అందుకే క్వారీలపై దాడులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అందుకే క్వారీలపై దాడులు

అందుకే క్వారీలపై దాడులు

Written By news on Thursday, January 17, 2013 | 1/17/2013

- కాంగ్రెస్‌ను వీడి వైఎస్‌ఆర్‌సీపీలో చేరతానని ప్రకటించినందుకే: ఎమ్మెల్యే రవికుమార్
- అధికార పార్టీని వీడుతున్నందుకే ఎమ్మెల్యేలపై ఈ దాడులని అనుమానం
- నేడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి క్వారీపై దాడికి రెడీ! 

ప్రకాశం జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని విజిలెన్స్ అధికారులు వారి గనుల్లో దాడులకు తెరతీశారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు చెందిన క్వారీలపై బుధవారం తనిఖీలు చేశారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి క్వారీ మూసి ఉండడంతో గురువారం దాడులు చేయనున్నట్లు తెలుస్తోంది. తాను వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నానని, అందుకే తన క్వారీలపై దాడులు చేశారని రవికుమార్ బుధవారం చిలకలూరిపేటలో ఆరోపించారు. 

తాను వైఎస్‌ఆర్‌సీపీ కోసం పనిచేస్తానని దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి మంగళవారం చీమకుర్తిలో తన అనుచరుల సమావేశంలో ప్రకటించారు. దీంతో గనుల శాఖ డెరైక్టర్ జనరల్ ఆదేశాల మేరకే ఎమ్మెల్యేల క్వారీల్లో దాడులకు ఉపక్రమించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. రవికుమార్, శివప్రసాద్‌రెడ్డిలకు బల్లికురవ, సంతమాగులూరు, చీమకుర్తి మండలాల్లో క్వారీలు ఉన్నాయి. బుధవారం మైనింగ్, విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు బృందాలుగా ఏర్పడి బల్లికురవ మండలంలోని రవికుమార్‌కు చెందిన కిశోర్ గ్రానైట్స్, కిశోర్ శ్లాబ్స్, అంకమ్మ చౌదరి గ్రానైట్స్ (కామేపల్లి గ్రానైట్స్)లలో తనిఖీలు చేశారు. 

తనిఖీల సమయంలో క్వారీల్లో ఉద్యోగులు లేకపోవడంతో నోటీసులు ఇవ్వలేదు. చీమకుర్తిలోని శివప్రసాద్‌రెడ్డికి చెందిన సూర్య గ్రానైట్ క్వారీలో దాడులు చేసేందుకు వె ళ్లిన విజిలెన్స్ అధికారులు క్వారీకి సెలవు కావడంతో తనిఖీ చేయలేదు. అక్కడ గురువారం దాడులు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సూర్య గ్రానైట్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి వెనక్కి వస్తే ఆ క్వారీపైనే ప్రత్యేకంగా దాడికి వచ్చినట్లు అనుమానం కలుగుతుందని పక్క క్వారీల్లో తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. తనిఖీలపై మైన్స్ విజిలెన్స్ ఏడీ నర్సింహారెడ్డిని వివరణ కోరగా సమాధానం ఇవ్వలేదు.

sakshi
Share this article :

0 comments: