ఎన్ని వందల కి.మీ. నడిచినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్ని వందల కి.మీ. నడిచినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు

ఎన్ని వందల కి.మీ. నడిచినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు

Written By news on Friday, January 11, 2013 | 1/11/2013

ఎన్ని వందల కి.మీ. నడిచినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు
సీఎంగా ఉన్నప్పటి వాగ్దానాలు ఏమయ్యాయి?
విద్యుత్ చార్జీలు పెంచినా విమర్శించవేం?
నువ్వు రుణమాఫీ చేస్తానంటే ప్రజలు నమ్మాలా?

సాక్షి, హైదరాబాద్: వంద రోజులు పూర్తి చేశానని పండుగ చేసుకుంటూ ‘పైలాన్’ను ఆవిష్కరించుకున్న చంద్రబాబు తన పాదయాత్రలో చెప్పిన అబద్ధం మళ్లీ చెప్పకుండా వందలాది అబద్ధాలాడి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... బాబు తన యాత్రను తొలి నుంచీ సినీ ప్రముఖుల సలహాలతోనే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ ప్రజాప్రస్థానానికి, బాబు పాదయాత్రకు నక్కకు, నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందన్నారు. ఎవరు ఎలాంటి సమయంలో, ఎన్ని రోజుల్లో పాదయాత్ర చేశారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. 

వంద రోజులు కాదు కదా, ఇంకా ఎన్ని వందల, వేల కిలోమీటర్లు నడిచినా ప్రజలు బాబును విశ్వసించరన్నారు. బాబు పాదయాత్రలో ఎన్ని అబద్ధాలు చెప్పారో అంబటి ఉదహరిస్తూ... ‘‘ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుందని తాను ఆనాడే చెప్పానని, ప్రస్తుత సంక్షోభానికి అదే కారణమని యాత్రలో బాబు చెప్పారు... అంటే దీని ఉద్దేశం ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని పరోక్షంగా చెప్పినట్లు కాదా? తాను అధికారంలోకి వస్తే విద్యార్థులకు సైకిళ్లు ఇస్తానని చెబుతున్నాడు. అలాగైతే 1999లో విద్యార్థినులకు సైకిళ్లు ఇస్తానని బాబు ఇచ్చిన హామీ ఏమైంది? కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్య హామీ ఏమైంది?’’ అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తానని, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తానే ప్రవేశపెట్టానని బాబు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అవును నిజమే... తన కుమారుడు లోకేష్‌బాబు చదువుకోవడానికి సత్యం రామలింగరాజు నుంచి డబ్బు తీసుకుని ఫీజు చెల్లించారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

కిరణ్ సర్కారును విమర్శించరేం?

వైఎస్ చేసిన తప్పుల వల్లనే ఇపుడు విద్యుత్ సమస్యలు తలెత్తాయని బాబు విమర్శించడంపై అంబటి అభ్యంతరం తెలిపారు. ఇప్పటి కిరణ్ సర్కారు చేతగానితనాన్ని ఏమనకుండా వైఎస్‌ను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘రోశయ్య సీఎంగా ఉన్నపుడు విద్యుత్ చార్జీలు పెంచితే... నువ్వు నిరసన ప్రకటించకుండా మౌనంగా ఎందుకు ఉన్నావు? ఇపుడు కిరణ్ సర్కారు మళ్లీ చార్జీలు పెంచితే ఎందుకు విమర్శించడం లేదు?’’ అని నిలదీశారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తానని బాబు మభ్యపెడుతున్నారన్నారు. 2004కు ముందు అధికారంలో ఉన్నపుడు బాబుకు రైతుల రుణాల మాఫీ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చెందిన సర్వేల ఘనాపాటి ఒకరు ఇటీవల చేయించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 191 అసెంబ్లీ స్థానాలు, టీడీపీకి 11, కాంగ్రెస్‌కు 29, టీఆర్‌ఎస్‌కు 48 స్థానాలు వస్తాయని వెల్లడైందన్న విషయం తెలుసుకున్న బాబుకు మతి భ్రమించిందని... నైరాశ్యంలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. 
Share this article :

0 comments: