కిరణ్ సలహాదారు బాబేనా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిరణ్ సలహాదారు బాబేనా!

కిరణ్ సలహాదారు బాబేనా!

Written By news on Sunday, January 6, 2013 | 1/06/2013


‘‘ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. బాబు సీఎంగా ఉన్న కాలంలో విద్యుత్‌పై ఇదే మాదిరిగా చార్జీలు పెంచి ప్రజల ముక్కుపిండి వసూలు చేశారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ చార్జీలు 5 సార్లు వందశాతం పెంచారు. అందుకే ప్రస్తుతం కిరణ్ మోపుతున్న విద్యుత్ భారంపై చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బి.జనక్ ప్రసాద్ మండిపడ్డారు. అధికారపక్షం, ప్రతిపక్షం కుమ్మక్కై సాగిస్తున్న అరాచకాన్ని ప్రజాపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందన్నారు. అడ్డూ అదుపూ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ప్రజాపక్షంగా వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. రూ. 10 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపేందుకు కిరణ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర చరిత్రలో మరెన్నడూ లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్ల కాలంలో ప్రజలపై రూ.30 వేల కోట్ల భారం మోపిందని వివరించారు. దేశంలో ఏరాష్ట్రం కూడా ఈ మాదిరిగా వ్యవహరించలేదన్నారు. 

కోతల కిరణ్: సీఎం తన పేరును ‘చీకటి కిరణ్’ లేదా ‘బాదుడు కిరణ్’ లేక ‘కోతల కిరణ్’గా మార్చుకుంటే సరిగ్గా సరిపోతుందని జనక్‌ప్రసాద్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జనరేషన్ కార్పొరేషన్, డిస్కంల అంతర్గత సామర్థ్యం పెంచుకోకుండా ప్రజలపై అడ్డదిడ్డంగా భారం మోపడం కిరణ్ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. పైగా తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు విద్యుత్‌పై సబ్సిడీని ఇప్పటికే ప్రభుత్వం చాలా భరిస్తోందని, ఇక ప్రజలు మోయక తప్పదని మీడియాకు లీకులివ్వడం సిగ్గుచేటన్నారు. 
Share this article :

0 comments: