కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో రైతులు భూములు అమ్ముకుంటుంటే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో రైతులు భూములు అమ్ముకుంటుంటే..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో రైతులు భూములు అమ్ముకుంటుంటే..

Written By news on Tuesday, January 8, 2013 | 1/08/2013

అవగాహన లేనివాళ్లు దేశాన్ని పాలిస్తున్నారని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో రైతులు భూములు అమ్ముకుంటుంటే.. పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పని చేస్తున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఏలూరులో సోమవారం ప్రారంభమైన 8వ ఆక్వా టెక్ ఎక్స్‌పో-2013 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే నేతలు నేడు అవసరమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేసి ఇతర దేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటుందని చెప్పారు. ఇదే పామాయిల్ దేశంలో రైతులు పండిస్తామంటే కనీస గిట్టుబాటు ధర కల్పించకపోగా సబ్సిడీపై రుణాలు అందించడానికి ససేమిరా అంటోందని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో అవగాహన లేని ప్రణాళిక అధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియా దేశాన్ని పాలించే విధంగా ప్రణాళికలు రూపొందించడం సిగ్గుచేటన్నారు. 
Share this article :

0 comments: