ఓదార్చడమే నేరమైందా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓదార్చడమే నేరమైందా?

ఓదార్చడమే నేరమైందా?

Written By news on Saturday, January 5, 2013 | 1/05/2013

‘రాజన్న రాజ్యం’ రావాలంటే పులివెందుల పులిబిడ్డ కటకటాలను ఛేదించి బయటకు రావాలి. ఆ బిడ్డ ఏం తప్పు చేశాడని జైలుపాలు చేశారు? మన రాజన్న ఇమేజ్‌ను దెబ్బతీయటానికి కాంగ్రెస్ పన్నిన పన్నాగం కాదా ఇది! వైఎస్సార్ మరణవార్త విని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఓదార్చటానికి వెళ్లటం తప్పా? జగన్ ఎవరి కోసం అంత రిస్క్ తీసుకున్నారు? మహానేత మనందరినీ విడిచి దేవుడి దగ్గరకు వెళ్లిన విషయం జగన్‌బాబు ఒక్కరికే తెలుసా? ఈ ప్రభుత్వానికి తెలియదా? ఓదార్పుయాత్ర చేసినందుకే కాంగ్రెస్ నుండి వైదొలగేలా చేస్తారా? అసలు సంగతి అదికాదని ప్రజలకు తెలుసు.

జగన్ ఒక మహానేతగా ఎదుగుతున్నాడన్న భయం! జగన్ కాంగ్రెస్‌లో ఉండి ఉంటే ఇన్ని అభియోగాలను ఆ పార్టీ ఆయనపై మోపేదా? న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసి ఉండేదా? రాజన్న ఉన్నప్పుడు సోనియాకు ఈ ఆస్తుల విషయాలు గుర్తు రాలేదా? అప్పుడు రాదులెండి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ నిలబడటానికి మూలస్తంభం మన రాజన్నే కదా! కన్నతండ్రిని పోగొట్టుకుని జగన్ బాధలో ఉంటే జైలుపాలు చేస్తుందా ఈ ప్రభుత్వం? ఆ బాధ నుండి వారు తేరుకోకముందే అర్థంలేని ఆరోపణలు గుప్పించి, జైలుపాలు చేయటం న్యాయమేనా? ఎమ్మెల్యే అని తెలిసి కూడా వైఎస్సార్ పార్టీ గౌరవాధ్యక్షురాలైన విజయమ్మని కూడా రోడ్డు మీదకు రప్పిస్తారా!

ఎలక్షన్ల ప్రచారానికి వెళుతున్న ఆమె సూట్‌కేసును మన పోలీసులు తనిఖీ చేస్తారా? ఇంతవరకూ ఏ రాష్ట్రంలోనూ మహిళా హోమ్‌మంత్రి లేరు. అలాంటిది మొట్టమొదట మనరాష్ట్రంలోనే సబితా ఇంద్రారెడ్డిని హోమ్‌మినిస్టర్‌గా రాజన్న నిలబెట్టారు. సబితమ్మా! రాజన్న చేసిన మేలు మర్చిపోయావా? ఆ కుటుంబం మీకు చేసిన అన్యాయమేమిటి? నువ్వు అన్న అనుకుని రాఖీ కట్టిన విషయం కూడా మర్చిపోయావా?

ఎవరు ఎలా మారిపోయినా, రాష్ట్రానికి తప్పకుండా మంచిరోజులు వస్తాయి. ఏ ఒక్కరూ బాధపడనవసరం లేదు. మన గురించి, రాష్ట్రం గురించి రాజన్న కన్న కలలన్నీ పులిబిడ్డ జగన్ నిజం చేసేరోజు దగ్గరలోనే ఉంది.

- ఇంటూరి శేషకుమారి, విజయవాడ

అధిష్టానాన్ని ఢీకొట్టినందుకు ఇన్ని కష్టాలా?!

మాది మధ్యతరగతి కుటుంబం. మాకు ఐదు ఎకరాల పొలం ఉంది. చంద్రబాబుగారు ఉన్నప్పుడు కరెంటుబిల్లు కట్టలేక పొలం వదిలేశాం. మేం కూలిపని చేసుకుంటూ ఓ పూట తిని మరోపూట పస్తుండేవాళ్లం. మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రి అవగానే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వటంతో మా భూమిని పండించుకుంటూ మూడుపూటలా అన్నం తింటు న్నాం. మహానేత ఫొటో ఇంట్లో పెట్టుకుని పూజించుకుంటున్నాం. అంత మంచిమనిషి కుమారుడిని జైల్లో పెట్టడం మాకు బాధగా ఉంది. మాకు ఒక విషయం అర్థం కావడం లేదు... జగన్ ఏ తప్పు చేశాడని జైల్లో పెట్టారు? బహుశా నల్లకాలువ దగ్గర మహానేత మరణాన్ని తట్టుకోలేక గుండె ఆగిపోయి మరణించిన కుటుంబాలను వారి ఇళ్లకు పోయి ఓదారుస్తాను అని మాటిచ్చి, ఆ మాటమీద నిలబడినందుకా?

ఇచ్చినమాట నిలబెట్టుకునేందుకు విజయమ్మగారు, జగన్‌గారు ఢిల్లీ చుట్టూ తిరిగి ప్రాధేయపడినందుకా? మడమ తప్పనని పులివెందుల పులిబిడ్డ అధిష్టానాన్ని ఢీకొట్టినందుకా? 150మంది ఎమ్మెల్యేలు తనను సీఎంను చేయాలని సంతకాలు చేసినా జగన్ ఆ పదవిని తృణప్రాయంగా త్యజించినందుకా? వైఎస్సార్‌కి, జగన్‌కి ఉన్నది విశ్వసనీయత. నమ్మినవారికి ప్రాణాలనైనా ఇస్తారు. చంద్రబాబుగారిది నమ్మినవారిని వెన్నుపోటు పొడిచే బుద్ధి. మాటకోసం పదవులను త్యజించే బుద్ధి. పదవుల కోసం వెన్నుపోటు పొడిచే బుద్ధి. చంద్రబాబు, కాంగ్రెస్ బాబులు కలిసి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా అంతిమ విజయం జగన్‌దే!

- ఎస్.నారాయణరెడ్డి, సికింద్రాబాద్
Share this article :

0 comments: