ఫెళఫెళ ఉరుములతో మెరుపువేగంతో దూసుకొస్తాడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫెళఫెళ ఉరుములతో మెరుపువేగంతో దూసుకొస్తాడు

ఫెళఫెళ ఉరుములతో మెరుపువేగంతో దూసుకొస్తాడు

Written By news on Monday, January 7, 2013 | 1/07/2013

జగనంటే జనమురా - జనమే తన బలమురా
ప్రతిమనిషీ కోరుకునే నేతరా - ప్రతి గుండెలో ఉన్నాడురా
ఆపదలు ఎన్ని వచ్చినా - అడుగడుగున అడ్డు తగులుతున్నా
చిరునవ్వుతో పలకరిస్తాడు - త్వరలో మనల్ని పాలిస్తాడు.

రా! మిత్రమా... ఈ రాష్ట్రాన్ని శుద్ధి చేయాలి. 
రాబోయే ప్రభుత్వం మనదేనని
మన రాజన్న రుణం తీర్చుకుందామని
ఫెళఫెళ ఉరుములతో ఉప్పొంగే కెరటంలా
మెరుపు వేగంతో దూసుకురా!
నిన్ను ఆపడం ఎవరితరమిక
నువ్వే జనం... జనమే నువ్వైనప్పుడు
ఏ ఊచలు నిన్ను ఆపుతాయి? ఏ వ్యూహాలు నీకు అడ్డొస్తాయి?
నీవే మా నాయకుడివి... నీవే మా బలం... 
నీవే మా బంధం... నీవే మా యువరాజవి... 
ఎలుగెత్తి పాడుతున్నాడు ప్రతిపౌరుడూ
విను జగనన్నా! జయం జగనన్నా!!

- వి.సూరిబాబు, మామిడాడ, ఇర్రెపాక (పోస్ట్)

అయినవారికి ఆకుల్లో... కానివారికి కంచాల్లో!

పాదయాత్ర అంటే ప్రజానాయకులు, రాయకీయ నాయకులు ప్రజల ఇక్కట్లను, ప్రజల అవసరాలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా తమలో అంకితభావం పాదుకొల్పుకునే బృహత్తర కార్యక్రమం. ప్రజలు కూడా అదే రీతిలో స్పందించి; వేలాదిగా, లక్షలాదిగా స్వచ్ఛందంగా కదిలివచ్చి యాత్రలో పాల్గొని తమ బాధలు చెప్పుకోడానికి నాయకులు కల్పించే సదవకాశమే పాదయాత్ర. మనదేశంలో స్వాతంత్య్రానికి పూర్వం మహాత్మాగాంధీ ఇటువంటి పాదయాత్ర జరిపారు. స్వాతంత్య్రం వచ్చాక మన రాష్ర్టంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ‘ప్రజాప్రస్థానం’ పేరుతో పాదయాత్ర జరిపారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర చేపట్టారు. యాత్ర మధ్యలోనే కాంగ్రెస్‌వారు ఆయన్ని అరెస్టు చేయించడంతో ఓదార్పు మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత షర్మిలమ్మ ‘మరో ప్రస్థానం’ పేరిట పాదయాత్ర చేపట్టారు. ఈ మూడు యాత్రలకూ ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభించింది. అందుకు కారణం వై.ఎస్. కుటుంబంపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం. 

పాదయాత్రలో భాగంగా తను ఇచ్చిన హామీలన్నిటినీ వై.ఎస్.గారు ముఖ్యమంత్రి అయ్యాక నెరవేర్చారు. ప్రజలలో మమేకం అయి వారి కష్టసుఖాలు తెలుసుకుని, ఇవ్వని హామీలను కూడా అమలుపరిచారు. ఆయన హఠాన్మరణం అనంతరం జగన్ ఓదార్పుయాత్ర చేపడితే, ఆ ఆదరణకు జడిసిన పాలకపక్షం కుట్ర పన్ని ఆయన్ని జైలుకు పంపింది. అంతటితో ఆగకుండా దివంగతుడైన ఆయన తండ్రిపైన కూడా బురద జల్లింది. వై.ఎస్. హయాంలో జారీ అయిన 26 జీవోలు సక్రమమైనవి కావని అపవాదు వేసింది. జగన్ వ్యాపారాలలో, పరిశ్రమలలో పెట్టుబడి పెట్టిన వారిని కూడా విడిచిపెట్టలేదు. ఆ జీవోలు సక్రమమేనని తేలాక కూడా జగన్‌ని కానీ, మిగతావాళ్లని కానీ విడుదల చేయలేదు. 

ఈ ప్రభావం మున్ముందు పారిశ్రామికవేత్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రధాన అవరోధంగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ‘అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో...’ అన్నట్లు కాంగ్రెస్ అధిష్టానం- ప్రజలు నిరాకరించినవారిని భుజాలపైకి ఎక్కించుకుని, ప్రజానీకం అంగీకరించినవారిని ఇబ్బందులపాలు చేయడాన్ని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జగన్‌ని, ఆయన కుటుంబాన్ని ముప్పు తిప్పలు పెట్టడం ప్రజల హృదయాలను బాధిస్తోంది. అయినా పర్వాలేదు. కోట్లాదిమంది జగన్ వెంట ఉన్నారు. ఆయనపై తమకున్న అభిమానాన్ని; పాలక, ప్రతిపక్షాలపై ఉన్న అసహనాన్ని వచ్చే ఎన్నికల్లో తప్పక ప్రదర్శిస్తారు. ప్రజల అండ ఉన్న నాయకుడికి పరాజయమన్నదే ఉండదు. 

- కృష్ణకిషోర్, ధనలక్ష్మీపురం, నెల్లూరు జిల్లా


http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=55526&Categoryid=11&subcatid=19
Share this article :

0 comments: