మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా లీగల్ సెల్ కమిటీలను.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా లీగల్ సెల్ కమిటీలను..

మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా లీగల్ సెల్ కమిటీలను..

Written By news on Monday, January 28, 2013 | 1/28/2013

 సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదని ఆ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ చిత్తర్వు నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆదివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. జగన్‌పై అక్రమ కేసులు బనాయించి, వేధించడాన్ని భేటీ తీవ్రంగా ఖండించింది. 

ప్రతి మండల ంలో లీగల్ సెల్ కమిటీ: కాంగ్రెస్, టీడీపీలు కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలపై బనాయిస్తున్న అక్రమ కేసుల విషయంలో న్యాయసహాయం అందించేందుకు వీలుగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా లీగల్ సెల్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన లీగల్ సెల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, పీఎన్వీ ప్రసాద్‌తో పాటు అన్ని జిల్లాలకు చెందిన పార్టీ లీగల్ విభాగం కన్వీనర్లు పాల్గొన్నారు. 
Share this article :

0 comments: