పోలీసుల ఎదుట లొంగిపోక తప్పని పరిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్యే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలీసుల ఎదుట లొంగిపోక తప్పని పరిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్యే

పోలీసుల ఎదుట లొంగిపోక తప్పని పరిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్యే

Written By news on Thursday, January 10, 2013 | 1/10/2013

 భూ కబ్జా, చీటింగ్‌కు పాల్పడిన కేసులో నిందితురాలైన ఖానాపూర్ టీడీపీ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్‌కు సుప్రీంకోర్టులో సైతం చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోరుతూ బుధవారం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సుమన్ రాథోడ్‌కు అన్ని కోర్టుల్లోను చుక్కెదురు కావడంతో పోలీసుల ఎదుట లొంగిపోక తప్పనిస్థితి ఏర్పడింది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్న ఎం.నర్సింహారావుకు చెందిన భూమిని తన అనుచరుల పేరుపై నకిలీ రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా తప్పుడు పత్రాలతో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కళాశాల ప్రిన్సిపల్ బి.వి.రామారావు నుంచి రూ.1.80 కోట్లు తీసుకుని విక్రయించిన కేసులో సుమన్‌రాథోడ్‌తోపాటు ఆమె అనుచరులు, బంధువులపై కేసు నమోదైన విషయం తెలిసిందే.




కాంగ్రెస్ నేత, కామిరెడ్డిపల్లి సుధాకరరెడ్డి హత్యకు కుట్రపన్నిన కేసులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌కు జిల్లా కోర్టు బుధవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల నగదు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో ధర్మవరం పోలీస్‌స్టేషన్‌లో శ్రీరామ్ లొంగిపోవాలని న్యాయమూర్తి సూచించారు. అనంతరం స్టేషన్ హౌస్ ఆఫీసర్‌నుంచి బెయిల్ ఉత్తర్వులు పొంది విడుదల కావచ్చని చెప్పారు. అయితే ఈ కేసులో పోలీసులు విచారణకు పిలిచిన ప్రతిసారీ వారికి సహకరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు చేపట్టరాదని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వారికి కూడా బెయిల్ మంజూరైనట్లు తెలిసింది.


sakshi

Share this article :

0 comments: