జగన్ కోసం జనం ఎదురుచూపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కోసం జనం ఎదురుచూపు

జగన్ కోసం జనం ఎదురుచూపు

Written By news on Thursday, January 3, 2013 | 1/03/2013

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనమై కనీసం ప్రతిపక్ష స్థానాన్ని కూడా గెలుచుకోలేని దుస్థితిలో రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేసిన మహానేత డా॥వైఎస్సార్. రాష్ట్రంలో ఆయన వరుసగా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కేంద్రంలో రెండుసార్లు యూపీఏ ప్రభుత్వం ఏర్పడేందుకు అత్యధిక సంఖ్యలో ఎంపీలను రాష్ట్రం నుండి గెలిపించారు. రాష్ట్రంలో ఏ సంక్షేమ అభివృద్ధి పథకం ప్రవేశపెట్టినా ఆ పథకాలకు ఇందిరమ్మ, రాజీవ్ గాంధీల పేర్లు పెట్టి దేశ ప్రజల మదిలో వాళ్ల పేర్లు నిలిచిపోయే విధంగా వైఎస్సార్ కృషి చేశారు. అటువంటి నాయకుడి మరణానంతరం, ఆయన తనయుడు జగన్ పట్ల, ఆయన కుటుంబం పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు బాధాకరం. 

సొంతంగా పది ఓట్లు కూడా సంపాదించుకోలేని, కనీసం ఒక సీటైనా గెలుచుకోలేని వృద్ధ నేతల సలహాలు తీసుకుని కాంగ్రెస్ అధిష్టానం జగన్ పార్టీని దూరం చేసుకుంది. అటువంటి పరిస్థితుల్లో తన తండ్రి మరణించిన నల్లకాలువ వద్ద రాష్ట్ర ప్రజలకు ఇచ్చినమాట కోసం, ఎంపీ పదవిని, కాంగ్రెస్‌ను విడిచిపెట్టి జగన్ ఓదార్పుయాత్ర చేపట్టారు. దీనిని సహించలేక, ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక సీబీఐని పావుగా వాడుకుని, అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేశారు. ఈ కేసులేవీ విచారణలో నిలబడవు. జగన్ నిర్దోషిగా విడుదలవుతారు. ఆయన విడుదల కోసం రాష్ట్ర ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జగన్‌ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆయన రాకతోనే రాజన్న పాలన సాధ్యం. ఈ జైలు జీవితం తాత్కాలికమే. జగన్‌కు రాష్ట్ర ప్రజలంతా వెన్నుదన్నుగా ఉన్నారు.

- బి.ఆర్.శాలి, కావలి

విమర్శించినవారికి రాజకీయ సన్యాసం తప్పదు

ఒక గొప్ప లీడర్‌ని ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన తర్వాత ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయింది. ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఒక ప్రాంతం నాశనం అవుతుంది. కాని చరిత్రలో ఒక వ్యక్తి చనిపోతే ఒక రాష్ట్రమే నాశనం అయిన దాఖలాలు లేవు. వైఎస్సార్ చనిపోయాక ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడం చూసి దేశం నివ్వెరపోతోంది. ప్రస్తుతం మనం అసమర్థపాలనలో ఉన్నాం. అందుకే ఈ రాష్ట్రానికి, మనకు ఒక లీడర్ కావాలి. ఆ లీడర్ జగన్. జనమంతా ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ప్రజల హృదయాల్లో ఉన్న యువనేత జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. జగన్‌ని విమర్శించిన నాయకులందరూ రేపటి రోజున రాజకీయ సన్యాసం తీసుకుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జగన్‌ని విమర్శించి ఇబ్బందిపెడుతున్న నాయకులకు, రాజకీయ పార్టీలకు త్వరలో ప్రజలంతా బుద్ధి చెబుతారు. 

- ఎం.అహమ్మద్, నరసరావుపేట, గుంటూరు

మీ రాకకై ఎదురుచూస్తోంది

మిత్రమా! ప్రజలు మీలో రాజన్న ప్రతిరూపాన్ని చూస్తున్నారు. ‘ఓదార్పుయాత్ర’లో మీ మానవీయ కోణాన్ని, మాటతప్పని, మడమ తిప్పని ఒక పోరాట యోధుణ్ని చూస్తున్నారు. ప్రజాసంక్షేమం కోసం నాన్నగారు అర్ధంతరంగా వదిలివెళ్లిన అభివృద్ధి పథకాలను మీరు తప్పక నెరవేరుస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. రాజన్నను ప్రేమించే ప్రతి హృదయం మీరు ‘కడిగిన ముత్యం’లా బయటకు రావాలని, రాజన్న రాజకీయ వారసుడిగా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించి ప్రజాసంక్షేమాన్ని గాడిన పెట్టాలని కోరుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌ను ‘అన్నపూర్ణ’గా దేశంలోనే అగ్రతాంబూలాన నిలుపుతారన్న దృఢవిశ్వాసంతో మీ రాకకై నిరీక్షిస్తోంది.

- సిద్ధారెడ్డి వాసు, చిన్న ఓబినేనిపల్లి, ప్రకాశం

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: