులు
వైఎస్ నిర్ణయాలతో రాంకీకి లబ్ధికి బదులు నష్టం.. అన్నీ వదిలి సీబీఐ దార్లోనే ఈడీ


ఆయనతో అనుబంధం ఉంటే చాలు. ఒకవేళ అనుబంధం లేకున్నా... ఆయన హయాంలో చిన్న ప్రాజెక్టు చేపడితే చాలు. ప్రాజెక్టు కూడా చేపట్టకపోయినా... అప్పటికే ఉన్న ప్రాజెక్టుకు ఆయన హయాంలో కనీసం ఒక్క అనుమతి వస్తే చాలు.. అంతెందుకు!! ఆయనతో ఎక్కడైనా ఒక చిన్న లింకు కలిస్తే చాలు. 

సోదాలు... దాడులు... ఆపై అటాచ్‌మెంట్లు..!! 
వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని వేధించడానికి సీబీఐ, ఆ వెనక ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అనుసరిస్తున్న మార్గమిదే. సీబీఐ మొదటి చార్జిషీట్‌ను అనుసరించి... అందులో పేర్కొన్న ఆస్తుల్ని అటాచ్ చేసిన ఈడీ... ఇపుడు మూడో చార్జిషీట్ దగ్గరకొచ్చింది. దాన్లో సీబీఐ పేర్కొన్న మేరకు రాంకీ సంస్థకు వైజాగ్ ఫార్మాసిటీలో ఉన్న 135.46 ఎకరాల భూమిని అటాచ్ చేసింది. ఆ సంస్థ జగతిలో రూ.10 కోట్ల మేర పెట్టుబడి పెట్టిందన్న ఆరోపణల మేరకు జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 కోట్ల ఎఫ్‌డీలను, రూ.3.2 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లను అటాచ్ చేస్తూ ఈడీ ఒక నోట్ విడుదల చేసింది. నిజంగా సీబీఐ చెబుతున్నట్లు వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఫార్మాసిటీ ద్వారా రాంకీ లబ్ధి పొందిందా? అసలు రాంకీకి ఆ ప్రాజెక్టు కేటాయించిందెవరు? ఆ మాటకొస్తే ఆ ప్రాజెక్టును తెచ్చిందెవరు? వైఎస్సార్ హయాంలో ఏం జరిగింది? రాంకీకి నిజంగా లబ్ధి కలిగిందా లేక రాంకీ నష్టపోయిందా? జగతిలో రాంకీ సంస్థ నిజంగానే పెట్టుబడి పెట్టిందా? సీబీఐ, ఈడీ చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలెంత?

బాబు- వైఎస్సార్... ఎవరేం చేశారు?

ఏం జరిగింది? 
విశాఖ ఫార్మాసిటీ ప్రతిపాదించింది చంద్రబాబునాయుడు. దానికోసం టెండర్లు పిలిచిందీ... సంస్థల్ని ఎంపిక చేసిందీ అన్నీ ఆయనే. ఆ సంస్థలన్నిటినీ తిరస్కరించి మళ్లీ టెండర్లు పిలిచింది కూడా ఆయనే. రెండవ సారి రాంకీ తప్ప ఎవ్వరూ రాకపోవటంతో... నేరుగా రాంకీకి కట్టబెట్టిన బాబు... నెలరోజుల్లో ఎన్నికలుండగా... 2004 ఏప్రిల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే రాంకీకి ఈ ప్రాజెక్టును అప్పగించి సంతకాలు కూడా చే సేశారు. రాంకీ వాటా ఎంతో, దాన్లో గ్రీన్‌బెల్ట్ ఎంత ఉండాలో.. అన్నీ అప్పుడే నిర్ణయించేశారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక... కొన్ని ప్రతిపాదనలు రావటంతో గ్రీన్‌బెల్ట్ పెంచాలనే యోచన చేశారు. అలా చేస్తే ఫార్మా సంస్థలకు స్థలం ఉండదని రాంకీ చెప్పటంతో తన ఆలోచన విరమించుకున్నారు. దీంతో బాబు హయాంలో కుదిరిన ఒప్పందమే ప్రస్తుతం అమల్లో ఉంది. 

సీబీఐ ఏమంటోంది?
కానీ సీబీఐ ఏం చెబుతోందంటే... వై.ఎస్.రాజశేఖరరెడ్డి గ్రీన్‌బెల్ట్ పెంచాలనే ప్రతిపాదన చేయటాన్ని ప్రస్తావిస్తూ... అలా పెంచకుండా ఉండటం ద్వారా రాంకీకి భారీగా లబ్ధి చేకూర్చారని. అందుకు ప్రతిగా జగతి పబ్లికేషన్స్‌లో రాంకీ సంస్థ రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టిందని!!

ఏది నిజం?
ఇక్కడ గమనించాల్సిందొక్కటే. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో గ్రీన్‌బెల్ట్ పెంచాలనే ప్రతిపాదనలు రావటం... వాటిపై ఆయన కొందరు అధికారులతో మాట్లాడటం తప్ప ఎన్నడూ దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులూ విడుదల కాలేదు. ఈ సమావేశాల్లో రాంకీ సంస్థ ప్రతినిధులు పాల్గొనలేదు కూడా. ముఖ్యమంత్రి యోచన తెలిశాక రాంకీ ప్రతినిధులు స్పందించారు. ఒక సమావేశానికి హాజరై... గ్రీన్‌బెల్ట్ పెంచితే తమకు కేటాయించిన భూమిలో సగం పోతుందని, దానివల్ల తగినన్ని పరిశ్రమలు రావని వివరించారు. దీంతో వైఎస్ తన యోచన విరమించుకున్నారు. దీంతో గ్రీన్‌బెల్ట్‌కు సంబంధించి బాబు హయాంలో కుదిరిన ఒప్పందమే ఇప్పటికీ అమల్లో ఉంది. మరి దీన్ని వైఎస్సార్ రాంకీకి లబ్ధి చేకూర్చినట్లుగా భావించవచ్చా?

పెట్టుబడుల సంగతేంటి?
ఏం జరిగింది?

రాంకీ సంస్థకు చెందిన కొందరు సబ్ కాంట్రాక్టర్లు రెండు సంస్థల ద్వారా జగతి పబ్లికేషన్స్‌లో రూ.10 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. అదేమీ రహస్యం కాదు. జగతిలో మిగతా షేర్ హోల్డర్లు కొన్న ధరకే వారు కూడా షేర్లు కొనుగోలు చేశారు. 

సీబీఐ ఏమంటోంది?
గ్రీన్‌బెల్ట్‌ను పెంచకపోవటం ద్వారా వైఎస్ రాంకీకి లబ్ధి చేకూర్చారని. ప్రతిగా ఆ సంస్థ కొందరు వ్యక్తుల ద్వారా తన సొమ్మును జగతిలోకి పెట్టుబడుల రూపంలో మళ్లించిందని!

ఏది నిజం?
టీడబ్ల్యూసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఎరెస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు జగతి పబ్లికేషన్స్‌లో 2,77,777 షేర్లు కొనుగోలు చేశాయి. అందుకోసం రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ఈ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసినవారు, డెరైక్టర్లు రాంకీలో సబ్ కాంట్రాక్టర్లు. ఇక్కడ గమనించాల్సిందొక్కటే. గ్రీన్‌బెల్ట్‌ను పెంచటం గానీ, తగ్గించటం గానీ జరగనపుడు దానివల్ల రాంకీకి లబ్ధి కలగటమనే ప్రశ్న ఎక్కడిది? అందుకోసమే వారు పెట్టుబడి పెట్టే అవకాశం ఇంకెక్కడుంటుంది?

రాంకీకి లాభమా... నష్టమా?

సీబీఐ ఏమంటోంది?
వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రాంకీకి లబ్ధి చేకూరటం వల్లే ఆ సంస్థ జగతి పబ్లికేషన్స్‌లో 10 కోట్లు పెట్టుబడి పెట్టిందని సీబీఐ చార్జిషీట్లో పేర్కొంది. ఆ మేరకే ఈడీ కూడా ఆ సంస్థకు ఫార్మాసిటీలో ఉన్న ఆస్తుల్ని అటాచ్ చేసింది.

ఏది నిజం?
వైఎస్సార్ హయాంలో గ్రీన్‌బెల్ట్ పెరగటం గానీ, తగ్గటం గానీ జరగలేదు. సరికదా... ఫార్మాసిటీలో స్థలాలన్నీ బడా సంస్థల పరం కాకుండా ఆయనో షరతు పెట్టారు. బల్క్‌డ్రగ్ ఉత్పత్తిదారుల సంఘంలో (బీడీఎంఏ) సభ్యత్వం ఉన్న సంస్థలకు ఎకరా రూ.15 లక్షలకే ఇవ్వాలని, 450 ఎకరాలను వీటికివ్వాలని షరతు పెట్టారు. ఇది బాబుతో ఒప్పందంలో లేని షరతు. దీనివల్ల ఎకరాకు రూ.85 లక్షల చొప్పున 382 కోట్లకు పైగా రాంకీ సంస్థ నష్టపోయినట్లు లెక్క. (ఎకరా కోటికి విక్రయించడాన్ని దృష్టిలో పెట్టుకుంటే). మరి వైఎస్సార్ లబ్ధి చేకూర్చినట్లు భావించాలా? మరో ముఖ్యాంశమేంటంటే ఒప్పందం ప్రకారం రాంకీ సం స్థకు అమ్మకం పన్ను, సీవరేజి ఫీజు, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్ వంటివి వెనక్కు రావాలి. వీటి విలువ దాదాపు రూ.400 కోట్ల పైనేనని అంచనా. ఇవేవీ ఇంతవరకూ ఆ సం స్థ చేతికి రాలేదు. మరి వైఎస్సార్ గనక రాంకీ సంస్థకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నారనుకుంటే ఇవన్నీ ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? దీనికి సమాధానం సీబీఐ దగ్గర ఉందా?

బాబు, రాంకీ.. ఓ ఫార్మా సిటీ 
ఫార్మా సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వేరొకచోట కూడా ఉంటే బావుంటుందని బీడీఎంఏ భావిం చింది. నాటి సీఎం చంద్రబాబునాయుడిని ఈ మేరకు కోరింది. దీంతో ఇతర ప్రాంతంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయాలని 1999లో బాబు ప్రభుత్వం భావించింది. విశాఖపట్నంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామంటూ 2000వ సంవత్సరం జూలై 18న జీవో ఎంఎస్ నెంబరు 381ని విడుదల చేసింది. ఇందుకు పరవాడ పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంచుకుంది. ఫార్మా కాలుష్యం దృష్ట్యా పరవాడ సరికాదని అభ్యంతరాలొచ్చాయి. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా... పరవాడను ఖరారు చేస్తూ 2001 సెప్టెంబరు 24న జీవో ఎంఎస్ నెంబరు 501ని విడుదల చేశారు.

ఎల్ అండ్ టీకే టెండర్ల ప్రక్రియ...
బాబు హయాంలో ఏం చేసినా ఎల్ అండ్ టీకే దక్కాలి. ఫార్మా పార్కు టెండర్ల ప్రక్రియను నడిపించే బాధ్యతను ఎల్ అండ్ టీ రాంబోల్ కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్‌కు అప్పగించారు. టెండర్లు ఆహ్వానిస్తూ 2002 అక్టోబరు 31న, డిసెంబరు 17న ప్రకటనలొచ్చాయి. రాంకీ ఎన్విరో ఇంజినీర్స్, రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో 11 ఇతర సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. కానీ రాంకీతో పాటు ఏడుగురు బిడ్డర్లే ఆర్‌ఎఫ్‌పీ పత్రాల్ని ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేశారు. చివరకు జూమ్ డెవలపర్స్, మరిది, వర్ట్సిలా సంస్థలు మాత్రమే సవివర ప్రతిపాదనల్ని సమర్పించాయి. వీటిలో మారిషస్‌కు చెందిన క్రిస్సన్‌తో కలిసి జూమ్ డెవలపర్స్ వేసిన ప్రతిపాదన మాత్రమే అర్హత పొందింది. ఏపీఐఐసీ ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వలేదన్న కారణంతో జూమ్ ప్రతిపాదనను కూడా రద్దు చేశారు. 

బీవోటీగా నిబంధనలు మార్చిన చంద్రబాబు...
టెండర్ల ప్రక్రియ రద్దయిపోవటంతో చంద్రబాబు కొత్త ఆలోచన చేశారు. 2003 జూన్ 28న అధికారులతో సమావేశమై... బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ బదులు బిల్డ్ ఆపరేట్ ఓన్ ప్రాతిపదికన చేపట్టాలనుకున్నారు. అంటే నిర్మించి, నిర్వహించి ప్రభుత్వానికి అప్పగించే బదులు... సదరు ప్రయివేటు సంస్థ యాజమాన్యంలోనే ఇది కొనసాగుతుందన్న మాట. తర్వాత నెలరోజులకు... అంటే 2003 జూలైన 31న రాంకీ ఇన్‌ఫ్రా సంస్థ ముందుకొచ్చి ఏపీఐఐసీకి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన సమర్పించింది. దానిపై ఇన్‌ఫ్రా కమిటీ నేరుగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించింది. దీంతో రాంకీతో చర్చలు జరిపే అధికారాన్ని నేరుగా ఏపీఐఐసీకి అప్పగిస్తూ 2003 నవంబరు 14న చంద్రబాబు స్వయంగా ఒక నోట్‌ను ఆమోదించారు. మూడు నెలల్లో మొత్తం సిద్ధమైపోయింది. ప్రాజెక్టును అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవటం... ఎంఓయూ కుదర్చుకోవటం... చకచకా జరిగిపోయాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే బాబు ఎంఓయూ కుదుర్చుకున్నారు. చివరికి ‘రాంకీ ఫార్మా సిటీ’ సంస్థను 2004 మార్చి 11న... అంటే ఎన్నికలకు రెండు నెలల ముందు రిజిస్టరు చేశారు. 24 గంటలు కూడా తిరక్క ముందే... 2004 మార్చి 12న రాంకీతో కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిప్రకారం ఈ సంస్థలో రాంకీకి 89 శాతం, ఏపీఐఐసీకి 11 శాతం వాటా ఉంటాయి. ఏపీఐఐసీ తన వాటా మేరకు భూమిని సమకూరుస్తుంది. 

గ్రీన్ బెల్ట్‌పై వైఎస్ సమావేశాలు...
వై.ఎస్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కొన్ని సమావేశాల్లో ఫార్మాసిటీ... దాన్లో వదలాల్సిన గ్రీన్‌జోన్‌పై పలు ప్రతిపాదనలొచ్చాయి. ఫార్మా సిటీలో నో డెవలప్‌మెంట్ జోన్‌గా ప్రకటించే గ్రీన్‌బెల్ట్ ఏరియా... బౌండరీ చుట్టూ ఒక కిలోమీటర్ ఉంటే బాగుంటుందని, అది గోడకు అవతల 500 మీటర్లు, ఇవతల 500 మీటర్లు ఉంటే బాగుంటుందని, అక్కడ ఉడాయే నేరుగా వాణిజ్య ప్రాతిపదికన మొక్కలు పెంచాలని ప్రతిపాదించారు. అయితే బయటి వారి నుంచి భూముల్ని కొనకుండా కిలోమీటర్ మేర గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేయటం సాధ్యం కాదని తరువాతి సమావేశంలో ‘ఉడా’ చెప్పటంతో... దాన్ని 250 మీటర్లకు తగ్గిస్తే చాలనుకున్నారు. అయితే ఇలా చేయటం వల్ల ఫార్మాసిటీలో వెయ్యి ఎకరాల వరకూ పోతుందని ఫార్మాసిటీ యాజమాన్యం చెప్పటంతో గోడకు వెలుపల 250 మీటర్లు, గోడ లోపల మాత్రం 50 మీటర్లు ఉంటే చాలనుకున్నారు. ఇవన్నీ సంప్రతింపులే తప్ప ఎక్కడా ఒక్క జీవో కూడా జారీ కాలేదు. 

గమనించాల్సిందేంటంటే ప్రస్తుతం గోడకు లోపల గ్రీన్‌బెల్ట్ 50 మీటర్లుగా ఉంది. దీని రాంకీ సంస్థ వదిలిన స్థలం 58.95 ఎకరాలు. ఇది చంద్రబాబు నాయుడి హయాంలో ప్రతిపాదించినదే. అంటే నాటి ఒప్పందం యథాతథంగా ఉన్నట్టే. 

అసలు వైఎస్ 250 మీటర్ల గ్రీన్‌బెల్ట్ ఉండాలని ప్రతిపాదించినపుడు... తాము చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న కన్సెషన్ ఒప్పందం ప్రకారం 50 మీటర్లకే అంగీకరించామని, దానికే పరిమితం కావాలని ముఖ్యమంత్రిని రాంకీ సంస్థ కోరే అవకాశం లేదా? అలా కోరినపుడు మునుపటి ఒప్పందమే కనక ఆయన సరేననే అవకాశం లేదా? అవన్నీ వదిలేసి... సాక్షిలో పెట్టుబడి పెట్టారు కనకే ఈ మేలు చేశారనటం ఎంతవరకు సమంజసం?

గ్రీన్‌బెల్ట్‌పై రాంకీకి వైఎస్ చేసిన మేలేమీ లేదు. మునుపటి ఒప్పందాన్నే పాటించారు. దీనికే ‘సాక్షి’లో రాంకీ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందన్న సీబీఐ వాదన నిజమైతే... 2,143 ఎకరాల్ని సింగిల్ టెండరు ప్రాతిపదికగా కట్టబెట్టేసిన చంద్రబాబునాయుడికి రాంకీ ఎంత ముడుపులిచ్చి ఉండాలి? అంత హడావుడిగా ఎన్నికల ముందు ఒప్పందం కుదుర్చుకున్నారెందుకు? ఎంత ముడుపులు తిని ఉంటారు? ఇవన్నీ సీబీఐకి గానీ, ఈడీకి గానీ పట్టవా? ఎమ్మార్ కేసులో 2005 కన్నా ముందు ఏం జరిగిందనేది తాను దర్యాప్తు చేయబోనని భీష్మించుకున్న సీబీఐ... రాంకీ వ్యవహారంలోనూ అదే చేస్తోంది. ఎంతసేపూ ఈ చార్జిషీట్లో 2005 నుంచి 2009 మధ్య జరిగిన లావాదేవీల ప్రకారం... అంటోందే తప్ప అసలు రాంకీకి ఇచ్చిందెవరు? 2004 ఏప్రిల్లో ఆ సంస్థ ఏర్పాటయిన 24 గంటల్లో కన్సెషన్ ఒప్పందం ఎలా కుదిరింది? అంతకు ముందే భూములు ఎలా అలాట్ చేశారు? అనేవి దర్యాప్తు చేయటమే 
లేదు. ఎందుకని? 

వాన్‌పిక్ మాదిరే రాయితీలు...
ఫార్మాసిటీతో చంద్రబాబు హడావుడిగా 
కుదుర్చుకున్న ఈ కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం...

అమ్మకం పన్ను, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు పూర్తిగా మినహాయించారు. 
{పభుత్వానికి, ఉడాకు చెల్లించాల్సిన చార్జీలేమైనా ఉంటే వాటిని తగ్గించటానికైనా, పూర్తిగా రద్దు చేయటానికైనా అవసరాన్ని బట్టి ఏపీఐఐసీ రికమెండ్ చేస్తుంది. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అవకాశాలున్న అన్ని రాయితీలూ వచ్చేలా ఏపీఐఐసీ సహకరిస్తుంది. 
అయితే 2000 మార్చిలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొన్న విధంగా గ్రీన్ బెల్ట్ ఉండేలా డెవలపర్ చూసుకోవాలి. (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొన్న ప్రకారం చంద్రబాబు గ్రీన్‌జోన్‌కు నిర్దేశించిన మొత్తం భూమి 352 ఎకరాలు)
మొత్తం భూమిని రాంకీ పేరిటే కేటాయిస్తారు. అది ప్లాట్లుగా చేసి, తనే ధర నిర్ణయించి విక్రయిస్తుంది. దీన్లో గ్రీన్‌బెల్డ్ జోన్ ఉంటుంది. 
ఈ కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం 2005 ఫిబ్రవరి 28న ఉడాకు ‘రాంకీ’ లే ఔట్ ప్లాన్‌ను అందజేసింది. ఈ లేఔట్ ప్లాన్ ప్రకారం గ్రీన్‌జోన్ మొత్తం 352 ఎకరాలుంటుంది. దీన్లో గ్రీన్ బెల్ట్ ఏరియా 58.95 ఎకరాలు. ఈ మేరకు ఉడాకు లేఔట్ సమర్పించిన రాంకీ... ఆమోదం కూడా పొందింది. 
{Xన్ జోన్ అంటే మొత్తం ఫార్మాసిటీలో పచ్చదనానికి కేటాయించే ప్రాంతం. గ్రీన్ బెల్ట్ అంటే చుట్టూ కారిడార్‌ను ఆనుకుని ఉండే ప్రాంతం. 

పరవాడలో ఫార్మాసిటీ కోసం చంద్రబాబునాయుడు చేసిన ప్రయత్నాలను అప్పట్లో ఏపీఐఐసీ ఘనంగా ప్రకటించింది. దీనిపై 2002లో 18పేజీల ప్రజెంటేషన్‌ను కూడా తయారు చేసింది. ఈ ప్రజెంటేషన్ యథాతథంగా...
Share this article :

0 comments: